MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Technology
  • Mind Reading Helmet: మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్‌లో అనుకుంటే చాలు ఫోన్‌లో టైపింగ్ అయిపోద్ది !

Mind Reading Helmet: మతిపోయే టెక్నాలజీ.. జస్ట్ మైండ్‌లో అనుకుంటే చాలు ఫోన్‌లో టైపింగ్ అయిపోద్ది !

Mind Reading Helmet: చేతితో టైప్ చేయక్కర్లేదు.. నోటితో చెప్పక్కర్లేదు.. మైండ్‌లో అనుకుంటే చాలు మెసేజ్ టైప్ అయిపోతుంది. మైండ్‌లో అనుకుంటే స్క్రీన్‌పై మెసేజ్ టైప్ అయ్యేలా మెటా 'Brain2Qwerty V2' అనే సరికొత్త నాన్ ఇన్వేసివ్ ఏఐ టెక్నాలజీని తెచ్చింది.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 30 2026, 05:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇక వేళ్లతో టైపింగ్ చేసే రోజులు పోయాయి.. మెటా తెచ్చిన మైండ్ రీడింగ్ హెల్మెట్!
Image Credit : Getty

ఇక వేళ్లతో టైపింగ్ చేసే రోజులు పోయాయి.. మెటా తెచ్చిన మైండ్ రీడింగ్ హెల్మెట్!

జస్ట్ ఊహించుకోండి.. మీరు మీ మనసులో ఏదైనా అనుకోగానే, చేతులతో టైప్ చేయకుండా లేదా నోటితో చెప్పకుండానే అది స్క్రీన్‌పై టెక్స్ట్‌గా మారిపోతే ఎంత బాగుంటుంది! వినడానికి ఇదొక సైన్స్ ఫిక్షన్ సినిమా సీన్‌లా అనిపిస్తోంది కదూ. కానీ ఇప్పుడు ఇది నిజం కాబోతోంది. సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇలాంటి ఒక అద్భుతమైన సిస్టమ్‌ను సిద్ధం చేసింది. ఇది మీ మనసులోని మాటను చదివి, నేరుగా టెక్స్ట్‌గా మార్చేస్తుంది.

అన్నింటికంటే షాకింగ్ విషయం ఏంటంటే.. ఎలాన్ మస్క్‌కు చెందిన న్యూరాలింక్ కంపెనీలా దీనికోసం తలలో ఎలాంటి చిప్ పెట్టాల్సిన అవసరం లేదు, సర్జరీ చేయించుకోవాల్సిన పనిలేదు. కేవలం ఒక స్పెషల్ హెల్మెట్ పెట్టుకుంటే చాలు, ఈ మ్యాజిక్ జరిగిపోతుంది. మెటా తెచ్చిన ఈ సరికొత్త బ్రెయిన్ గేమ్‌ ఏంటి? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మెటా Brain2Qwerty V2 అంటే ఏంటి?
Image Credit : Gemini

మెటా Brain2Qwerty V2 అంటే ఏంటి?

మెటా కంపెనీ 'Brain2Qwerty V2' అనే సరికొత్త ఏఐ సిస్టమ్‌ను డెవలప్ చేసింది. ఇది మీ మెదడులోని కదలికలను అంటే బ్రెయిన్ యాక్టివిటీని గుర్తించి, వాటిని పదాలుగా మార్చగలదు. మెటా కంపెనీ చెప్తున్న దాని ప్రకారం.. పారాలిసిస్, బ్రెయిన్ ఇంజూరీ లేదా ఇతర జబ్బుల వల్ల మాట్లాడలేని, రాయలేని వారికి ఈ టెక్నాలజీ ఒక వరం లాంటిది. ఈ సిస్టమ్ సాయంతో అలాంటి వారు కేవలం ఆలోచించడం ద్వారానే తమ మనసులోని మాటను ఇతరులతో పంచుకోవచ్చు. ఇది మెటా గత ఏడాది తీసుకొచ్చిన Brain2Qwerty రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు సెకండ్ అండ్ మోస్ట్ అడ్వాన్స్‌డ్ వెర్షన్.

36
సర్జరీ లేకుండానే ఎలా పనిచేస్తుంది?
Image Credit : Gemini

సర్జరీ లేకుండానే ఎలా పనిచేస్తుంది?

ఒకవైపు ఎలాన్ మస్క్ కంపెనీ న్యూరాలింక్ బ్రెయిన్ లోపల చిప్‌ను అమర్చడానికి సర్జరీలపై వర్క్ చేస్తోంది. కానీ మెటా తీసుకొచ్చిన ఈ సిస్టమ్ మాత్రం పూర్తిగా నాన్ ఇన్వేసివ్. అంటే ఎలాంటి సర్జరీ అవసరం లేనిది. దీనికోసం యూజర్ ఒక స్పెషల్ హెల్మెట్ ధరించాల్సి ఉంటుంది. ఇది చూడటానికి పెద్ద హెయిర్ డ్రైయర్ లాగా కనిపిస్తుంది. ఈ హెల్మెట్‌లో మాగ్నెటోఎన్సెఫాలోగ్రఫీ టెక్నాలజీని వాడారు. మెదడులోని న్యూరల్ యాక్టివిటీ వల్ల క్రియేట్ అయ్యే అత్యంత బలహీనమైన అయస్కాంత క్షేత్రాలను ఈ టెక్నాలజీ ఈజీగా పట్టుకుంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇతర పద్ధతులు చాలా ఖరీదైనవి.. రిస్క్‌తో కూడుకున్నవి. ఎందుకంటే వాటికి బ్రెయిన్ సర్జరీ చేయాలి. కానీ మెటా హెల్మెట్ మాత్రం చాలా సేఫ్ అండ్ ఈజీ అని కంపెనీ చెబుతోంది.

46
ఈ ఏఐ సిస్టమ్ ఎంత అక్యురేట్‌గా పనిచేస్తుంది?
Image Credit : Getty

ఈ ఏఐ సిస్టమ్ ఎంత అక్యురేట్‌గా పనిచేస్తుంది?

ఈ అద్భుతమైన సిస్టమ్‌కు ట్రైనింగ్ ఇవ్వడం కోసం మెటా కంపెనీ 9 మంది వాలంటీర్ల హెల్ప్ తీసుకుంది. వారు ఈ హెల్మెట్ పెట్టుకుని దాదాపు 10 గంటల పాటు టైపింగ్ చేశారు. ఈ ప్రాసెస్‌లో ఏఐ కి దాదాపు 22,000 వాక్యాల డేటా లభించింది. మెటా తన పాత వెర్షన్‌తో పోలిస్తే, ఈ కొత్త Brain2Qwerty V2 లో మెదడు నుంచి వచ్చే రా సిగ్నల్స్‌ను నేరుగా అనలైజ్ చేసి, ఆటోమేటిక్‌గా ప్యాటర్న్‌లను గుర్తిస్తుంది.

56
61 శాతం ఖచ్చితత్వం
Image Credit : Getty

61 శాతం ఖచ్చితత్వం

సాధారణంగా సర్జరీ లేకుండా వాడే ఇలాంటి నాన్ ఇన్వేసివ్ పద్ధతుల్లో అక్యురెసీ కేవలం 8% వరకు మాత్రమే ఉంటుంది. కానీ మెటా డెవలప్ చేసిన ఈ సిస్టమ్ ఏకంగా 61% అక్యురెసీని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. ఇక బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చిన ఒక యూజర్ విషయంలో అయితే ఈ ఖచ్చితత్వం ఏకంగా 78% వరకు కనిపించడం విశేషం.

66
స్మార్ట్‌ఫోన్ లాగే ఆటోకరెక్ట్ ఫీచర్
Image Credit : ChatGPT

స్మార్ట్‌ఫోన్ లాగే ఆటోకరెక్ట్ ఫీచర్

మెదడు నుంచి వచ్చే సిగ్నల్స్‌లో ఎలాంటి అడ్డంకులు వచ్చినా, వాటిని క్లియర్ చేయడానికి మెటా ఇందులో లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సహాయం తీసుకుంది. ఇది మన స్మార్ట్‌ఫోన్‌లోని ఆటోకరెక్ట్ ఫీచర్‌లాగా పనిచేస్తుంది. గ్రామర్ రూల్స్ ప్రకారం కరెక్ట్ పదాలను తానే సెలెక్ట్ చేసుకుంటుంది. ఈ రీసెర్చ్ అంతా మెటా చేపట్టిన డిజిటల్ బ్రెయిన్ ప్రాజెక్ట్ లో ఒక భాగం. ఈ ప్రాజెక్ట్ కింద ఓపెన్ న్యూరోసైన్స్ డేటాసెట్ కోసం కంపెనీ 5 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో దాదాపు రూ. 41 కోట్లు ఫండ్ ఇస్తోంది. అయితే, ఈ రేసులో మెటా ఒక్కటే లేదు.. సిలికాన్ వ్యాలీకి చెందిన సబి అనే స్టార్టప్ కంపెనీ కూడా మెదడు సిగ్నల్స్‌ను గుర్తించే ఇలాంటి ఒక స్పెషల్ క్యాప్‌పై వర్క్ చేస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
గాడ్జెట్‌లు
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Recharge Price Drop : ఎయిర్‌టెల్, జియో రీఛార్జ్ రేట్లు తగ్గే ఛాన్స్... ఎందుకో తెలుసా?
Recommended image2
AI Governance: మాటలతో కాదు.. కఠిన చట్టాలతోనే ఏఐకి నియంత్రణ
Recommended image3
Car Warranty Rules: కారు కొన్న వెంటనే ఇది చేస్తే వారంటీ పనికిరాదు..ఇది తెలుసా?
Related Stories
Recommended image1
WhatsApp Plus Features: వాట్సాప్ ప్లస్ సబ్‌స్క్రిప్షన్.. నెలకు ₹79 పే చేస్తే వచ్చే 6 సూపర్ ఫీచర్లు ఏంటో తెలుసా?
Recommended image2
Ghost Village Mystery: ఒక్క రాత్రిలో మాయమైన గ్రామం.. ఘోస్ట్ విలేజ్ కుల్ధారా మిస్టరీ ఇదే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved