- Home
- Business
- Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Business Ideas : ఉద్యోగం చేస్తూనే ఈ సైడ్ బిజినెస్ చేశారో.. నెలనెలా వేలల్లో ఎక్ట్రా ఇన్కమ్ పక్కా..!
Side Business Ideas : ఈ రోజుల్లో కేవలం ఉద్యోగంపై ఆధారపడి జీవించడం, కేవలం జీతం డబ్బులతో ఖర్చులు గడవడం కష్టం. అందుకే ఈ తరం ఉద్యోగంతో పాటు సైడ్ ఇన్‌కమ్ గురించి సీరియస్‌గా ఆలోచిస్తోంది. మరి ఉద్యోగంతో పాటు సైడ్‌గా ఏ పనులు చేయవచ్చో తెలుసుకోండి.

సైడ్ బిజినెస్ ఐడియాస్
Side Business Ideas : మీరు బాగా మాట్లాడగలరా, ఇంగ్లీష్ లో లేదా మీ మాతృభాషలో ఆకట్టుకునేలా రాయగలరా? కెమెరా భయం లేకుండా సౌకర్యంగా ఉంటారా? అయితే 2026 కంటెంట్ క్రియేటర్లకు బెస్ట్ ఇయర్. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లకు రోజూ చాలా కంటెంట్ అవసరం అవుతోంది. ఇలా వీడియోలు చేసిపెట్టడం ద్వారా చిన్న బ్రాండ్లు కూడా డబ్బులిస్తున్నాయి.
ఫ్రీలాన్సింగ్ చేయండి
చాలా కంపెనీలు ఫుల్-టైమ్ ఉద్యోగుల కన్నా ఫ్రీలాన్సర్లనే నమ్ముతున్నాయి. ముఖ్యంగా అప్పటికప్పుడు ఉపయోగపడే డిజైన్, వీడియో ఎడిటింగ్, రైటింగ్ వంటి స్కిల్స్ కలిగినవారికి మంచి డిమాండ్ ఉంది. ఉద్యోగం తర్వాత లేదా వీకెండ్స్‌లో ఈ పని చేసి నెలకు 15-30 వేల రూపాయలు సంపాదించవచ్చు.
అడ్వర్టైజ్మెంట్ చేసిపెట్టండి
ఇప్పుడు పెద్దపెద్ద సంస్థల నుండి లోకల్ బిజినెస్ వరకు ఆన్‌లైన్‌లో ఉండాలనుకుంటున్నాయి. వారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో పోస్టులు, ఆఫర్ మెసేజ్‌లు, వాట్సాప్ ఆటో రిప్లైలు సెట్ చేసివ్వండి. ఒక్కో వ్యాపారం నుంచి నెలకు 3-5 వేల రూపాయల వరకు సంపాదించవచ్చు.
డిజిటల్ ప్రోడక్ట్స్ కి మంచి గిరాకీ...
ఈ-బుక్స్, పిడిఎఫ్ గైడ్స్, ఆన్‌లైన్ కోర్సులు వంటి డిజిటల్ ప్రొడక్ట్స్‌కు 2026లో మంచి డిమాండ్ ఉంటుంది. ఒక్కసారి తయారు చేస్తే చాలు, అమ్మిన ప్రతిసారీ డబ్బు వస్తుంది. ఇది మంచి పాసివ్ ఇన్‌కమ్ అవుతుంది.
ఆన్లైన్ లో వస్తువులు అమ్మండి
ఇప్పుడు సైడ్ ఇన్కమ్ కోసం షాపు పెట్టక్కర్లేదు. సోషల్ మీడియా, క్విక్ కామర్స్ యాప్స్ ద్వారా స్టాక్ లేకుండానే వస్తువులు అమ్మొచ్చు. 2026లో రీసెల్లింగ్‌కు మంచి డిమాండ్ ఉంటుంది. నమ్మకంతో అమ్మకాలు చేయవచ్చు.
ఇవి కూడా మంచి ఇన్కమ్ ఉండే సైడ్ బిజినెస్
ప్లంబర్, ట్యూటర్ వంటి లోకల్ సర్వీసులకు టెక్నాలజీ జోడించి సైడ్ ఇన్‌కమ్ పెంచుకోవచ్చు. అలాగే జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ... ర్యాపిడో, ఊబర్, ఓలా వంటి యాప్ ఆధారిత రవాణా సేవలను కూడా సైడ్ ఇన్కమ్ కోసం వాడుకోవచ్చు,
గమనిక: ఈ కథనం సమాచారం కోసం మాత్రమే. ఏదైనా పని చేసే ముందు నిపుణుల సలహా తప్పనిసరి.

