MalayalamNewsableKannadaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Jobs
  • Career Guidance
  • ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం... మోదీ సర్కార్ కీలక చర్యలు

ప్రైవేట్ ఉద్యోగుల జీతాలు భారీగా పెరిగే అవకాశం... మోదీ సర్కార్ కీలక చర్యలు

భారతదేశంలో గ్రాడ్యుయేట్లకు కనీసం రూ.30,000 జీతం ఇవ్వాలా? కేంద్రం ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగాలకు ఒకే రూల్ పెడుతుందా?

Arun Kumar P | Published : Apr 03 2025, 09:57 PM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
18
Salary

Salary

కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పేలా కనిపిస్తోంది. ముఖ్యంగా చాలిచాలని జీతాలతో ఉద్యోగాలు చేస్తూ ఇబ్బంది పడుతున్న ప్రభుత్వ, ప్రైవేట్ రంగ ఉద్యోగులకు జీతాలు పెంచే యోచనలో మోదీ సర్కార్ ఉన్నట్లు తెలస్తోంది. ఇందుకోసం ఇప్పటికే కసరత్తు జరుగుతోందని... త్వరలోనే ఈ వేతనాల సవరణకు సంబంధించిన బిల్లు పార్లమెంట్ ముందుకు వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. 

28
Salary

Salary

ఈ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందితే దేశవ్యాప్తంగా కనీస వేతనాలు పెరగనున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలన్నింటిలో కనీస జీతం రూ. 20,000 ఉండేలా కేంద్రం నిర్ణయం తీసుకుంటోందని అధికారిక వర్గాల నుండి అందుతున్న సమాచారం. అయితే బిల్లు పార్లమెంట్ ముందుకు వస్తే పూర్తి వివరాలు తెలుస్తాయి. 

38
Salary

Salary

ప్రస్తుతం ధరల పెరుగుదలకు, జీతాలకు సంబంధం లేకుండా ఉంటోంది. చాలిచాలని జీతాలతో సామాన్యుడి కడుపు నిండడం కూడా కష్టంగా ఉంది. దీంతో దేశ ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించడానికి కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకోవచ్చు.

48
Salary

Salary

భారతదేశంలో చాలా మంది ఉద్యోగులు తక్కువ జీతానికి పనిచేస్తున్నారు. చాలా మంది ఉద్యోగులకు వారి శ్రమకు తగిన వేతనం లేదు. ఈ గ్యాప్‌ను పూడ్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

58
Salary

Salary

కొత్త బిల్లు వస్తే కనీస వేతనం రూ. 20,000 ఉంటుందని సమాచారం. అంటే ప్రభుత్వ లేదా ప్రైవేట్ సంస్థల్లో రూ. 20,000 కంటే తక్కువ జీతం ఇవ్వకూడదు.

68
Salary

Salary

ఈ బిల్లులో వార్షిక జీతం పెంపుదల గురించి కూడా ఉంటుంది. ఎక్కువ జీతం తీసుకునే వారి జీతాలు తగ్గకుండా మోదీ ప్రభుత్వం చూసుకుంటుందట.

78
Salary

Salary

విద్యను మూడు స్లాబులుగా విభజించవచ్చు. ఆ మూడు స్లాబుల ఆధారంగా జీతాలు ఇస్తారు. హయ్యర్ సెకండరీ పాసైన వారికి కనీసం రూ. 20,000, గ్రాడ్యుయేట్‌కు రూ. 30,000 కంటే తక్కువ జీతం ఇవ్వకూడదు.

88
Salary

Salary

మీకు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంటే కనీస జీతం రూ. 35,000 ఉంటుంది. మోదీ ప్రభుత్వం ఇలాంటి బిల్లు తీసుకురానుందని తెలుస్తోంది. అయితే ఈ వార్త నిజమో కాదో మోదీ ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. అయితే ఈ కొత్త బిల్లు ఈ ఏడాది పాస్ కావచ్చని అధికారిక వర్గాల సమాచారం. 

Arun Kumar P
About the Author
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు. Read More...
ఉద్యోగాలు, కెరీర్
భారత దేశం
నరేంద్ర మోదీ
విద్య
 
Recommended Stories
Top Stories