MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Bigg Boss Telugu 10
Ishan Kishan
Dream Science
Romanchakam Box Office Collection
Ramba Oorvasi Menaka BO Collections
Dream Science
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
  • Home
  • Business
  • Agarwood : కిలో రూ. 1 కోటి.. బంగారం కంటే విలువైన లిక్విడ్ గోల్డ్ ! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?

Agarwood : కిలో రూ. 1 కోటి.. బంగారం కంటే విలువైన లిక్విడ్ గోల్డ్ ! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?

Worlds Most Expensive Wood : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప అగార్ ఉడ్ (Agarwood). బంగారం కంటే విలువైనది. కిలో కోటి రూపాయల పైనే పలికే ఈ కలపను లిక్విడ్ గోల్డ్ అని ఎందుకు అంటారు? ఎందుకు అంత విలువైనదో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Feb 03 2026, 10:50 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
అడవిలో దొరికే లిక్విడ్ గోల్డ్.. ఈ చెట్టుకు రోగం వస్తేనే కోట్లు కురుస్తాయి
Image Credit : Gemini

అడవిలో దొరికే లిక్విడ్ గోల్డ్.. ఈ చెట్టుకు రోగం వస్తేనే కోట్లు కురుస్తాయి

సాధారణంగా మనం బంగారం లేదా వజ్రాలు అత్యంత ఖరీదైనవి అని అనుకుంటాం. కానీ ప్రకృతిలో లభించే ఒక రకమైన కలప ధర వింటే మీరు ఆశ్చర్యపోవాల్సిందే. దాని పేరే అగార్ ఉడ్ (Agarwood). దీనిని ఊద్ అని కూడా పిలుస్తారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని ధర కిలోకు రూ. 1 కోటి వరకు ఉంటుంది. కొన్ని అరుదైన రకాలు అయితే అంతకంటే ఎక్కువే పలుకుతాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న బిలియనీర్లు దీనిని బంగారం కంటే ఎక్కువగా భావిస్తారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఏమిటీ అగార్ ఉడ్? దీని పుట్టుక వెనుక రహస్యం ఇదే
Image Credit : Getty

ఏమిటీ అగార్ ఉడ్? దీని పుట్టుక వెనుక రహస్యం ఇదే

అగార్ ఉడ్ అనేది ఆగ్నేయాసియా ప్రాంతంలో పెరిగే ఆక్విలారియా జాతికి చెందిన చెట్ల నుండి లభిస్తుంది. విచిత్రం ఏమిటంటే, ఈ చెట్లు సహజ స్థితిలో ఉన్నప్పుడు ఎటువంటి వాసన లేకుండా, తెల్లగా ఉంటాయి. అయితే, ఈ చెట్టుకు ఏదైనా గాయమైనప్పుడు లేదా ఒక ప్రత్యేక రకమైన శిలీంధ్రం సోకినప్పుడు అద్భుతం జరుగుతుంది. ఆ ఇన్ఫెక్షన్ నుండి తనను తాను కాపాడుకోవడానికి చెట్టు ఒక ముదురు రంగులో ఉండే జిగురు వంటి ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఈ ద్రవమే తెల్లటి కలపను సుగంధభరితమైన నల్లటి అగార్ ఉడ్ గా మారుస్తుంది.

Related Articles

Related image1
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Related image2
Gold : పాత సిమ్ కార్డులే కదా అని పడేయకండి.. వీటిలో లక్షల విలువైన బంగారం ఉంది !
36
కేవలం 2 శాతం చెట్లలోనే లభ్యత
Image Credit : Gemini

కేవలం 2 శాతం చెట్లలోనే లభ్యత

అడవుల్లో పెరిగే అన్ని ఆక్విలారియా చెట్లు అగర్ ఉడ్ ను ఉత్పత్తి చేయవు. కేవలం 2 నుంచి 7 శాతం చెట్లు మాత్రమే సహజంగా ఈ ఇన్ఫెక్షన్‌కు గురవుతాయి. ఈ ప్రక్రియ జరగడానికి 10 నుండి 30 ఏళ్ల సమయం పడుతుంది. అందుకే ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వస్తువుగా మారింది. సహజసిద్ధంగా లభించే ఈ కలప కోసం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ విపరీతంగా ఉంది. కృత్రిమ పద్ధతుల్లో కూడా దీనిని తయారు చేస్తున్నప్పటికీ, అడవుల్లో సహజంగా దొరికే దానికి ఉండే విలువే వేరు.

46
కైనమ్ : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్రేడ్
Image Credit : Getty

కైనమ్ : ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గ్రేడ్

అగార్ ఉడ్ లో అన్నింటికంటే నాణ్యమైన, అరుదైన రకాన్ని కైనమ్ (Kynam) లేదా క్యారా అని పిలుస్తారు. దీని ధర ఊహకందని స్థాయిలో ఉంటుంది. దీని ఒక గ్రాము ధర దాదాపు $10,000 అంటే సుమారు రూ. 8.5 లక్షలు వరకు ఉంటుంది. అంటే కేవలం 10 గ్రాముల కైనమ్ ధర కిలో బంగారం కంటే ఎక్కువ. గతంలో షాంఘైలో జరిగిన ఒక వేలంలో 2 కిలోల కైనమ్ కలప ఏకంగా రూ. 154 కోట్లకు అమ్ముడై రికార్డు సృష్టించింది.

56
అగార్ ఉడ్ ఉపయోగాలు ఏమిటి? దీని ప్రాముఖ్యత ఇదే
Image Credit : Gemini

అగార్ ఉడ్ ఉపయోగాలు ఏమిటి? దీని ప్రాముఖ్యత ఇదే

అగార్ ఉడ్ ను సుగంధాల దేవుడు అని పిలుస్తారు. దుబాయ్, పారిస్ వంటి నగరాల్లోని అత్యంత విలాసవంతమైన పెర్ఫ్యూమ్ బ్రాండ్లు దీనిని వాడుతాయి. హిందూ, ఇస్లాం, బౌద్ధ మతపరమైన ఆచారాల్లోనూ ఈ ధూపానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆయుర్వేదం, చైనీస్ వైద్యంలో ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల చికిత్సకు దీనిని ఉపయోగిస్తారు. భారతదేశంలోని అస్సాం రాష్ట్రం నాణ్యమైన అగార్ ఉడ్ కు ప్రపంచ ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతం నుండి విదేశాలకు భారీగా ఎగుమతులు జరుగుతుంటాయి.

66
అగార్ ఉడ్ : అంతరించిపోతున్న సంపద
Image Credit : Getty

అగార్ ఉడ్ : అంతరించిపోతున్న సంపద

విపరీతమైన డిమాండ్ కారణంగా అడవుల్లో ఈ చెట్లను విచ్చలవిడిగా నరికేస్తున్నారు. దీనివల్ల ఆక్విలారియా చెట్లు అంతరించిపోయే దశకు చేరుకున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ చట్టాల ప్రకారం అగార్ ఉడ్ వాణిజ్యంపై కఠినమైన నిబంధనలు ఉన్నాయి. కేవలం అనుమతులు ఉన్నవారు మాత్రమే దీనిని విక్రయించాల్సి ఉంటుంది. అందుకే ప్రస్తుతం సహజసిద్ధమైన అగార్ ఉడ్ కేవలం బిలియనీర్లకు మాత్రమే అందుబాటులో ఉండే విలాసవస్తువుగా మారిపోయింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
బంగారం
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Curd Maker: ఇంట్లో ఈ ప్రొడక్ట్ ఉంటే, గట్టి పెరుగు గ్యారెంటీ.. ధర కూడా చాలా తక్కువే
Recommended image2
Copper: వెండి, బంగారం కంటే ఎక్కువ.. రాగి ధరలు ఎందుకు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి?
Recommended image3
8th Pay Commission: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. పెన్షన్ ఏకంగా రూ. 58 వేలకు చేరనుందా?
Related Stories
Recommended image1
Tilak Varma : వచ్చేశాడు.. ఉతికేస్తున్నాడు! వరల్డ్ కప్‌ ముందు తిలక్ వర్మ విశ్వరూపం
Recommended image2
Gold : పాత సిమ్ కార్డులే కదా అని పడేయకండి.. వీటిలో లక్షల విలువైన బంగారం ఉంది !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved