MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • International
  • Top 10 Universities : టాప్ 10 వర్సిటీల లిస్ట్ వచ్చేసింది.. ఇండియా నుంచి ఏమున్నాయి?

Top 10 Universities : టాప్ 10 వర్సిటీల లిస్ట్ వచ్చేసింది.. ఇండియా నుంచి ఏమున్నాయి?

Top 10 Universities in the World 2026: ప్రపంచ అత్యుత్తమ వర్సిటీల ర్యాంకింగ్స్‌లో ఆక్స్‌ఫర్డ్ టాప్ లో నిలిచింది. అయితే, పరిశోధనలు, అంతర్జాతీయ ప్రమాణాల లేమితో భారత వర్సిటీలు ఈ విషయంలో వెనుకబడ్డాయి.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 03 2026, 11:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 : అగ్రరాజ్యం హవా.. అడ్రస్ లేని దేశీ విద్యాసంస్థలు
Image Credit : freepik

యూనివర్సిటీ ర్యాంకింగ్స్ 2026 : అగ్రరాజ్యం హవా.. అడ్రస్ లేని దేశీ విద్యాసంస్థలు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉన్నత విద్యా సంస్థల నాణ్యతను అంచనా వేసే అంతర్జాతీయ ర్యాంకింగ్స్ తాజాగా విడుదలయ్యాయి. ఈ జాబితాలో టాప్ విశ్వవిద్యాలయాలు విద్యార్థుల జీవిత గమనాన్ని మార్చడమే కాకుండా, వారిని ఉన్నతమైన కెరీర్ వైపు నడిపిస్తున్నాయి. 

అయితే, ఈసారి విడుదలైన టాప్ 10 జాబితాలో భారతీయ విశ్వవిద్యాలయాలకు చోటు దక్కలేదు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మొదటి 500 వర్సిటీల్లో కూడా భారత్ నుంచి ఒక్క విద్యాసంస్థ కూడా నిలవలేకపోయింది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, పరిశోధనలు, అంతర్జాతీయ సహకారం వంటి అంశాల్లో భారతీయ సంస్థలు కాస్త వెనుకబడినట్లు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
అగ్రస్థానంలో ఆక్స్‌ఫర్డ్: అకడమిక్ ఎక్సలెన్స్‌కు కేరాఫ్ ఇదే
Image Credit : our own

అగ్రస్థానంలో ఆక్స్‌ఫర్డ్: అకడమిక్ ఎక్సలెన్స్‌కు కేరాఫ్ ఇదే

బ్రిటన్‌కు చెందిన ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (University of Oxford) 90.20 స్కోరుతో ప్రపంచంలోనే నంబర్ వన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ సంస్థ విద్యాపరమైన సామర్థ్యంలో 92.67 స్కోరును, అంతర్జాతీయ భాగస్వామ్యంలో 93.20 స్కోరును సాధించింది. శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ వర్సిటీ, ఆధునిక ఆవిష్కరణలను మేళవించి ప్రపంచ విధాన రూపకల్పనలో కీలక పాత్ర పోషిస్తోంది. పరిశోధనలు, గ్లోబల్ లీడర్‌షిప్‌లో ఆక్స్‌ఫర్డ్ తన పట్టును నిరూపించుకుంది.

36
రెండు మూడు స్థానాల్లో యేల్, స్టాన్‌ఫోర్డ్
Image Credit : Getty

రెండు మూడు స్థానాల్లో యేల్, స్టాన్‌ఫోర్డ్

రెండవ స్థానంలో నిలిచిన అమెరికాలోని యేల్ యూనివర్సిటీ (Yale University) 88.55 మొత్తం స్కోరును సాధించింది. అకడమిక్ పనితీరులో 91.78 పాయింట్లతో దూసుకుపోతున్న ఈ సంస్థ.. పబ్లిక్ సర్వీస్, ఉన్నత వృత్తిపరమైన మార్గాలను సుగమం చేస్తోంది. ఇక మూడవ స్థానంలో స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయం (Stanford University) 88.30 స్కోరుతో నిలిచింది. సిలికాన్ వ్యాలీతో ఉన్న లోతైన సంబంధాల కారణంగా ఇన్నోవేషన్, ఆర్థిక ప్రభావంలో ఈ వర్సిటీ టాప్ 5లో నిలిచింది.

46
ఎంఐటీ, చికాగో వర్సిటీల హవా
Image Credit : Getty

ఎంఐటీ, చికాగో వర్సిటీల హవా

సాంకేతిక రంగంలో తిరుగులేని ఆధిక్యం ప్రదర్శిస్తూ ఎంఐటీ (MIT) నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. దీని మొత్తం స్కోరు 88.00 కాగా, ఆవిష్కరణలలో ఏకంగా 93.31 స్కోరు సాధించింది. ఇంజనీరింగ్, అప్లైడ్ రీసెర్చ్ విభాగాల్లో ఎంఐటీ ప్రపంచానికి దిశానిర్దేశం చేస్తోంది. ఐదో స్థానంలో ఉన్న చికాగో విశ్వవిద్యాలయం (The University of Chicago) 87.66 స్కోరు సాధించింది. ఆర్థిక పరిశోధనలు, సామాజిక శాస్త్రాల విభాగాల్లో ఈ సంస్థ గుర్తింపు పొందింది.

56
హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీ
Image Credit : Gemini

హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఇంపీరియల్ కాలేజీ

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయం (Harvard University) ఆరో స్థానానికి పరిమితమైంది. అయినప్పటికీ, ఆవిష్కరణలు, ఆర్థిక ప్రభావం విభాగంలో ఇది 94.58 అత్యధిక స్కోరును సాధించడం విశేషం. ఏడవ స్థానంలో కేంబ్రిడ్జ్ (University of Cambridge) 86.86 స్కోరుతో నిలవగా, ఎనిమిదో స్థానంలో లండన్‌కు చెందిన ఇంపీరియల్ కాలేజ్ (Imperial College London) 86.27 స్కోరుతో నిలిచింది. అంతర్జాతీయ విద్యార్థులను ఆకర్షించడంలో ఇంపీరియల్ కాలేజ్ 96.56 స్కోరుతో రికార్డు సృష్టించింది.

66
మిచిగాన్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ
Image Credit : Getty

మిచిగాన్, పెన్సిల్వేనియా యూనివర్సిటీ

చివరి రెండు స్థానాల్లో మిచిగాన్ విశ్వవిద్యాలయం (University of Michigan), యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియా (University of Pennsylvania) నిలిచాయి. మిచిగాన్ 84.65 స్కోరుతో తొమ్మిదో స్థానంలో ఉండగా, పెన్సిల్వేనియా 83.93 స్కోరుతో పదో స్థానంలో నిలిచింది. ఈ రెండు సంస్థలు అకడమిక్ పనితీరు, ఆవిష్కరణల మధ్య సమతుల్యతను పాటిస్తూ బెస్ట్ స్కోర్ ను సాధించాయి. ముఖ్యంగా బిజినెస్, హెల్త్‌కేర్ విభాగాల్లో పెన్సిల్వేనియా వర్సిటీకి ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
విద్య
ఉద్యోగాలు, కెరీర్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Recommended image2
అమెరికాను వ‌ణించిన 9/11 అటాక్‌.. అస‌లా రోజు ఏం జ‌రిగింది? టైమ్ టూ టైమ్ పూర్తి వివ‌రాలు
Recommended image3
Nepal Floods: చుట్టూ సర్వనాశనం.. ఆ పచ్చని ఇల్లు మాత్రం ఎలా నిలబడింది? నేపాల్ వరదల్లో మిరాకిల్!
Related Stories
Recommended image1
Agarwood : కిలో రూ. 1 కోటి.. బంగారం కంటే విలువైన లిక్విడ్ గోల్డ్ ! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?
Recommended image2
Trump Trade Deal : ఒక్క రోజే 5.40 లక్షల కోట్లు.. అంబానీ, టాటా కంపెనీల పంట పండించిన ట్రంప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved