MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Condoms: ఆసియాలో అత్యధికంగా కండోమ్స్ అమ్ముడవుతోన్న దేశం ఏదో తెలుసా.? వేల కోట్ల వ్యాపారం

Condoms: ఆసియాలో అత్యధికంగా కండోమ్స్ అమ్ముడవుతోన్న దేశం ఏదో తెలుసా.? వేల కోట్ల వ్యాపారం

Condoms: జనాభా నియంత్రణ అనగానే చట్టాలు, విధానాలు గుర్తుకు వస్తాయి. కానీ నిశ్శబ్దంగా కండోమ్‌ కీలక పాత్ర పోషిస్తోంది. దీని వ్యాపారం వేల కోట్లకు చేరింది. ఈ నేప‌థ్యంలో ఆసియా ఖండంలో కండోమ్స్ అత్యధికంగా అమ్ముడయ్యే దేశం ఏదంటే. 

1 Min read
Author : Narender Vaitla
Published : Feb 06 2026, 04:20 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
పెరుగుతున్న జనాభా… పెరుగుతున్న అవసరం
Image Credit : Getty

పెరుగుతున్న జనాభా… పెరుగుతున్న అవసరం

ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతోంది. ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి, వనరుల కొరత వంటి సమస్యలు ప్రభుత్వాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో కండోమ్ అత్యంత సులభమైన, తక్కువ ఖర్చుతో అందుబాటులో ఉన్న పరిష్కారంగా మారింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆసియా దేశాల్లో లైంగిక ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో కండోమ్ వినియోగం భారీగా పెరిగింది.

25
కండోమ్ వినియోగంలో చైనా టాప్
Image Credit : Getty

కండోమ్ వినియోగంలో చైనా టాప్

అంతర్జాతీయ రిపోర్ట్ ల ప్రకారం ఆసియాలో కండోమ్ వినియోగంలో చైనా మొదటి స్థానంలో ఉంది. చైనాలో ప్రతి ఏడాది సుమారు 5.8 బిలియన్ యూనిట్లు వినియోగంలోకి వస్తున్నాయి. ఈ సంఖ్య ఆసియాలోని ఇతర దేశాలన్నింటికంటే ఎక్కువ. భారత్ రెండో స్థానం, టర్కీ మూడో స్థానం లో ఉన్నాయి.

Related Articles

Related image1
OTT: ఈ సినిమా ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే చూడండి.. రొమాన్స్‌, ట్విస్టులతో మ‌తిపోవాల్సిందే. ఎక్కడ చూడొచ్చు..
Related image2
Richest Cricketer: కోహ్లీ, ధోనీ కాదు.. భార‌త్‌లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా.? రూ. 1450 కోట్ల ఆస్తులు
35
చైనాలో ఈ మార్కెట్ ఇంత పెద్దదిగా ఎందుకు మారింది?
Image Credit : social media

చైనాలో ఈ మార్కెట్ ఇంత పెద్దదిగా ఎందుకు మారింది?

చైనాలో జనాభా సుమారు 140 కోట్లు. వీరిలో 60 కోట్లకు పైగా లైంగికంగా చురుకుగా ఉన్నవారిగా అంచనా. ఈ స్థాయి జనాభానే కండోమ్ డిమాండ్‌ను భారీగా పెంచుతోంది. మరోవైపు చైనా ప్రభుత్వం సురక్షిత సంబంధాలు, లైంగిక వ్యాధుల నివారణపై విస్తృత ప్రచారాలు నిర్వహిస్తోంది. దీని వల్ల కండోమ్ వాడకంపై ఉన్న సామాజిక సంకోచం గణనీయంగా తగ్గింది.

45
బిలియన్ల డాలర్ల వ్యాపారంగా మారిన కండోమ్ మార్కెట్
Image Credit : our own

బిలియన్ల డాలర్ల వ్యాపారంగా మారిన కండోమ్ మార్కెట్

2023 నాటికి చైనాలో కండోమ్ మార్కెట్ విలువ సుమారు 3.69 బిలియన్ అమెరికన్ డాలర్లుగా నమోదైంది. 2030 నాటికి ఇది 7.24 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. అంటే వచ్చే సంవత్సరాల్లో ఈ మార్కెట్ దాదాపు రెట్టింపు కావచ్చని నిపుణులు చెబుతున్నారు. సంవత్సరానికి సగటు 10 శాతం వృద్ధి నమోదు అవుతోంది. ఇందులో లాటెక్స్ కండోమ్స్ వాటా 85 శాతం కంటే ఎక్కువ.

55
భారత్ సహా ఇతర ఆసియా దేశాల పరిస్థితి
Image Credit : our own

భారత్ సహా ఇతర ఆసియా దేశాల పరిస్థితి

ఆసియాలో రెండో అతిపెద్ద కండోమ్ మార్కెట్ భారత్. అయితే ఇక్కడ ఇంకా సామాజిక సంకోచం పెద్ద సవాలుగానే ఉంది. ప్రభుత్వ ఆరోగ్య పథకాలు, అవగాహన కార్యక్రమాల కారణంగా వినియోగం నెమ్మదిగా పెరుగుతోంది. టర్కీ, జపాన్, దక్షిణాసియా దేశాల పట్టణ ప్రాంతాల్లో కూడా డిమాండ్ వేగంగా పెరుగుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం
వైరల్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Neal Katyal : ట్రంప్ కే చుక్కలు చూపిస్తున్న భారత సంతతి లాయర్.. ఎవరీ నీల్ కత్యాల్..?
Recommended image2
US Tariffs : ట్రంప్ టారీఫ్స్ కు సుప్రీం బ్రేక్ .. అమెరికా అధ్యక్షుడి పవర్ ఈ చట్టంముందు తుస్సుమందిగా..!
Recommended image3
Bangladesh Cabinet : బంగ్లాదేశ్ కేబినెట్‌లో హిందూ మంత్రి.. ఎవరీ గయేశ్వర్ చంద్ర రాయ్?
Related Stories
Recommended image1
OTT: ఈ సినిమా ఒంట‌రిగా ఉన్న‌ప్పుడే చూడండి.. రొమాన్స్‌, ట్విస్టులతో మ‌తిపోవాల్సిందే. ఎక్కడ చూడొచ్చు..
Recommended image2
Richest Cricketer: కోహ్లీ, ధోనీ కాదు.. భార‌త్‌లో రిచెస్ట్ క్రికెట‌ర్ ఎవ‌రో తెలుసా.? రూ. 1450 కోట్ల ఆస్తులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved