MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?

ఈ భార‌తీయుడు లేకపోయుంటే ఎంత దారుణం జ‌రిగేదో.. 26/11 త‌ర‌హా దాడి త‌ప్పిందా.?

Flydubai: సెప్టెంబర్‌ 30న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో చోటుచేసుకున్న తీవ్ర ఘటన ప్ర‌పంచాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. దుబాయ్ నుంచి ఇజ్రాయిల్ వెళ్తున్న విమానంలో కాక్‌పిట్‌లో చోటు చేసుకున్న ఘ‌ట‌న అంద‌రినీ షాక్‌కి గురి చేసింది.

2 Min read
Author : Narender Vaitla
| Updated : Oct 01 2026, 02:57 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
FZ1073 విమానంలో అసలేం జరిగింది?
Image Credit : X

FZ1073 విమానంలో అసలేం జరిగింది?

సెప్టెంబర్‌ 30న దుబాయ్‌ నుంచి టెల్‌అవీవ్‌కు వెళ్తున్న ఫ్లైదుబాయ్‌ FZ1073 విమానంలో ప్రయాణ సమయంలో కాక్‌పిట్‌లో తీవ్ర ఘటన చోటుచేసుకుంది. విమానం సౌదీ అరేబియా గగనతలంలో ఉండగా పైలట్ల మధ్య ఘర్షణ జరిగినట్లు తొలుత సమాచారం వెలువడింది. అనంతరం కో-పైలట్‌ భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌పై కత్తితో దాడి చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో విమానంలో ఒక్కసారిగా అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఫ్లైట్‌ ట్రాకింగ్‌ డేటా ప్రకారం విమానం కొన్ని సెకన్ల వ్యవధిలోనే దాదాపు 14,300 అడుగుల ఎత్తు కోల్పోయింది. అత్యవసర పరిస్థితిని సూచించే కోడ్‌లను కూడా విమానం ప్రసారం చేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
గాయపడినా కెప్టెన్‌ మచ్చార్‌ సమయస్ఫూర్తి
Image Credit : Grok

గాయపడినా కెప్టెన్‌ మచ్చార్‌ సమయస్ఫూర్తి

దాడిలో తీవ్రంగా గాయపడిన కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ పరిస్థితి విషమంగా ఉన్నప్పటికీ కాక్‌పిట్‌ తలుపును తెరవగలిగినట్లు ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా రిపోర్టులు వెల్లడించాయి. దీంతో ప్రయాణికులు, సిబ్బంది కాక్‌పిట్‌లోకి ప్రవేశించి దాడి చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకునే అవకాశం లభించింది. విమానంలో ప్రయాణిస్తున్న కొందరు ఆఫ్‌-డ్యూటీ పైలట్లు కూడా పరిస్థితిని చక్కదిద్దడంలో సహకరించినట్లు సమాచారం. అనంతరం విమానాన్ని టెల్‌అవీవ్‌కు బదులుగా సౌదీ అరేబియాలోని టబుక్‌ విమానాశ్రయానికి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్‌ అయింది. ఫ్లైదుబాయ్‌ కూడా విమానం సురక్షితంగా టబుక్‌లో దిగిందని, ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారికంగా తెలిపింది.

🚨 BREAKING: A pilot aboard Flydubai flight FZ1073 from Dubai to Tel Aviv attacked the other pilot and attempted to seize control of the aircraft in terror attack.

The plane, carrying 174 Israeli passengers, plunged 14,000 feet before the situation was brought under control and… pic.twitter.com/FAgyt7dOpK

— Combat Antisemitism Movement (@CombatASemitism) September 30, 2026

35
విమానాన్ని కూల్చే ప్రయత్నమా?
Image Credit : X

విమానాన్ని కూల్చే ప్రయత్నమా?

కాక్‌పిట్‌లో జరిగిన ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ.. విమానాన్ని ఉద్దేశపూర్వకంగా కూల్చే ప్రయత్నం జరిగిందనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. ఇజ్రాయెల్‌ అధికారులు ఘటనను తీవ్ర భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు. ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు కూడా కో-పైలట్‌ విమానాన్ని కూల్చేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. అయితే ఘటనకు సంబంధించిన పూర్తి కారణాలు, దాడి వెనుక ఉద్దేశం అధికారిక దర్యాప్తు పూర్తయ్యే వరకు స్పష్టంగా తేలాల్సి ఉంది. ఈ ఘటనలో భారతీయ కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ పాత్రపై అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. మచ్చార్‌ గతంలో స్పైస్‌జెట్‌లో పనిచేశారని, 2022 నుంచి ఫ్లైదుబాయ్‌లో బోయింగ్‌ 737 విమానాలకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.

45
టబుక్‌ ఆసుపత్రిలో కెప్టెన్‌ మచ్చార్‌కు చికిత్స
Image Credit : X

టబుక్‌ ఆసుపత్రిలో కెప్టెన్‌ మచ్చార్‌కు చికిత్స

కాక్‌పిట్‌లో జరిగిన దాడిలో గాయపడిన కెప్టెన్‌ మచ్చార్‌ను సౌదీ అరేబియాలోని టబుక్‌ ఆసుపత్రికి తరలించారు. ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. తాజా స‌మాచారం ప్రకారం ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత అధికార యంత్రాంగం ఆయన ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించింది. విమానం సురక్షితంగా ల్యాండ్‌ కావడంతో ప్రయాణికులందరూ ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో కెప్టెన్‌ మచ్చార్‌తో పాటు ప్రయాణికులు, సిబ్బంది సమయస్ఫూర్తిగా వ్యవహరించడం కీలకంగా మారింది. అయితే ఘటనకు సంబంధించిన ప్రతి అంశాన్ని అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే స్పష్టంగా నిర్ధారించాల్సి ఉంటుంది.

55
మోదీ ప్రశంసలు.. 9/11 తరహా విషాదం తప్పిందంటూ వ్యాఖ్యలు
Image Credit : X

మోదీ ప్రశంసలు.. 9/11 తరహా విషాదం తప్పిందంటూ వ్యాఖ్యలు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చార్‌ చూపిన ధైర్యాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. మచ్చార్‌ సమయస్ఫూర్తి, ధైర్యంతో వ్యవహరించడం వల్ల భారీ విషాదం తప్పిందని మోదీ పేర్కొన్నారు. 9/11 తరహా పెను ప్రమాదం తప్పించడంలో ఆయన పాత్రను ప్రధాని ప్రత్యేకంగా ప్రస్తావించారు. మరోవైపు ఘటనపై దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌కు వెళ్లే, అక్కడి నుంచి వచ్చే విమానాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఫ్లైదుబాయ్‌ ప్రకటించింది. సంబంధిత అధికారులు దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించే వరకు పరిస్థితిని సమీక్షిస్తామని సంస్థ తెలిపింది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News. He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor. He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
10 నిమిషాల్లో 1.5 లీట‌ర్ల‌ కూల్‌డ్రింక్‌ తాగిన యువ‌కుడు.. ఆ త‌ర్వాత ఏం జ‌రిగిందో తెలిస్తే మైండ్ బ్లాంక్‌
Recommended image2
అమెరికా సైనికులు ఎందుకు ఆత్మ‌హ‌త్య‌కు ప్ర‌య‌త్నిస్తున్నారు.? అస‌లేం జ‌రుగుతోంది.?
Recommended image3
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Related Stories
Recommended image1
5 నెల‌ల్లో 2.5 కోట్ల వ్యూస్‌.. పెళ్లి భ‌ర‌త్ అయినా, గ‌ణేశ్ నిమ‌జ్జ‌న‌మైనా ఈ పాట ఉండాల్సిందే
Recommended image2
స‌ముద్రాలు ఒక్క‌సారిగా మంచినీటిగా మారితే ఏమ‌వుతుందో తెలుసా.? విప‌త్తు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved