MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • Telangana Jobs : తెలంగాణ మహిళలకు సూపర్ ఛాయిస్ ... మీ ఊళ్లోనే ప్రభుత్వ ఉద్యోగమిచ్చి రూ.2 లక్షలు ఇస్తారట

Telangana Jobs : తెలంగాణ మహిళలకు సూపర్ ఛాయిస్ ... మీ ఊళ్లోనే ప్రభుత్వ ఉద్యోగమిచ్చి రూ.2 లక్షలు ఇస్తారట

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆడబిడ్డలకు సూపర్ ఛాయిస్ ఇస్తోంది. మీరు కొద్దిగా చదువుకుంటే చాలు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగమిచ్చి రూ.2 లక్షలు కూడా ఇవ్వనున్నారు. ఇందుకోసం మీరు ఏం చేయాలంటే…

2 Min read
Author : Arun Kumar P
| Updated : May 29 2025, 11:56 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు
Image Credit : Getty

తెలంగాణలో భారీగా అంగన్వాడీ ఉద్యోగాలు

Anganwadi Jobs : తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా భారీగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. రాష్ట్రవ్యాప్తంగా 14,236 అంగన్వాడీ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది.. టీచర్లు, హెల్పర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు స్వయంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రకటించారు. ఇప్పటికే నోటిఫికేషన్ జారీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ప్రభుత్వం. అంగన్వాడీ ఉద్యోగాల భర్తీ ఫైల్ పై మంత్రి సీతక్క సంతకం కూడా చేసారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్
Image Credit : our own

అంగన్వాడీ ఉద్యోగులకు గుడ్ న్యూస్

ఇలా భారీ ఉద్యోగాల భర్తీ ప్రకటనతో మహిళలకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం తాజాగా మరో గుడ్ న్యూస్ తెలిపింది. అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పదవీ విరమణ ప్రయోజనాలు పెంచుతూ రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే రిటైరయ్యే అంగన్‌వాడీ టీచర్లకు రూ.2 లక్షలు.. అంగన్‌వాడీ హెల్పర్లకు లక్ష రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు ఆర్థిక శాఖ ఆమోదం కూడా లభించింది. త్వరలోనే అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి.

Related Articles

Related image1
TTD Jobs : హిందూ యువతకు బంపరాఫర్ .. టిటిడిలో ఉద్యోగాలే ఉద్యోగాలు
Related image2
Jobs: 12వ తరగతి పాసైతే చాలు.. భారీ వేతనంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు
35
అంగన్వాడీ ఉద్యోగులకు జీతాల పెంపు
Image Credit : Getty

అంగన్వాడీ ఉద్యోగులకు జీతాల పెంపు

గతంలోనే తెలంగాణలోని అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లకు జీతాలను భారీగా పెంచారు. ఇక ఇటీవల మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్ కల్పించి అంగన్వాడీ టీచర్లకు సమానంగా జీతాలు పెంచారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి 14 వేలకు పైగా అంగన్వాడీ ఉద్యోగాల భర్తీకి సిద్దమయ్యింది ప్రభుత్వం. తాజాగా అంగన్వాడీలకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా అంగన్వాడీలకు వరుసగా గుడ్ న్యూస్ లు చెబుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. 

45
తెలంగాణ మహిళలకు సూపర్ ఛాయిస్
Image Credit : Getty

తెలంగాణ మహిళలకు సూపర్ ఛాయిస్

తెలంగాణవ్యాప్తంగా 35 వేలకుపైగా అంగన్వాడీ కేంద్రాలున్నాయి... ప్రతి అంగన్వాడీలో ఓ టీచర్, ఓ హెల్పర్ ఉండాలి. అయితే కొన్ని అంగన్వాడీలు టీచర్లు లేకుండా కొనసాగుతున్నాయి... మరికొన్నిట్లో హెల్పర్ల పని కూడా టీచర్లే చేయాల్సి వస్తోంది. దీంతో చిన్నారులకు అంగన్వాడీల్లో సరైన సేవలు అందించలేకపోతున్నారు. 

ఇలా అంగన్వాడీల్లో ఉద్యోగుల కొరతను గుర్తించిన రేవంత్ సర్కార్ రాబోయే విద్యాసంవత్సరంలో  టీచర్లు, హెల్పర్ల కొరత లేకుండా చూడాలని సంబంధిత శాఖను ఆదేశించింది. దీంతో అంగన్వాడీలో ఉద్యోగాల భర్తీకి సంబంధించి వేగంగా నిర్ణయాలు తీసుకున్నారు… ఈ ఫైలు వేగంగా కదిలింది. ఇందులో భాగంగానే 6,399 టీచర్లు, 7,837 హెల్పర్ పోస్టులు మొత్తంగా 14 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి సర్వం సిద్దమయ్యింది.

55
అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలివే
Image Credit : our own

అంగన్వాడీ ఉద్యోగాలకు అర్హతలివే

కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హతతో అంగన్వాడీ టీచర్ల భర్తీ చేపట్టనున్నారు... గతంలో పదో తరగతి అర్హతతోనే ఈ పోస్టులు భర్తీచేయగా ఇప్పుడు విద్యార్హతలు కొంచెం పెంచబోతున్నట్లు తెలుస్తోంది.  ఇక 18 నుండి 35 ఏళ్లలోపు మహిళలు ఈ ఉద్యోగాలకు అర్హులు... వీరు ఆ అంగన్వాడీ పరిధిలోనే శాశ్వత నివాసం కలిగివుండాలి. 

అంగన్వాడీ ఉద్యోగులకు మంచి సాలరీలున్నాయి… టీచర్లకు రూ.12,500 నుండి రూ.13,500 వరకు, హెల్పర్లకు రూ.8000 సాలరీ ఉంటుంది. స్వస్థలంలోనే ఉద్యోగం, మంచి జీతం,  భద్రత ఉండటంతో అంగన్వాడీ టీచర్ పోస్టులకు డిమాండ్ పెరిగింది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ఉద్యోగాలు, కెరీర్
తెలంగాణ
విద్య
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
వేగంగా మారుతోన్న తెలంగాణ రాజ‌కీయం.. మిషన్ కొండా సురేఖ మొదలైందా.?
Recommended image2
Now Playing
ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
Recommended image3
Weather Update: 5 తుపాన్లు.. మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో 4 రోజులు భారీ వర్షాలు.. ఏ ఏ జిల్లాల్లో అంటే?
Related Stories
Recommended image1
TTD Jobs : హిందూ యువతకు బంపరాఫర్ .. టిటిడిలో ఉద్యోగాలే ఉద్యోగాలు
Recommended image2
Jobs: 12వ తరగతి పాసైతే చాలు.. భారీ వేతనంతో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో ఉద్యోగాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved