MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • International
  • India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !

India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !

India Vs China : చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని అమెరికా సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలెంట్, టెక్నాలజీ, సప్లై చైన్ రంగాల్లో చైనాకు గట్టి పోటీ ఇచ్చే సత్తా కేవలం భారత్‌కే ఉందని అమెరికా అధికారి జాకబ్ హెల్బర్గ్ అన్నారు.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 30 2026, 06:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇది భారత్ సత్తా.. అమెరికా సంచలన ప్రకటన
Image Credit : ChatGPT

ఇది భారత్ సత్తా.. అమెరికా సంచలన ప్రకటన

ప్రపంచవ్యాప్తంగా భారత్ ఎదుగుతున్న తీరు, దేశ సాంకేతిక సామర్థ్యం ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. తాజాగా అమెరికా చేసిన ఒక పెద్ద ప్రకటన బీజింగ్ నుంచి వాషింగ్టన్ వరకు రచ్చలేపుతోంది. చైనాకు అడ్డుగా కొండలా నిలబడగలిగే సత్తా, ఆ దేశాన్ని నిలువరించే కెపాసిటీ కేవలం భారత్‌కు మాత్రమే ఉందని అమెరికా ఓపెన్‌గా ఒప్పేసుకుంది. అమెరికాకు అకస్మాత్తుగా భారత్ పవర్ ఎందుకు గుర్తొచ్చింది? చైనా పాలక వర్గాల్లో ఈ వ్యాఖ్యలు ఎలాంటి కలకలం రేపాయి? నిజంగానే భారత్ ప్రపంచ శక్తిగా మారుతోందా?

వాషింగ్టన్‌లో జరిగిన 9వ యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ పార్ట్‌నర్‌షిప్ ఫోరమ్ లీడర్‌షిప్ సమ్మిట్‌లో అమెరికా విదేశాంగ శాఖ ఆర్థిక వృద్ధి, ఇంధన, పర్యావరణ వ్యవహారాల అండర్ సెక్రటరీ జాకబ్ హెల్బర్గ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాస్టర్‌కార్డ్ చీఫ్ గవర్నమెంట్ అఫైర్స్ అండ్ పాలసీ ఆఫీసర్ టకర్ ఫుట్‌తో జరిగిన సంభాషణలో భారత్ ఇంజనీరింగ్ పవర్, టాలెంట్‌ను జాకబ్ హెల్బర్గ్ ప్రశంసించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
చైనాకు గట్టి పోటీ ఇచ్చేది ఇండియానే.. ఎందుకంటే?
Image Credit : Asianet News

చైనాకు గట్టి పోటీ ఇచ్చేది ఇండియానే.. ఎందుకంటే?

జాకబ్ హెల్బర్గ్ మాట్లాడుతూ, వర్క్‌ఫోర్స్, టెక్నాలజీ, గ్లోబల్ సప్లై చైన్ రంగాల్లో చైనాకు నిజమైన సవాలు విసిరే సత్తా ఉన్న ఒకే ఒక్క దేశం భారత్ అని స్పష్టం చేశారు. ముఖ్యంగా వర్క్‌ఫోర్స్, టాలెంట్ పూల్ విషయంలో చైనాతో ఢీకొట్టే ఏకైక దేశం ఇండియానేనని ఆయన అన్నారు. సురక్షితమైన, నమ్మకమైన టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను నిర్మించడంలో భారత్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. చైనాపై ప్రపంచ దేశాల ఆధారపడటాన్ని తగ్గించే వ్యూహంలో భారత్, అమెరికాకు అత్యంత ముఖ్యమైన, నమ్మకమైన భాగస్వామిగా ఎదుగుతోందని తెలిపారు.

Related Articles

Related image1
Mind Reading Helmet: మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్‌లో అనుకుంటే చాలు ఫోన్‌లో టైపింగ్ అయిపోద్ది !
Related image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
36
సప్లై చైన్ మారాల్సిందే..
Image Credit : our own

సప్లై చైన్ మారాల్సిందే..

ప్రస్తుతం ఉన్న గ్లోబల్ సప్లై చైన్ స్ట్రక్చర్ ఎక్కువ కాలం నిలబడదని హెల్బర్గ్ అభిప్రాయపడ్డారు. ఎందుకంటే ప్రపంచ సప్లై చైన్‌లోని ఒక పెద్ద భాగం కేవలం కొన్ని నిర్దిష్ట ప్రాంతాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఇలాంటి వ్యవస్థ వల్ల భవిష్యత్తులో సప్లై నిలిచిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని ఆయన హెచ్చరించారు. అందుకే సప్లై చైన్‌ను వేర్వేరు దేశాలకు, వివిధ ప్రాంతాలకు విస్తరించి వైవిధ్యభరితంగా మార్చడం ప్రస్తుతం రావాల్సిన తక్షణ అవసరం అని ఆయన పేర్కొన్నారు.

46
అమెరికాకు నమ్మకమైన పార్ట్నర్ భారత్
Image Credit : AI-generated image

అమెరికాకు నమ్మకమైన పార్ట్నర్ భారత్

భారత్ ఎప్పుడూ అమెరికాకు అత్యంత నమ్మకమైన భాగస్వామిగా ఉందని జాకబ్ హెల్బర్గ్ గుర్తుచేశారు. ప్యాక్స్ డిక్లరేషన్‌పై మొదట సంతకం చేసిన దేశాల్లో భారత్ కూడా ఒకటని ఆయన చెప్పారు. ఏఐ, టెక్నాలజీకి సంబంధించిన అంతర్జాతీయ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భారత్ కీలక పాత్ర పోషించిందని ప్రశంసించారు. ఫిబ్రవరిలో భారత్‌లో జరిగిన 'ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్'లో తాను కూడా పాల్గొన్నానని హెల్బర్గ్ చెప్పారు. ఆ సమయంలో రెండు దేశాలు ఏఐ రంగంలో సహకారాన్ని పెంచుకోవడానికి అంగీకరించి, ఒక జాయింట్ స్టేట్‌మెంట్‌ను కూడా విడుదల చేశాయని గుర్తుచేశారు.

56
భారత్‌లో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి?
Image Credit : X

భారత్‌లో ఉన్న ఆ స్పెషాలిటీ ఏంటి?

భారత్ ఎందుకు ఇంత ప్రత్యేకం అనే విషయానికి జాకబ్ హెల్బర్గ్ కొన్ని బలమైన కారణాలను లెక్కగట్టారు. భారత్, అమెరికా దేశాల విలువలు ఒకేలా ఉంటాయని ఆయన అన్నారు. అలాగే ఇంజనీరింగ్ వర్క్‌ఫోర్స్, టాలెంట్ పూల్ లోతు విషయంలో చైనాకు గట్టి పోటీ ఇచ్చే ఏకైక దేశం ఇండియానేనని స్పష్టం చేశారు. భారత్‌లో బలమైన ప్రజాస్వామ్య వ్యవస్థ, భారీ సంఖ్యలో ఇంజనీర్లు, ఖనిజాల రిఫైనింగ్ సామర్థ్యం, వేగంగా దూసుకుపోతున్న టెక్నాలజీ ఎకోసిస్టమ్ ఉన్నాయని కొనియాడారు. ఈ అద్భుతమైన ఫీచర్ల వల్లే గ్లోబల్ టెక్నాలజీ, సప్లై చైన్‌లో భారత్ ఒక అనివార్యమైన పార్ట్నర్‌గా మారిందని చెప్పారు.

66
ఖనిజాల రిఫైనింగ్, టెక్నాలజీలో దూకుడు
Image Credit : Getty

ఖనిజాల రిఫైనింగ్, టెక్నాలజీలో దూకుడు

అమెరికా తన మిత్రదేశాల మధ్య టెక్నాలజీ అభివృద్ధిని జీరో సమ్ పోటీగా చూడటం లేదని హెల్బర్గ్ స్పష్టం చేశారు. టెక్నాలజీ రంగంలో ఇతర కంపెనీల విజయాల వల్ల అమెరికాకు ఎలాంటి ముప్పు లేదని, ఎందుకంటే టెక్నాలజీ ఇండస్ట్రీ అనేది కాలంతో పాటు నిరంతరం పెరుగుతూనే ఉంటుందని చెప్పారు. భారత్‌లోని ఖనిజాల రిఫైనింగ్ ఇండస్ట్రీని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ప్రారంభ దశలో ఉన్న టెక్నాలజీ ఎకోసిస్టమ్‌ను ప్రస్తావిస్తూ.. దేశం టెక్నాలజీ అప్లికేషన్ లేయర్‌లో పెద్ద ఎత్తున సహకారం అందిస్తోందని చెప్పారు. భవిష్యత్తులో కొత్త టెక్నాలజీని భారీ స్థాయిలో విస్తరించడానికి ఈ అప్లికేషన్ లేయర్ చాలా అవసరం అని జాకబ్ హెల్బర్గ్ అన్నారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
చైనా
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image2
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Recommended image3
Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం
Related Stories
Recommended image1
Mind Reading Helmet: మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్‌లో అనుకుంటే చాలు ఫోన్‌లో టైపింగ్ అయిపోద్ది !
Recommended image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved