MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Trump Trade Deal : ఒక్క రోజే 5.40 లక్షల కోట్లు.. అంబానీ, టాటా కంపెనీల పంట పండించిన ట్రంప్

Trump Trade Deal : ఒక్క రోజే 5.40 లక్షల కోట్లు.. అంబానీ, టాటా కంపెనీల పంట పండించిన ట్రంప్

Trump Trade Deal : డోనాల్డ్ ట్రంప్ సుంకాల విధానంతో భారత స్టాక్ మార్కెట్ పరుగులు తీసింది. రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ సహా టాప్ 10 కంపెనీల మార్కెట్ విలువ రూ. 5.40 లక్షల కోట్లు పెరిగింది. ముఖ్యంగా అంబానీ, టాటా, మిట్టల్ కంపెనీల పంట పండింది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Feb 03 2026, 10:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రంప్ దెబ్బకు అదిరిపోయిన షేర్ మార్కెట్.. ఇన్వెస్టర్ల జేబుల్లోకి కాసుల వర్షం
Image Credit : Getty

ట్రంప్ దెబ్బకు అదిరిపోయిన షేర్ మార్కెట్.. ఇన్వెస్టర్ల జేబుల్లోకి కాసుల వర్షం

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న సాఫ్ట్ టారిఫ్ పాలసీ భారతీయ స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావాన్ని చూపింది. మంగళవారం ట్రేడింగ్‌లో దేశీయ మార్కెట్లు సరికొత్త రికార్డులను సృష్టించాయి. ప్రధానంగా రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు 5 శాతం నుండి 7 శాతం వరకు పెరిగాయి. ఈ పరిణామంతో భారతీయ కంపెనీల మార్కెట్ విలువ ఒక్కరోజే భారీగా ఎగబాకింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రూ. 5.40 లక్షల కోట్ల సంపద వచ్చింది
Image Credit : Getty

రూ. 5.40 లక్షల కోట్ల సంపద వచ్చింది

ట్రేడింగ్ సమయంలో సెన్సెక్స్ ఏకంగా 4200 పాయింట్ల మేర వృద్ధిని చూసింది. దేశంలోని టాప్-10 దిగ్గజ కంపెనీల ఉమ్మడి మార్కెట్ క్యాపిటలైజేషన్ సుమారు రూ. 5.40 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. ట్రంప్ విధానాల వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో సానుకూల మార్పులు వస్తాయన్న అంచనాలతో ఇన్వెస్టర్లు భారీగా కొనుగోళ్లు జరిపారు. దీనివల్ల అంబానీ, టాటా వంటి పారిశ్రామిక వేత్తల కంపెనీల విలువ అమాంతం పెరిగింది.

35
రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో భారీ వృద్ధి
Image Credit : Gemini

రిలయన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల్లో భారీ వృద్ధి

ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 7 శాతానికి పైగా పెరిగాయి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1,33,768.49 కోట్లు పెరిగి, మొత్తం విలువ రూ. 20,14,985.17 కోట్లకు చేరుకుంది. అదేవిధంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్లు కూడా 7 శాతానికి పైగా లాభపడ్డాయి. దీనివల్ల బ్యాంకు మార్కెట్ విలువ రూ. 96,488.38 కోట్లు పెరిగి రూ. 15,23,500.49 కోట్లకు చేరింది. బ్యాంకింగ్ రంగంలో ఈ స్థాయి వృద్ధి ఇన్వెస్టర్లలో ఉత్సాహాన్ని నింపింది.

45
ఐటీ, బ్యాంకింగ్ రంగాల హవా
Image Credit : Getty

ఐటీ, బ్యాంకింగ్ రంగాల హవా

దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలైన టీసీఎస్ (TCS), ఇన్ఫోసిస్ కూడా భారీ లాభాలను ఆర్జించాయి. ఇన్ఫోసిస్ షేర్లు 6 శాతం పెరగడంతో కంపెనీ విలువ రూ. 41,068.96 కోట్లు పెరిగి రూ. 7,17,865.49 కోట్లకు చేరింది. టీసీఎస్ షేర్లు 5.28 శాతం వృద్ధి చెంది, మార్కెట్ విలువను రూ. 60,563.02 కోట్లు పెంచుకున్నాయి. ప్రైవేట్ రంగ బ్యాంక్ ఐసీఐసీఐ 4.72 శాతం, ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్‌బీఐ (SBI) 6 శాతం లాభాలను నమోదు చేశాయి. ఎస్‌బీఐ మార్కెట్ విలువ రూ. 10 లక్షల కోట్ల మార్కును దాటడం గమనార్హం.

55
ఇతర దిగ్గజ కంపెనీలకు కూడా లాభాల పంట
Image Credit : stockPhoto

ఇతర దిగ్గజ కంపెనీలకు కూడా లాభాల పంట

కేవలం ఐటీ, బ్యాంకింగ్ మాత్రమే కాకుండా ఇతర రంగాల్లోనూ లాభాల పంట పండింది. బజాజ్ ఫైనాన్స్ షేర్లు 7.76 శాతం పెరిగి రూ. 43,681.84 కోట్ల లాభాన్ని గడించాయి. ప్రభుత్వ రంగ ఇన్సూరెన్స్ కంపెనీ ఎల్ఐసీ (LIC) షేర్లు 4.87 శాతం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ దిగ్గజం ఎల్ అండ్ టీ (L&T) షేర్లు 5 శాతం పెరిగాయి. ఎఫ్ఎంసీజీ రంగంలోని హిందుస్థాన్ యూనిలీవర్ షేర్లు 2 శాతం వృద్ధితో రూ. 10,291.21 కోట్ల మేర మార్కెట్ విలువను పెంచుకున్నాయి. మొత్తానికి ట్రంప్ ట్రేడ్ డీల్ భారతీయ కార్పొరేట్ రంగానికి భారీ ఊరటనిచ్చింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
డొనాల్డ్ ట్రంప్
నరేంద్ర మోదీ
వ్యాపారం
స్టాక్ మార్కెట్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
LPG New Rules October 1: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అలర్ట్.. అక్టోబర్ 1 నుండి కొత్త రూల్స్
Recommended image2
Gold price Fall: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్...మూడో రోజు బంగారం ధరలకు బ్రేక్..దిగొచ్చిన గోల్డ్
Recommended image3
Notional Increment: ‘నోషనల్ ఇంక్రిమెంట్’ అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?
Related Stories
Recommended image1
Agarwood : కిలో రూ. 1 కోటి.. బంగారం కంటే విలువైన లిక్విడ్ గోల్డ్ ! ఈ కలప ప్రత్యేకత ఏంటో తెలుసా?
Recommended image2
EPF : పీఎఫ్ డబ్బులు తీసుకోవాలా? ఈ చిన్న తప్పు చేస్తే మీ డబ్బు కట్ అవుతుంది.. జాగ్రత్త
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved