MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • International
  • Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?

Alcohol Rule: మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఆల్కహాల్ అమ్మకాలు బంద్.. ఎందుకో తెలుసా.?

Alcohol Rule: ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆల్కహాల్ ప్రియులు ఉన్నార‌నే విష‌యం తెలిసిందే. ఆల్కహాల్ విక్ర‌యాలకు సంబంధించి ఒక్కో దేశంలో ఒక్కోలా నియ‌మాలు ఉంటాయి. అయితే థాయ్‌లాండ్‌లో ఆల్కహాల్ అమ్మ‌కాల్లో ఒక వింత నిబంధ‌న ఉంది. అదేంటంటే.. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 06 2025, 02:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థాయ్‌లాండ్‌లో వింత రూల్
Image Credit : Getty

థాయ్‌లాండ్‌లో వింత రూల్

థాయ్‌లాండ్‌లో కొన్నేళ్ల నుంచి మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ఆల్కహాల్ విక్రయంపై నిషేధం అమలులో ఉంది. ఐదు దశాబ్దాలుగా కొనసాగిన ఈ రూల్‌ను నవంబర్ 2025లో కొంతవరకు సడలించారు. 1972లో థాయ్‌లాండ్‌ను సైనిక ప్రభుత్వం పాలిస్తున్న సమయంలో ఈ ఆంక్ష మొదలైంది. ప్రభుత్వం అభిప్రాయం ప్రకారం మధ్యాహ్న సమయంలో ఆల్కహాల్ అందుబాటులో ఉంటే ఉద్యోగులు పని మీద దృష్టి పెట్టడం తగ్గిపోతుంది. ప్రత్యేకంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉత్పాదకత పడిపోతుందని భావించి మధ్యాహ్నం మూడు గంటలు ఆల్కహాల్ అమ్మకాన్ని నిలిపివేశారు.

25
సామాజిక శాంతిని కాపాడాలనే ఆలోచన
Image Credit : Getty

సామాజిక శాంతిని కాపాడాలనే ఆలోచన

పని సంబంధిత కారణాలతో పాటు, మధ్యాహ్నం ఆల్కహాల్ తాగడం వల్ల చిన్న చిన్న‌ గొడవలు, ప్రజా అశాంతి, నేరాలు పెరుగుతున్నాయి అని అధికారులు గమనించారు. అందుకే కొన్ని గంటలపాటు ఆల్కహాల్ దొరకకుండా చేస్తే ఈ సమస్యలు తగ్గుతాయని భావించారు. అలా “సామాజిక క్రమాన్ని కాపాడడం” అనే భావనతో కూడా ఈ రూల్ కొనసాగింది.

Related Articles

Related image1
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌
Related image2
Maruti Suzuki S Presso: నెల‌కు రూ. 6,500 క‌డితే చాలు.. రూ. 3.5 ల‌క్ష‌ల‌కే కొత్త కారు మీ సొంతం
35
పర్యాటక రంగం ఒత్తిడి
Image Credit : Getty

పర్యాటక రంగం ఒత్తిడి

కాలానుగుణంగా థాయ్‌లాండ్ ప్రపంచంలో అత్యధికంగా సందర్శించే దేశాలలో ఒకటిగా మారింది. టూరిస్ట్ ప్రదేశాలు, హోటళ్లు, బార్లు ఈ నియమంతో ఇబ్బంది పడుతున్నట్లు ప్రభుత్వానికి తెలిపారు. విదేశీ పర్యాటకులు కూడా మధ్యాహ్నం ఆల్కహాల్ దొరకకపోవడం ఆశ్చర్యంగా భావించేవారు. అలా పర్యాటక రంగం నుంచి ఒత్తిడి పెరగడంతో ఈ రూల్‌ను తిరిగి పరిశీలించే పరిస్థితి ఏర్పడింది. పాత నిషేధం దేశ ఆర్థిక ప్రయోజనాలకు సరిపడడం లేదని ప్రభుత్వం గ్రహించింది.

45
నవంబర్ లో కొత్త నిర్ణయం
Image Credit : Getty

నవంబర్ లో కొత్త నిర్ణయం

సుదీర్ఘ సమీక్ష తర్వాత థాయ్ ప్రభుత్వం నవంబర్ 2025లో కీలక మార్పులు చేసింది. ఇప్పుడు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల మధ్య లైసెన్స్ ఉన్న హోటళ్లు, రిసార్ట్‌లు, ఎంటర్టైన్‌మెంట్ సెంటర్‌లు ఆల్కహాల్ విక్రయించేందుకు అనుమతి ఇచ్చారు. ఇది పర్యాటక రంగానికి భారీ రిలీఫ్‌గా మారింది. ఈ నిర్ణయం వల్ల వ్యాపారాలు తిరిగి చురుకుగా మారే అవకాశం ఉంది.

55
సడ‌లింపు ఇచ్చినా క‌ఠిన నిబంధ‌న‌లు
Image Credit : Pixabay

సడ‌లింపు ఇచ్చినా క‌ఠిన నిబంధ‌న‌లు

నిర్ణీత స‌మ‌యంలో ఆల్కహాల్ తాగుతూ కనిపిస్తే ఫైన్ పడే అవకాశం ఉంది. ఒక‌వేళ‌ ఆల్కహాల్ ముందే కొనుకున్నా కూడా. ఈ నియమాలు ఎలా అమలవుతాయన్న విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. బార్, రెస్టారెంట్ యజమానులు ఈ అపోహల వల్ల మళ్లీ కస్టమర్లు ఇబ్బంది పడతారేమోనని ఆందోళన చెందుతున్నారు. దీని అర్థం పాలసీ సడలించినా, అమలులో ఇంకా స్పష్టమైన మార్గదర్శకాలు రావాల్సి ఉంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రపంచం

Latest Videos
Recommended Stories
Recommended image1
Baba Vanga : వణికిస్తున్న బాబా వంగా జోస్యం.. మరో ప్రపంచ యుద్ధం !
Recommended image2
Iran Israel war: ఇరాన్‌, ఇజ్రాయెల్‌లు ఎందుకు కొట్టుకుంటున్నాయి.? అస‌లు వీళ్ల లొల్లి ఏందీ..
Recommended image3
Israel: మ‌ళ్లీ మొద‌లైన యుద్ధం.. దూసుకొచ్చిన మిస్సైళ్లు. అసలేం జరగనుంది.?
Related Stories
Recommended image1
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌
Recommended image2
Maruti Suzuki S Presso: నెల‌కు రూ. 6,500 క‌డితే చాలు.. రూ. 3.5 ల‌క్ష‌ల‌కే కొత్త కారు మీ సొంతం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved