15 నుంచి 50 సంవత్సరాల వయసు వారికి ఈ యోగాసనాలతో ఎంతో మేలు..
యోగా ఏ ఒక్క వయసు వారికో, లింగానికో, వర్గానికో కాదు.. ప్రతి ఒక్కరికీ ఎంతో మేలు చేస్తుంది. రోజూ యోగా చేయడం వల్ల ఎన్నో రోగాల ముప్పు తప్పుతుంది తెలుసా?

40 ఏండ్లు దాటిన తర్వాత కూడా చాలా యంగ్ అండ్ ఫిట్ గా కనిపించే నటీమణులు చాలా మంది ఉన్నారు. వీరిలో మొదటి పేరు మలైకా అరోరా అయితే రెండో పేరు శిల్పా శెట్టి. అసలు వీళ్ల వయసును అంచనా వేయడం కష్టమే. ఎంత యంగ్ గా, ఫిట్ గా ఉంటారో మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. అంతేకాదు ఈ ముద్దుగుమ్మలు జిమ్, యోగా సెషన్లలో కూడా ఎక్కువ సమయం గడుపుతారు. నేటికీ ఈ ఇద్దరు నటీమణులు చాలా యంగ్ గా కనిపిస్తున్నారు. దీని వెనుక ఉన్న సీక్రెట్ మరేంటో కాదు యోగా, హెల్తీ ఫుడ్ యేనంటున్నారు.
నిజానికి యోగాను ఎంత త్వరగా ప్రాక్టీస్ చేస్తే అంత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అంతర్జాతీయ యోగా దినోత్సవం 2023 సందర్భంగా.. ప్రతి ఒక్కరికీ ప్రయోజనకరంగా ఉండే ఇలాంటి యోగా ఆసనాల గురించి తెలుసుకుందాం..
యోగా మనల్ని యవ్వనంగా ఎలా చేస్తుంది?
నిజానికి యోగా మన శరీరాన్ని ఆరోగ్యంగా, యవ్వనంగా ఉంచడానికి ఎంతో సహాయపడుతుంది. యోగా వృద్ధాప్య ప్రక్రియను తిప్పికొట్టలేనప్పటికీ లేదా ఒక వ్యక్తిని యవ్వనంగా కనిపించేలా చేయలేనప్పటికీ, ఇది మన మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అలాగే చర్మం యవ్వనంగా కనిపించడానికి సహాయపడుతుంది.
యోగా చేయకుంటే శరీర బరువు పెరుగుతుంది. అలాగే శరీరంలో రక్త ప్రసరణ సక్రమంగా జరగదు. దీనివల్ల చర్మం ముడతలు పడుతుంది. వదులుగా అవుతుంది. అంతేకాదు కండరాలు, ఎముకలు కూడా బలహీనపడతాయి. కానీ యోగా చేయడం వల్ల ఇలాంటి సమస్యలేమీ రావు. అలాగే మీ వృద్ధాప్య ప్రక్రియ కాస్త నెమ్మదిస్తుంది. ఎలాంటి యోగాసనాలు మనకు మేలు చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
tadasana
తాడాసనం
ఇది శరీర సమతుల్యతను, స్థిరత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది వెన్నెముకను సాగదీస్తుంది. అలాగే కాళ్లను బలోపేతం చేస్తుంది. శరీరంలో స్థిరత్వాన్ని పెంచడానికి సహాయపడుతుంది. ఇది మీ చర్మాన్ని బిగుతుగా చేస్తుంది. చర్మం ముడతలు పడే అవకాశం కూడా తగ్గుతుంది.
uttanasana
ఉత్తనాసనం
ఈ ముందుకు వంగే భంగిమ తొడ కండరాలు, దిగువ వీపును విస్తరిస్తుంది. ఇది వెన్నెముకలో ఒత్తిడిని తగ్గిస్తుంది. అలాగే జీర్ణక్రియను ప్రేరేపిస్తుంది. మనస్సును శాంతపరచడానికి సహాయపడుతుంది. ఈ ఆసనం మెదడుకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది. ఆక్సిజన్ ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.
Bhujangasana
భుజంగాసనం
ఈ భుజంగాసనం ఛాతీని విస్తరిస్తుంది. వెన్నెముకను బలోపేతం చేస్తుంది. ఉదర కండరాలను సాగదీస్తుంది. ఇది జీర్ణవ్యవస్థను ఉత్తేజపరచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
sarvangasana
సర్వాంగసనం
ఈ భంగిమ ముఖానికి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. రక్త ప్రసరణను ప్రోత్సహిస్తుంది. అలాగే ఆందోళన, అలసట నుంచి ఉపశమనం పొందటానికి సహాయపడుతుంది. ఇది భుజాలు, మెడ, కోర్ కండరాలను బలోపేతం చేస్తుంది.
Shavasana
శవాసన
ఈ విశ్రాంతి భంగిమ శరీరం, మనస్సును లోతుగా విశ్రాంతి తీసుకోవడానికి సహాయపడుతుంది. ఇది ఒత్తిడిని తగ్గించడానికి, ప్రశాంతత భావాన్ని ప్రోత్సహించడానికి, పునరుజ్జీవనం, పునరుద్ధరణను సహాయపడుతుంది.