చర్మం నల్లగా మారుతోందా.. అయితే ఈ టిప్స్ ట్రై చెయ్యండి!
వాతావరణంలోని మార్పులు, అధిక రసాయనాలు ఉన్న సబ్బుల వాడకం, ఎండలో ఎక్కువగా తిరగడం, కొన్ని రకాల అనారోగ్య సమస్యలు.
ఒత్తిడి, హార్మోన్లలో మార్పులు, కొన్ని రకాల మందులు వాడకం, సౌందర్య ఉత్పత్తుల వాడకం వంటి ఇతర సమస్యల కారణంగా చర్మంలో మెలనిన్ (Melanin) పెరిగి చర్మం నల్లగా మారుతుంది. మరీ ఇలా నల్లగా మారిన చర్మాన్ని తిరిగి తెల్లగా మార్చుకోవడానికి కొన్ని సహజ సిద్ధమైన బ్యూటీ టిప్స్ (Beauty Tips) ను అనుసరిస్తే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
మన రోజువారి ఆహార జీవనశైలిలోని మార్పులు కూడా చర్మం నల్లగా మారడానికి కారణం అవుతుంది. కనుక జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ కు దూరంగా ఉంటూ పండ్లు, కూరగాయలు, డ్రై ఫ్రూట్స్, చిరుధాన్యాల వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలను (Healthy food items) తీసుకోవాలి. అలాగే నీటిని (Water) ఎక్కువగా తాగాలి.
చర్మానికి తగిన శ్రద్ధ చూపుతూ చర్మతత్వానికి సరిపడే సబ్బులు, మాయిశ్చరైజర్ (Moisturizer), సన్ స్క్రీన్ లోషన్లను Sun (screen lotions) ఉపయోగించాలి. అలాగే 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలి. చర్మం నలుపును తగ్గించి తెల్లగా మార్చుకునేందుకు సహజ సిద్ధమైన బ్యూటీ టిప్స్ ను అనుసరిస్తే చర్మానికి మంచి ఫలితాలు అందుతాయి.
సెనగపిండి, పెరుగు, పసుపు: ఒక కప్పులో రెండు స్పూన్ ల సెనగపిండి (Gram flour), ఒక స్పూన్ పెరుగు (Curd), చిటికెడు పసుపు (Turmeric) వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని అరగంట తరువాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే చర్మం నలుపుదనం తగ్గి చర్మానికి మంచి నిగారింపు అందుతుంది.
దోసకాయ రసం, నిమ్మరసం: ఒక కప్పులో దోసకాయ రసం (Cucumber juice), నిమ్మరసాలను (Lemon juice) సమాన భాగాలుగా తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని ఇరవై నిమిషాల తరువాత ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఈ మిశ్రమం చర్మానికి తేమను అందించి పొడిబారి సమస్యలు తగ్గించడంతోపాటు చర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది.
పచ్చి బొప్పాయి గుజ్జు, పచ్చిపాలు: ఒక కప్పులో కొద్దిగా పచ్చి బొప్పాయి గుజ్జు (Raw papaya pulp), పచ్చి పాలు (Milk) తీసుకుని బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి సున్నితంగా మర్దన చేసుకోవాలి. పది నిమిషాల తరువాత నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఈ మిశ్రమం ముఖానికి సహజసిద్ధమైన మెరుపును అందిస్తుంది. అలాగే చర్మ సౌందర్యం కోసం మీరు ఆశించిన ఫలితాలను పొందగలరు.
అలోవెరా జెల్: చర్మ సమస్యలను (Skin problems) తగ్గించడానికి, చర్మానికి మంచి నిగారింపును అందించడానికి అలోవెరా జెల్ ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. రాత్రి పడుకునే ముందు ముఖానికి అలోవెరా జెల్ (Aloevera gel) ను అప్లై చేసుకుని ఉదయాన్నే ముఖాన్ని నీటితో శుభ్రపరుచుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు ప్రయత్నిస్తే చర్మం నలుపుదనం తగ్గి చర్మానికి మంచినిగారింపు అందుతుంది.
పై వాటిలో ఏ ఒక్కదానినైనా క్రమం తప్పకుండా అనుసరిస్తే చర్మానికి మంచి ఫలితాలను (Good results) పొందగలరు. అయితే అన్ని చర్మతత్వాలకు ఈ బ్యూటీ టిప్స్ సరిపోకపోవచ్చు. కనుక మొదట పరీక్షించి (Tested) ఉపయోగించడం మంచిది.