- Home
- International
- PM Modi: జపాన్‌లో ల్యాండ్ అయిన మోదీ.. ఎందుకు వెళ్లారు? దీంతో మనకు జరిగే మేలు ఏంటి.?
PM Modi: జపాన్‌లో ల్యాండ్ అయిన మోదీ.. ఎందుకు వెళ్లారు? దీంతో మనకు జరిగే మేలు ఏంటి.?
రెండు రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ జపాన్ చేరుకున్నారు. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం టోక్యోలో ల్యాండ్ అయ్యారు. ఈ నేపథ్యంలో మోదీ జపాన్ ఎందుకు వెళ్లారు.? ఏయే సమావేశాల్లో పాల్గొననున్నారు. ఇప్పుడు తెలుసుకుందాం.

ఆర్థిక సంబంధాల్లో కొత్త ఊపు
జపాన్ మీడియా రిపోర్ట్స్ ప్రకారం, రాబోయే 10 ఏళ్లలో జపాన్ భారత్‌లో 10 ట్రిలియన్ యెన్ (దాదాపు 68 బిలియన్ డాలర్లు) పెట్టుబడి పెట్టనుంది. ఈ పెట్టుబడులు కృత్రిమ మేధస్సు (AI), సెమీకండక్టర్లు, పర్యావరణం, వైద్య రంగం వంటి విభిన్న రంగాలపై దృష్టి సారించనున్నాయి. దీంతో భారత్‌లో పరిశ్రమల విస్తరణ, కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.
KNOW
బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు ఊతం
పర్యటనలో భాగంగా మోదీ, ఇషిబా కలిసి టోక్యో ఎలక్ట్రాన్ ఫ్యాక్టరీ, సెందైలోని తోహోకు శింకాన్సెన్ ప్లాంట్‌ను సందర్శించనున్నారు. ఇక్కడే బుల్లెట్ ట్రైన్ కోచ్‌లు తయారవుతాయి. భారత్‌లో ముంబయి–అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం జపాన్ సహకారం కీలకం. ఈ పర్యటనతో ఆ ప్రాజెక్టు వేగం పెరిగే అవకాశం ఉంది.
రక్షణ సహకారంలో కొత్త దశ
భారత్–జపాన్ రక్షణ బంధం మరింత బలపడనుంది. ముఖ్యంగా భారత నౌకాదళం, జపాన్ మేరిటైమ్ సెల్ఫ్ డిఫెన్స్ ఫోర్స్ నౌకా సంరక్షణ, నిర్వహణలో భాగస్వామ్యంపై చర్చలు జరుపుతున్నాయి. ఇది భవిష్యత్తులో ఇండో–పసిఫిక్ భద్రతా వ్యూహంలో భారత్ స్థాయిని పెంచుతుంది.
東京に到着しました。インドと日本が開発協力を引き続き強化する中、本訪問では石破総理をはじめとする方々と意見交換し、既存のパートナーシップを深化させ、新たな協力の可能性を探る機会となることを期待しています。@shigeruishibapic.twitter.com/h4ZahMDIk2
— Narendra Modi (@narendramodi) August 29, 2025
క్వాడ్‌లో భారత్ పాత్ర
ఈ పర్యటనలో ప్రధాన అంశం క్వాడ్ (భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియా) సహకార వేదిక. చైనా ప్రభావాన్ని ఎదుర్కోవడంలో ఈ వేదిక కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా టారిఫ్ సమస్యలతో సంబంధాలు చిక్కుల్లో ఉన్నా, జపాన్–భారత్ కలయికతో ఇండో–పసిఫిక్ దేశాలకు ప్రత్యామ్నాయ పెట్టుబడి, ఆర్థిక అవకాశాలు లభించనున్నాయి.
కొత్త సాంకేతికతలలో భాగస్వామ్యం
మోదీ తన ప్రకటనలో “భారత్–జపాన్ సంబంధాలకు కొత్త రెక్కలు ఇస్తాం, పెట్టుబడుల విస్తరణ, AI, సెమీకండక్టర్లలో సహకారం పెంచుతాం” అని పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం భారత్‌లో టెక్నాలజీ విప్లవానికి దారితీస్తుంది. భవిష్యత్తు పరిశ్రమలలో భారత్‌కు ముందంజను తీసుకువస్తుంది. మొత్తం మీద మోదీ జపాన్ పర్యటనతో భారత్‌లోకి భారీగా పెట్టుబడులు రానున్నాయి. అలాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ వేగం పెరగనుంది. అదే విధంగా రక్షణ సహకారం పెరగడం, క్వాడ్‌లో భారత్ స్థాయి బలోపేతం కావడం, AI, సెమీకండక్టర్ రంగాల్లో భారత్‌కు సాంకేతిక శక్తి పెరగడం వంటి అంశాలు ముడిపడి ఉన్నాయి.