పొరపాటున కుక్క కరిస్తే తప్పక తీసుకోవలసిన జాగ్రత్తలివే?
సాధారణంగా మనుషులు ఒక్కోసారి వారికి చిరాకుగా ఉన్నప్పుడు ఇతరులపై కోప్పడడం చేస్తుంటాము. మనుషులు మాదిరిగానే జంతువుల సైతం వాటికి చిరాకు కలిగినప్పుడు లేదా వాటికి అసౌకర్యంగా ఉన్నప్పుడు ఇతరులపై దాడి చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కుక్కలు సైతం కొన్నిసార్లు మనుషులను కరుస్తూ ఉండడం మనం చూస్తుంటాము. అయితే కుక్క కరిచిన చాలామంది వాటిని ఎంతో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అయితే కుక్క కరిస్తే మాత్రం ఈ క్రింది తెలిపిన జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి.

మనం ఇంట్లో పెంచుకుంటున్నటువంటి కుక్క అయినా లేదా వీధి కుక్క అయినా కానీ కరిచిన వెంటనే మనం కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించాలని లేకపోతే తీవ్రమైన పరిణామాలను ఎదుర్కొనే పరిస్థితులు కూడా తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు.కుక్క కాటు వల్ల ప్రాణాంతకరమైన రేబిస్ వ్యాధి వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అందుకే జాగ్రత్తలు తప్పనిసరి.
కుక్క కరవడం వల్ల రేబిస్ అనే వైరస్ మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఈ వైరస్ మనిషి మెదడుపై ప్రభావం చూపుతుంది. అందుకే ఇలాంటి ప్రాణాంతకరమైన రేబిస్ వ్యాధి గురించి ప్రజలలో అవగాహన తీసుకురావడం కోసం ప్రతి ఏడాది సెప్టెంబర్ 28వ తేదీ రేబిస్ డే జరుపుకుంటారు.ఈ విధమైనటువంటి వైరస్ మనుషులకు వ్యాప్తించకుండా ఉండాలంటే కుక్కలను పెంచేవారు వాటికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు కలగకుండా తరచూ టీకాలు వేయించాలి.
ఇలా ఇంజక్షన్లు వేసిన కుక్కలు కరిచిన కూడా మనకు పెద్దగా ప్రమాదం ఉండదు.ఇక కుక్క కరిచిన వెంటనే కరిచిన చోట సబ్బుతో గాయాని శుభ్రంగా కడిగి గోరువెచ్చని నీటితో పది నిమిషాల పాటు ఆ నీరు ఆ గాయం పై పడేలా పోస్తూ ఉండాలి.శుభ్రమైన గుడ్డుతో ఆగాయం మొత్తం తుడిచి మన దగ్గర ఏదైనా యాంటీబయోటిక్ ఉంటే దానిని రాసి ఆ గాయం చుట్టూ స్టేరలైజ్డ్ బ్యాండేజ్ చుట్టాలి. అనంతరం డాక్టర్ ను సంప్రదించాలి.
డాక్టర్ సలహాలు సూచనల మేరకు వాటిని పాటిస్తూ పలు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుక్క కరిచిన తర్వాత మనలో ఏవైనా మార్పులు వస్తున్నాయేమోనని గమనించుకోవాలి. అంటే కుక్క కరిచిన చోట ఎర్రగా దద్దుర్లు రావడం లేదా వాపు రావడం కొంతమందిలో జ్వరం వంటి లక్షణాలు కూడా వస్తుంటాయి. ఇలాంటి లక్షణాలు ఉంటే వైద్యుని సంప్రదించాలి.ఇక కుక్క కరిచిన తర్వాత రేబిస్ వ్యాక్సిన్ మనకు వేయటం వల్ల ఆ వైరస్ ప్రభావం మనపై చూపదు.
ఇక మనకు కరిచిన ఆ కుక్క ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనే విషయాన్ని కూడా గమనించాలి.అది సాధారణమైన కుక్క లేకపోతే పిచ్చికుక్క అనే విషయాన్ని గమనించి డాక్టర్ కి తెలియచేయడం వల్ల మనకు కరిచిన కుక్కను బట్టి వారు ట్రీట్మెంట్ ఇస్తారు.ఒకవేళ మనకు పిచ్చికుక్క కరిస్తే రేబిస్ వైరస్ తో పాటు ఇతర ఇన్ఫెక్షన్లు కలిగించే బ్యాక్టీరియాల్ కూడా మనలోకి ప్రవేశించి మరింత ప్రమాదకరంగా మార్చే పరిస్థితిలో ఏర్పడతాయి కనుక కుక్క కరిచిన వారు తప్పకుండా ఈ జాగ్రత్తలను పాటించాలి.