- Home
- Sports
- Cricket
- Richest Cricketer: కోహ్లీ, ధోనీ కాదు.. భారత్‌లో రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా.? రూ. 1450 కోట్ల ఆస్తులు
Richest Cricketer: కోహ్లీ, ధోనీ కాదు.. భారత్‌లో రిచెస్ట్ క్రికెటర్ ఎవరో తెలుసా.? రూ. 1450 కోట్ల ఆస్తులు
Richest Cricketer: ఇండియన్ క్రికెట్ టీమ్‌లో రిచెస్ట్ ప్లేయర్స్ అనగానే ముందుగా కోహ్లీ, ధోనీల పేర్లు వినిపిస్తాయి. అయితే దీనికి పూర్తిగా భిన్నంగా ఓ మాజీ క్రికెటర్ ఏకంగా రూ. 1450 కోట్లతో మొదటి స్థానంలో నిలిచాడు. ఇంతకీ ఆ క్రికెటర్ ఎవరంటే..

2026లో భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్
భారత క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మ లాంటి స్టార్ ప్లేయర్లను వెనక్కి నెట్టి… ప్రస్తుతం భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా ఓ మాజీ ఆటగాడు నిలిచాడు. అతడే అజయ్ జడేజా.
కోహ్లీ, ధోనీ, రోహిత్ సంపద ఎంత?
ప్రస్తుతం క్రికెట్ ప్రపంచంలో భారీగా సంపాదిస్తున్న ఆటగాళ్లలో
* విరాట్ కోహ్లీ నికర విలువ సుమారు రూ. 1050 కోట్లు
* ఎంఎస్ ధోనీ సంపద దాదాపు రూ. 1000 కోట్లు
* రోహిత్ శర్మ నికర విలువ సుమారు రూ. 214 కోట్లు
ఈ ముగ్గురు స్టార్లు ఎంత ధనవంతులైనా, అజయ్ జడేజా సంపదతో పోలిస్తే చాలా తక్కువే.
అజయ్ జడేజా సంపద ఒక్కసారిగా ఎలా పెరిగింది?
1990లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అజయ్ జడేజాను తాజాగా జామ్‌నగర్ రాజ కుటుంబ వారసుడిగా ప్రకటించారు. ఈ రాజవంశ వారసత్వంతో అతడి సంపద ఒక్కసారిగా పెరిగింది. ఇంతకుముందు సుమారు రూ.250 కోట్లుగా ఉన్న అతడి నికర విలువ, ఇప్పుడు దాదాపు రూ.1450 కోట్లకు చేరింది.
జడేజా కుటుంబానికి క్రికెట్‌తో ఉన్న బలమైన అనుబంధం
అజయ్ జడేజా కుటుంబానికి భారత క్రికెట్ చరిత్రతో గాఢమైన సంబంధం ఉంది. అతడి బంధువులైన కేఎస్ రంజిత్‌సింహ్జీ, కేఎస్ దులీప్‌సింహ్జీ వారి గౌరవార్థమే రణ్జీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలకు పేర్లు పెట్టారు. ఈ నేపథ్యం జడేజా కుటుంబ గొప్పతనాన్ని మరింత చాటుతుంది.
క్రికెట్ కెరీర్‌కు బ్రేక్.. సంపదకు బిగ్ బూస్ట్
2000లో మ్యాచ్ ఫిక్సింగ్ వివాదంతో అజయ్ జడేజా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత తిరిగి జాతీయ జట్టుకు ఆడలేదు. అయినా కామెంటేటర్‌గా, కోచ్‌గా, రియాలిటీ షోల్లో పాల్గొంటూ ప్రజల మధ్యే ఉన్నాడు. ఇప్పుడు రాజ కుటుంబ వారసత్వంతో అతడే అధికారికంగా భారత్‌లో అత్యంత ధనవంతుడైన క్రికెటర్‌గా నిలిచాడు.

