MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • International
  • Iran Israel War ఇంకెంతకాలం సాగుతుంది..ఎప్పుడు ఆగుతుంది..? అమెరికా ఏమంటోంది..?

Iran Israel War ఇంకెంతకాలం సాగుతుంది..ఎప్పుడు ఆగుతుంది..? అమెరికా ఏమంటోంది..?

Israel Iran War : ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్దవాాతావరణం యావత్ ప్రపంచాన్ని కలవరపెడుతోంది. అమెరికా ఎంట్రీతో యుద్దతీవ్రత మరింత పెరిగింది. ఈ యుద్దం ఇంకెంతకాలం సాగుతుంది..ఎప్పుడు ఆగుతుంది..?   

4 Min read
Author : Arun Kumar P
Published : Mar 20 2026, 12:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్దం ఇప్పట్లో ఆగుతుందా..?
Image Credit : X

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఇప్పట్లో ఆగుతుందా..?

మిడిల్ ఈస్ట్ లో యుద్ధ పరిస్థితులు రోజురోజుకు మరింత తీవ్రమవుతున్నాయి. ఈ ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై దాడులు చేపట్టడంతో మొదలైన ఉద్రిక్తతలు ఇంకా కొనసాగుతున్నాయి. ఈ దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మృతి చెందడం పరిస్థితులను మరింత ఉద్రిక్తంగా మార్చింది. 1989 నుంచి దేశాన్ని నడిపించిన ఖమేనీ మరణం తర్వాత మార్చి 8న అతని కుమారుడు మోజ్తబా ఖమేనీ ఇరాన్ పగ్గాలు చేపట్టాడు.

తండ్రి కంటే కొడుకు మోజ్తబా ఖమేనీ దూకుడుగా యుద్దతంత్రాలు రచిస్తున్నాడు. అతడి సారథ్యంలో ఇజ్రాయెల్ పైనే కాదు అమెరికా సైనిక స్థావరాలు కలిగిన గల్ఫ్ దేశాలపై దాడులు చేస్తోంది ఇరాన్. అంతటితో ఆగకుండా యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చేసేలా అతడి చర్యలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ వాణిజ్యంలో అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధిని మూసివేయడంతో యావత్ ప్రపంచం ఆందోళనకు గురవుతోంది... చమురు సరఫరా నిలిచిపోవడంతో గ్యాస్, పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి. దీంతో మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుతాయా..? అని ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఎప్పుడు ఆగుతుంది..?
Image Credit : ChatGPT

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్దం ఎప్పుడు ఆగుతుంది..?

ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు ఎప్పుడు తగ్గుయానేది ఆ రెండు దేశాల చేత్తుల్లో లేదు.. అగ్రరాజ్యం అమెరికా చేతిలో ఉంది. ఇరాన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసేవరకు వదిలిపెట్టడబోమని... ఇప్పటికే చేయాల్సిన డ్యామేజ్ చేశామంటున్నారు ట్రంప్. ఇటీవల వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ యుద్ధం గరిష్ఠంగా ఆరు వారాల వరకు కొనసాగవచ్చని పేర్కొన్నారు. అంటే ఏప్రిల్ లో కూడా ఇరాన్ ఉద్రిక్తతలు కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి... మే లేదా జూన్ లో పరిస్థితి చక్కబడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరోవైపు మార్చి 9న అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం గురించి మాట్లాడుతూ “ఇది దాదాపు పూర్తయింది, మేము షెడ్యూల్ కంటే ముందున్నాం” అని పేర్కొన్నారు. ఆ తర్వాత అవసరమైతే ఎంత దూరమైనా వెళతామని… ఇరాన్ పై మరింత కఠిన చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ యుద్ధానికి సంబంధించి అమెరికా విస్తృత లక్ష్యాన్ని కూడా వెల్లడించింది. ఇరాన్ భవిష్యత్తులో అమెరికా, ఇజ్రాయెల్ లేదా మిత్రదేశాలపై దాడి చేసే ఆయుధాలను అభివృద్ధి చేయకుండా నిరోధించడమే ప్రధాన ఉద్దేశమని తెలిపింది.

అమెరికా స్టేట్ మెంట్ కు విరుద్దంగా ఇజ్రాయెల్ కామెంట్స్ ఉన్నాయి. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ యుద్ధ ప్రారంభంలోనే ఈ ఆపరేషన్ అవసరమైనంత కాలం కొనసాగుతుందని స్పష్టం చేశారు. దీంతో యుద్ధం వ్యవధిపై స్పష్టత లేకపోయినా, దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. ఇలా రష్యా-ఉక్రెయిన్ మాదిరిగా సుధీర్ఘంగా యుద్దం కొనసాగితే మాత్రం భారత్ తో పాటు ప్రపంచ దేశాల్లో వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ఇబ్బందులు మరింత పెరగడం ఖాయం.

36
కోవిడ్-19 పరిస్థితులు రిపీట్...
Image Credit : Asianet News

కోవిడ్-19 పరిస్థితులు రిపీట్...

ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ద ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై కూడా పడింది. కోవిడ్-19 తర్వాత అంతర్జాతీయ ప్రయాణాలపై వచ్చిన అతిపెద్ద అంతరాయం ఇదేనని నిపుణులు అంటున్నారు. కొన్ని ఎయిర్‌లైన్స్ సేవలను కొనసాగిస్తున్నప్పటికీ, మరికొన్ని పరిమిత స్థాయిలో మాత్రమే విమానాలను నడుపుతున్నాయి లేదా తాత్కాలికంగా నిలిపివేశాయి.

యుకే విదేశాంగ కార్యాలయం మధ్యప్రాచ్య దేశాలకు వెళ్లే వారు ముందుగా అధికారిక వెబ్‌సైట్‌లో తమ గమ్యస్థానానికి సంబంధించిన తాజా సూచనలు, భద్రతా సమాచారం పరిశీలించాల్సిందిగా సూచించింది. మొత్తం మీద ప్రస్తుతం మధ్యప్రాచ్య ప్రాంతానికి ప్రయాణం విషయంలో అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరం అని అధికారులు హెచ్చరిస్తున్నారు.

ఇండియా కూడా గల్ప్ దేశాల్లోని భారతీయులకు ఎప్పటికప్పుడు తగిన సూచనలు చేస్తోంది. అవసరం అయితే ఆయా దేశాల్లోని ఇండియన్స్ ని ఎయిర్ లిప్ట్ చేయడానికి కూడా సిద్దమని కేంద్రం ప్రకటించింది. అలాగే హర్మోజ్ జలసంధి గుండా రవాణాకు అంతరాయం ఏర్పడటంతో గ్యాస్ ఇబ్బందులు నెలకొన్నాయి. కానీ వాణిజ్య సిలిండర్ల సరఫరాకు ఇబ్బందులున్నా డొమెస్టిక్ సిలిండర్ల కొరత లేకుండా జాగ్రత్తపడుతోంది.

46
ఇరాన్ పై అమెరికా భీకర్ దాడులు..
Image Credit : ChatGPT

ఇరాన్ పై అమెరికా భీకర్ దాడులు..

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా జరుపుతున్న దాడుల్లో టెహ్రాన్ సహా దేశవ్యాప్తంగా క్షిపణి స్థావరాలు, సైనిక కేంద్రాలు ధ్వంసమయ్యాయి. అంతేకాదు ఇరాన్ ప్రధాన నాయకత్వమే టార్గెట్ గా దాడులు కొనసాగుతున్నాయి. ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) కు చెందిన పలువురు ఉన్నతాధికారులు కూడా మరణించినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. భద్రతా అధికారి అలీ లారిజాని, ఇంటెలిజెన్స్ మంత్రి ఎస్మాయిల్ ఖతిబ్, బసిజ్ ఫోర్స్ అధిపతి ఘోలాంరెజా సోలేమానీ కూడా దాడుల్లో మృతి చెందినట్లు వెల్లడించింది.

ఇరాన్ అణు ప్రోగ్రామ్‌కు సంబంధించిన కీలక కేంద్రాలు, చమురు, వాయు ప్రాజెక్టులు కూడా లక్ష్యంగా మారాయి. ముఖ్యంగా ఖార్గ్ దీవిలోని ఆయిల్ టెర్మినల్, ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఫీల్డ్‌లో భాగమైన సౌత్ పార్స్ ప్రాంతాలపై దాడులు జరిగాయి. మానవ హక్కుల సంస్థ HRANA ప్రకారం మార్చి 17 నాటికి ఇరాన్‌లో మొత్తం 3,114 మంది మరణించగా, ఇందులో 1,354 మంది పౌరులు, 1,138 మంది సైనికులు ఉన్నారు. కనీసం 207 మంది పిల్లలు కూడా ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

56
ఇరాన్ కూడా తగ్గట్లేదుగా..
Image Credit : Getty

ఇరాన్ కూడా తగ్గట్లేదుగా..

ఇరాన్ కూడా ఏమాత్రం వెనక్కి తగ్గకుండా ప్రతిదాడులకు దిగింది. టెల్ అవీవ్ సహా ఇజ్రాయెల్‌లోని సైనిక, ప్రభుత్వ కేంద్రాలపై క్షిపణి, డ్రోన్ దాడులు జరిపింది. మార్చి 18 నాటికి ఇజ్రాయెల్‌లో 14 మంది పౌరులు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు.

గల్ఫ్ దేశాల్లోని అమెరికా మిత్రదేశాలైన ఖతార్, బహ్రెయిన్, జోర్డాన్, యూఏఈ, కువైట్, ఒమాన్, సౌదీ అరేబియాల్లో కూడా దాడులు చోటుచేసుకున్నాయి. ఈ దాడుల్లో అమెరికాకు చెందిన 13 మంది సైనికులు మరణించారు. యూఏఈలో 8, కువైట్‌లో 6, ఒమాన్, సౌదీ, బహ్రెయిన్‌లో ఇద్దరు చొప్పున మరణించినట్లు సమాచారం.

ఇక ఇరాక్‌లో డ్రోన్ దాడిలో ఫ్రెంచ్ సైనికుడు మరణించగా, పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్‌కు చెందిన 27 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే వెస్ట్ బ్యాంక్‌లో ముగ్గురు మహిళలు మృతి చెందారు. టర్కీ, అజర్‌బైజాన్ దేశాలు కూడా తమ గగనతలంలో క్షిపణులను అడ్డుకున్నట్లు ప్రకటించాయి.

66
 ఆర్థిక వ్యవస్థపై మిడిల్ ఈస్ట్ యుద్దం
Image Credit : X

ఆర్థిక వ్యవస్థపై మిడిల్ ఈస్ట్ యుద్దం

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై గణనీయమైన ప్రభావం చూపుతున్నాయి. ఈ ప్రాంతంలో నెలకొన్న అస్థిర పరిస్థితులు అంతర్జాతీయ మార్కెట్లలో ఆందోళనలను పెంచాయి. గల్ఫ్ ప్రాంతంలో నౌకలపై దాడులు జరగడంతో, ప్రపంచానికి అత్యంత కీలకమైన సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి (Strait of Hormuz) దాదాపు మూసివేయబడిన పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం ద్వారా ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20 శాతం రవాణా జరుగుతుంది.

అదేవిధంగా ప్రధాన చమురు, సహజ వాయు కేంద్రాలపై కూడా దాడులు నమోదవుతున్నాయి. ఈ పరిణామాల కారణంగా ప్రపంచంలోనే అతిపెద్ద చమురు, గ్యాస్ ఉత్పత్తి సంస్థలు కొన్నిచోట్ల ఉత్పత్తిని తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీని ప్రభావంగా అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరలు పెరుగుతున్నాయి.

ఈ పరిస్థితులు కొనసాగితే ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల మధ్య అక్కడికి ప్రయాణం సురక్షితమా? యుద్ధం ఎంతకాలం కొనసాగుతుందన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
ప్రపంచం
యుద్ధం
అమెరికా సంయుక్త రాష్ట్రాలు
భారత దేశం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pakistan Economic Crisis: పాకిస్తాన్‌లో లీటర్ పెట్రోల్ రూ. 400.. దివాలా తీసినట్లేనా? అసలు ఏం జరుగుతోంది?
Recommended image2
అమెరికాలో ఇళ్ల బయట జనం ఎందుకు కనిపించరు.? ఇంతకీ వాళ్లేం చేస్తుంటారు.?
Recommended image3
Trump Tariffs: రష్యా ఆయిల్ కొంటే భారత్‌పై 100% టారిఫ్? ట్రంప్ చేతికి డెడ్లీ వెపన్ ఇచ్చిన అమెరికా పార్లమెంట్
Related Stories
Recommended image1
ఇరాన్ తో యుద్దంలో ట్రంప్ గెలిచినట్లా.. ఓడినట్లా..?
Recommended image2
Hyderabad: ఇరాన్ యుద్ధానికి మొయినాబాద్ ఫామ్ హౌజ్ ఘటనకు.. లింకు ఏంటబ్బా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved