MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • International
  • Prambanan Temple: ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని భారత్ ఎందుకు పునర్నిర్మిస్తోంది?

Prambanan Temple: ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని భారత్ ఎందుకు పునర్నిర్మిస్తోంది?

Prambanan Temple: ఇండోనేషియాలోని చరిత్రాత్మక ప్రంబనన్ హిందూ దేవాలయాన్ని పునర్నిర్మించడానికి భారత్ చేతులు కలిపింది. ఆ ఆలయంలో భారత్ కు సంబంధం ఏంటి? ఈ పురాతన ఆలయ విశేషాలు, భారత్‌తో ఉన్న సంబంధాల పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 08 2026, 03:21 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ప్రంబనన్ ఆలయానికి భారత్ కు సంబంధం ఏంటి?
Image Credit : Gemini

ప్రంబనన్ ఆలయానికి భారత్ కు సంబంధం ఏంటి?

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో ఉన్న ప్రంబనన్ ఆలయానికి ప్రతి సంవత్సరం మిలియన్ల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. అసలు ఈ ఆలయానికి, భారతదేశానికి ఉన్న సంబంధం ఏంటి? భారత్ ఈ పురాతన ఆలయాన్ని ఎందుకు పునర్నిర్మిస్తోంది? ఈ విషయాలన్నీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారాయి.

భారతదేశం, ఇండోనేషియా దేశాల మధ్య సాంస్కృతిక, ఆధ్యాత్మిక బంధం ఈనాటిది కాదు. శతాబ్దాల నాటి చరిత్ర దీనికి సాక్ష్యంగా నిలుస్తోంది. 9వ శతాబ్దంలో నిర్మించిన ఈ చరిత్రాత్మక ప్రంబనన్ ఆలయ కాంప్లెక్స్, భారత ఉపఖండానికి, ఆగ్నేయ ఆసియాకు మధ్య జరిగిన మతపరమైన, చారిత్రక మార్పిడికి అద్దం పడుతోంది. రెండు దేశాల మధ్య ఉన్న ఈ బలమైన బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఇప్పుడు సరికొత్త అడుగులు పడ్డాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మహాశివుడి ఎత్తైన గోపురం.. హిందూ త్రిమూర్తుల నిలయం
Image Credit : Getty

మహాశివుడి ఎత్తైన గోపురం.. హిందూ త్రిమూర్తుల నిలయం

ఇండోనేషియాలోని యోగ్యకర్త సమీపంలో ఉన్న ప్రంబనన్, ఆ దేశంలోనే అతిపెద్ద హిందూ దేవాలయ సముదాయం. హిందూ మతంలోని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, శివుడు కోలువైన ఆలయం ఇది. ఈ కాంప్లెక్స్ మధ్యలో త్రిమూర్తుల కోసం మూడు భారీ ఉపాలయాలు ఉన్నాయి. వీటిలో శివుడి ఆలయం అన్నింటికంటే ఎత్తైనది. ఇది దాదాపు 47 మీటర్ల ఎత్తుతో గంభీరంగా కనిపిస్తుంది. హిందూ విశ్వాన్ని ప్రతిబింబించేలా ఈ ఆలయ నిర్మాణాన్ని అప్పట్లో డిజైన్ చేశారు. ఒకప్పుడు ఈ ప్రాంగణంలో మొత్తం 240 ఆలయాలు ఉండేవని చరిత్ర చెబుతోంది. ఈ అద్భుతమైన రాతి శిల్పకళను చూడటానికే ప్రపంచం నలుమూలల నుండి టూరిస్టులు ఇక్కడికి తరలివస్తుంటారు.

36
రాతి గోడలపై రామాయణ కావ్యం.. కామిక్ బుక్ లాంటి అనుభూతి
Image Credit : Getty

రాతి గోడలపై రామాయణ కావ్యం.. కామిక్ బుక్ లాంటి అనుభూతి

ఈ ఆలయాల గోడలపై చెక్కిన రాతి శిల్పాలు పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. భారతీయ పురాతన ఇతిహాసమైన రామాయణాన్ని ఈ గోడలపై అత్యంత అద్భుతంగా చెక్కారు. ఆలయ ప్రాంగణంలో నడుస్తూ ఉంటే, రాముడు, సీత కథను ఒక కామిక్ బుక్ లాగా విజువల్ గా చూస్తూ చదవొచ్చు. ఇండోనేషియా వెర్షన్ రామాయణాన్ని ఇక్కడి శిల్పాల్లో అద్భుతంగా ఆవిష్కరించారు.

ఇక ఇక్కడ జరిగే మరో ప్రధాన ఆకర్షణ 'రామాయణ బ్యాలెట్'. ప్రతి సంవత్సరం మే, అక్టోబర్ నెలల మధ్య, పౌర్ణమి రాత్రుల్లో ఈ ప్రంబనన్ ఆలయ బ్యాక్‌డ్రాప్‌లో ఓపెన్-ఎయిర్ థియేటర్ లో ఈ ప్రదర్శన ఇస్తారు. లైట్లతో వెలిగిపోయే ఆలయాల ముందు, సాంప్రదాయ జావానీస్ నృత్యం, సంగీతంతో రామాయణ కథను కళ్లముందు ఉంచుతారు. ఈ అద్భుతాన్ని చూడటానికి మిలియన్ల మంది తరలివస్తుంటారు.

46
భారత్ చేతుల్లోకి పునర్నిర్మాణం.. రంగంలోకి ఏఎస్ఐ
Image Credit : Getty

భారత్ చేతుల్లోకి పునర్నిర్మాణం.. రంగంలోకి ఏఎస్ఐ

రెండు దేశాల ఉమ్మడి నాగరికత వారసత్వాన్ని కాపాడటానికి భారతదేశం ఇప్పుడు ఇండోనేషియా ప్రంబనన్ ఆలయాన్ని పునర్నిర్మిస్తోంది. భారత ప్రభుత్వ యాక్ట్ ఈస్ట్ విధానంలో భాగంగా ఈ సాంస్కృతిక దౌత్యానికి శ్రీకారం చుట్టారు. ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టును ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా లీడ్ చేస్తోంది. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తించిన ఈ ఆలయాన్ని పూర్వ వైభవానికి తీసుకురావడానికి ఏఎస్ఐ నిపుణులు రంగంలోకి దిగారు.

56
మోదీ, ప్రబోవో సుబియాంతో సంయుక్త ప్రారంభం
Image Credit : Getty

మోదీ, ప్రబోవో సుబియాంతో సంయుక్త ప్రారంభం

ఈ చరిత్రాత్మక పరిరక్షణ ప్రాజెక్టును భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో సంయుక్తంగా ప్రారంభించారు. యోగ్యకర్తలో జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో వీరిద్దరూ కలిసి ప్రాజెక్టుకు సంబంధించిన ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ భాగస్వామ్యం రెండు దేశాల మధ్య ఉన్న బలమైన అంతర్జాతీయ సంబంధాలకు, సాంస్కృతిక బంధానికి నిదర్శనంగా నిలిచింది.

66
అనాస్టైలోసిస్ పద్ధతి.. పజిల్ లాగా అమర్చే టెక్నిక్
Image Credit : Getty

అనాస్టైలోసిస్ పద్ధతి.. పజిల్ లాగా అమర్చే టెక్నిక్

ఈ పురాతన ఆలయాన్ని పునర్నిర్మించడానికి ఏఎస్ఐ అనాస్టైలోసిస్ అనే ప్రత్యేకమైన పురావస్తు సాంకేతికతను ఉపయోగిస్తోంది. అంటే, కూలిపోయిన లేదా దెబ్బతిన్న పురాతన కట్టడాలను వాటి అసలు రాళ్లను ఉపయోగించే మళ్లీ నిర్మించడం అన్నమాట. రాళ్లన్నింటినీ ఒక పజిల్ లాగా ఒకదానితో ఒకటి అమర్చి, ఆలయానికి ఎలాంటి నష్టం జరగకుండా, దాని చారిత్రక ప్రామాణికత దెబ్బతినకుండా జాగ్రత్తగా రీబిల్డ్ చేస్తారు. ఈ వినూత్న పద్ధతి వల్ల ఆలయం తన పాత రూపాన్ని, పవిత్రతను కోల్పోకుండా ఉంటుంది.

భారతదేశం, ఇండోనేషియా మధ్య ఉన్న ఈ లోతైన నాగరికత సంబంధాల వల్లే, అంతర్జాతీయ పరిరక్షణ భాగస్వామ్యాలు ఈ ఉమ్మడి వారసత్వాన్ని రాబోయే తరాల కోసం కాపాడుతున్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రపంచం
భారత దేశం
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image2
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Recommended image3
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Related Stories
Recommended image1
Telangana New Airports: హైదరాబాద్ వెళ్లక్కర్లేదు.. తెలంగాణలో మరో 3 జిల్లాలకు ఎయిర్‌పోర్ట్‌లు.. ఈ ప్రాంతాల రూపురేఖలు ఛేంజ్
Recommended image2
Best Beer in India: ఇండియాలో బెస్ట్ బీర్ ఏది? బీర్ లవర్స్ టాప్ 5 ఫేవరెట్స్ ఇవే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved