- Home
- International
- గంటకు 2 వేల కి.మీల వేగం, ధర రూ. 1000 కోట్లు. భారత్‌కు ట్రంప్ ఆఫర్ చేసిన ఎఫ్ 35 విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలు
గంటకు 2 వేల కి.మీల వేగం, ధర రూ. 1000 కోట్లు. భారత్‌కు ట్రంప్ ఆఫర్ చేసిన ఎఫ్ 35 విమానాల్లో ఎన్నో ప్రత్యేకతలు
రెండు రోజుల పర్యటనలో భాగంగా అమెరికా వెళ్లిన ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో భేటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరు దేశాలకు సంబంధించిన అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ క్రమంలోనే ట్రంప్ ఎఫ్35 యుద్ధ విమానాలను భారత్‌కు ఆఫర్ చేయడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇంతకీ విమానాల ప్రత్యేకత ఏంటి? వీటి ఉపయోగం ఏంటి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
F 35 Fighter
ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ తర్వాత అమెరికా అధ్యక్షుడు విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా భారత్‌కు ఎఫ్-35 యుద్ధ విమానాలను ఆఫర్ చేశారు. ఇప్పుడీ అంశం ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారి తీసిది. అధునాతన టెక్నాలజీతో రూపొందించిన ఈ ఫైటర్ జెట్స్‌ను అమెరికా తనకు అత్యంత సన్నిహిత దేశాలకు కూడా ఇవ్వడానికి వెనుకడువేస్తోంది. నాటో కూమటి దేశమైన తుర్కియేకు కూడా వీటిని విక్రయించమని అమెరికా గతంలో తేల్చి చెప్పింది.
రష్యాకు చెందిన ఎస్ 400ను కొనుగోలు చేసిందన్న కారణంతోనే అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అయితే భారత్ కూడా ఈ విమానాలు ఉపయోగిస్తున్నా ఈ ఆధునిక ఫైటర్ జెట్‌ను విక్రయిస్తామని అమెరికా ప్రకంటిచడం విశేషం. F-35 యుద్ధవిమానం ప్రపంచంలోనే అత్యాధునిక మల్టీ-రోల్ స్టెల్త్ జెట్‌గా ప్రసిద్ధి చెందింది.
ఇది స్టెల్త్, సూపీరియర్ సెన్సార్స్, నెట్‌వర్కింగ్ సిస్టమ్స్, అధునాతన ఆయుధ వ్యవస్థల కలయికతో యుద్ధరంగంలో ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుంది. ఇప్పటి వరకు ఈ యుద్ధ విమానం అమెరికా, యుకే, ఇజ్రాయెల్, జపాన్‌తో పాటు కొన్ని దేశాల్లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడీ జాబితాలో భారత్ కూడా వచ్చి చేరింది.
ప్రత్యేకతలు ఏంటంటే..
ఈ యుద్ధ విమానంలో ఎఫ్ 135 ఇంజన్‌ను ఉపయోగిస్తారు. 40,000 పౌండ్ల థ్రస్ట్‌ను ఉత్పత్తి చేయడం ఈ విమాన ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ విమానం అత్యధికంగా గంటకు సుమారు 1975 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది. అలాగే ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల కళ్లుగప్పి ప్రయాణిస్తుంది. ఇది రాడర్లకు కూడా అంత సులభంగా ఈ విమానం అంతు చిక్కదు. కేవలం చిన్న సిగ్నేచర్‌ను మాత్రమే సృష్టిస్తుంది. దీంతో శత్రువుల కంట అంత సులభంగా పడదు. ఈ విమానాన్ని అమెరికా ఆయుధ తయారీ సంస్థ లాక్‌హీడ్ మార్టిన్ మరో రెండు సంస్థలతో కలిసి తయారు చేశారు. విమానం లోపల అధునాతన సాంకేతికతను అందించారు.
ఈ ఫ్లైట్ నడిపే పైలెట్‌కు హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే అందిస్తారు. వీటితో వారికి రియల్‌టైమ్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది. ఒక్క ఈ హెల్మెట్ ఖరీదే సుమారు రూ. 34 కోట్లు. దీనిబట్టే ఇందులో ఎంత అధునాతన సాంకేతికతను ఉపయోగించారో అర్థం చేసుకోవచ్చు. ఈ విమానం 6 నుంచి 8.1 టన్నుల బరువైన ఆయుధాలను మోసుకెళ్లగలదు. ఇక ఈ విమాన నిర్వహణ కూడా చాలా ఖరీదైన విషయంగా చెప్పాలి. ఈ విమానం గంటసేపు గాల్లో ఎగిరితే సుమారు 36,000 డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే రూ. 31 లక్షల రూపాయల ఇంధన ఖర్చవుతుంది. అలాగే ఈ విమానాలు నడపాలంటే పైల్స్ ప్రత్యేక శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం మూడు వేరియంట్స్..
ఎఫ్-35 స్టెల్త్‌జెట్‌ను మొత్తం మూడు వేరియంట్స్‌లో రూపొందించారు.
* ఇందులో మొదటిది ఎఫ్-35 ఎ బేసిక్ వేరియంట్. దీని ధర మన కరెన్సీలో రూ. 695 కోట్లు.
* ఇక రెండోది ఎఫ్ -35 బి వేరియంట్. దీని ధర రూ. 990 కోట్లు. ఈ విమానం ప్రత్యేకత విషయానికొస్తే రన్‌వే లేకపోయినా.. ఈ విమానం నిట్టనిలువుగా గాల్లోకి ఎగరగలదు, ల్యాండ్ కూడా కాగలదు.
* మూడో వేరియంట్ ఎఫ్ 5 సిని ప్రత్యేకంగా విమాన వాహక నౌకల కోసం రూపొందించారు. ఇందులో ఎన్నో సెక్యూరిటీ, హైఎండ్ టెక్నాలజీ ఫీచర్లను అందించారు. దీని ధర అక్షరాల రూ. 955 కోట్లకు పైమాటే.