MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • International
  • ప్రపంచంలో తొలిసారి న్యాయవాదిని ఓడించిన AI చాట్‌బాట్.. రూ.8.79 లక్షల కేసులో విజయం

ప్రపంచంలో తొలిసారి న్యాయవాదిని ఓడించిన AI చాట్‌బాట్.. రూ.8.79 లక్షల కేసులో విజయం

AI: కృత్రిమ మేధస్సు (AI) ఇప్పటికే విద్య, వైద్యం, సాఫ్ట్‌వేర్, వ్యాపారం వంటి అనేక రంగాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఇప్పుడు న్యాయ రంగంలోనూ AI కొత్త చరిత్ర సృష్టించింది. ప్రపంచంలో తొలిసారి ఓ AI ఆధారిత లీగల్ చాట్‌బాట్ కోర్టులో విజయం సాధించింది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Jun 28 2026, 10:40 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గార్‌ఫీల్డ్ AI ఎలా కేసు గెలిపించింది?
Image Credit : Gemini AI

గార్‌ఫీల్డ్ AI ఎలా కేసు గెలిపించింది?

ఈ కేసులో గార్‌ఫీల్డ్ AI పూర్తిస్థాయిలో న్యాయపరమైన ప్రక్రియను నిర్వహించింది. కేసుకు సంబంధించిన సమాచారం విశ్లేషించడం, చట్టపరమైన అంశాలను పరిశీలించడం, అవసరమైన డాక్యుమెంట్లను సిద్ధం చేయడం వంటి పనులన్నీ AI సాయంతో పూర్తయ్యాయి. అనంతరం కోర్టులో వాదనలు వినిపించడానికి ఒక జూనియర్ న్యాయవాదిని నియమించారు. అంటే కేసు వెనుక ఉన్న మొత్తం ప్రిప‌రేష‌న్‌ను AI నిర్వహించగా, కోర్టులో చట్టపరమైన వాదనలు మాత్రం మానవ న్యాయవాది వినిపించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
తక్కువ ఖర్చుతో న్యాయ సహాయం
Image Credit : Gemini AI

తక్కువ ఖర్చుతో న్యాయ సహాయం

ఈ కేసులో మరో విశేషం ఖర్చు. సాధారణంగా బ్రిటన్‌లో ఇలాంటి న్యాయపరమైన కేసులకు న్యాయవాదులు భారీ ఫీజులు వసూలు చేస్తారు. అయితే గార్‌ఫీల్డ్ AI సుమారు రూ.50 వేల ఖర్చుతోనే ఈ సేవలను అందించినట్లు నివేదికలు చెబుతున్నాయి. దీంతో తక్కువ ఆదాయం ఉన్నవారికి కూడా న్యాయ సహాయం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles

Related image1
Fact Check: 2005కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
Related image2
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
35
కోర్టు విచారణలో ఏం జరిగింది?
Image Credit : Gemini AI

కోర్టు విచారణలో ఏం జరిగింది?

ఈ కేసు విచారణ గత నెలలో బ్రిటన్‌లోని వాండ్స్‌వర్త్ కౌంటీ కోర్టులో జరిగింది. దాదాపు మూడు గంటల పాటు విచారణ సాగింది. చివరికి కోర్టు గార్‌ఫీల్డ్ AI క్లయింట్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. కేసు ముగిసిన తర్వాత ప్రత్యర్థి తరఫు న్యాయవాది కూడా AI సిద్ధం చేసిన డాక్యుమెంట్లు నాణ్యంగా ఉన్నాయని అంగీకరించినట్లు సమాచారం. దీంతో న్యాయ రంగంలో AI సామర్థ్యంపై మరింత చర్చ మొదలైంది.

45
AIకి ఉన్న పరిమితులు కూడా ఉన్నాయి
Image Credit : Gemini AI

AIకి ఉన్న పరిమితులు కూడా ఉన్నాయి

ఈ విజయం సాధించినప్పటికీ AI పూర్తిగా న్యాయవాదుల స్థానాన్ని భర్తీ చేయలేదని గుర్తుంచుకోవాలి. గార్‌ఫీల్డ్ AI ప్రస్తుతం 10 వేల పౌండ్ల వరకు విలువైన చిన్న కేసులను మాత్రమే నిర్వహిస్తోంది. అలాగే కోర్టులో స్వయంగా వాదనలు వినిపించే అవకాశం AIకి లేదు. అందుకే కోర్టు ప్రక్రియలో మానవ న్యాయవాదిని ఉపయోగించారు. అంటే AI ప్రస్తుతం న్యాయపరమైన పరిశోధన, డాక్యుమెంట్ల తయారీ, కేసు సిద్ధత వంటి పనుల్లో మాత్రమే కీలక పాత్ర పోషిస్తోంది.

55
న్యాయ రంగంలో AIకు ఇది కొత్త అధ్యాయమా?
Image Credit : Gemini AI

న్యాయ రంగంలో AIకు ఇది కొత్త అధ్యాయమా?

ప్రపంచవ్యాప్తంగా కోర్టు వ్యవస్థలో AI వినియోగం కొత్త విషయం కాదు. అమెరికా సహా అనేక దేశాల్లో ఇప్పటికే న్యాయ పరిశోధన, పత్రాల విశ్లేషణ, కేసుల నిర్వహణలో AI ఆధారిత సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. అయితే కోర్టులో ఉపయోగించిన లీగల్ డాక్యుమెంట్ల తయారీలో AI ప్రధాన పాత్ర పోషించి, ఆ కేసు విజయవంతం కావడం మాత్రం ఇదే తొలిసారి అని చెబుతున్నారు. ఈ ఘటనతో భవిష్యత్తులో న్యాయ సేవలు మరింత వేగంగా, తక్కువ ఖర్చుతో ప్రజలకు అందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. అయితే AI ఒక సహాయక సాధనమే కానీ, తుది చట్టపరమైన నిర్ణయాలు, కోర్టు వాదనలు, న్యాయ బాధ్యతలు ఇప్పటికీ మానవ న్యాయవాదుల చేతుల్లోనే ఉంటాయని స్పష్టం చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వైరల్ న్యూస్
న్యాయ స‌ల‌హాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Nepal Flash Floods: నేపాల్‌లో ఘోర ప్రళయం.. 903కు పెరిగిన మృతుల సంఖ్య, 4,200 మందికి పైగా గల్లంతు
Recommended image2
Nepal Disaster: 30 ఏళ్లలో 1500 సార్లు వరదలు.. నేపాల్‌ను ప్రకృతి ఎందుకు టార్గెట్ చేస్తోంది?
Recommended image3
Nepal Floods: నేపాల్ వరదల్లో 3000 మంది మిస్సింగ్.. గండక్ నది ఒడ్డున మృతదేహాల కలకలం
Related Stories
Recommended image1
Fact Check: 2005కి ముద్రించిన నోట్లు రద్దు కానున్నాయా.? క్లారిటీ ఇచ్చిన బ్యాంకు
Recommended image2
Used Car: దేశంలో ఎక్కువ మంది కొంటున్న సెకండ్ హ్యాండ్ కారు ఏంటో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved