చాక్లెట్ బీపీని కంట్రోల్ చేస్తుందా.. దీనితో ఏయే రోగాలు తగ్గుతాయంటే?
World chocolate day: నిజానికి చాక్లెట్ మన ఆరోగ్యానికి మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. వీటిని తింటే ఒత్తిడి తగ్గి మనస్సు ప్రశాంతంగా మారుతుంది. ఇది అధిక రక్తపోటును కూడా తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

చాక్లెట్ కేవలం చాక్లెట్ మాత్రమే కాదు ఇది ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్, హ్యాపీనెస్ ఫుడ్, మూడ్ బూస్టర్ కూడాను. మూడ్ ఆఫ్ అయినప్పుడల్లా చాలా మంది చాక్లెట్ ను తినమని సిఫార్సు చేస్తారు. ప్రేమను ఎక్స్ ప్రెస్ చేయడానికి కూడా చాక్లెట్లను ఇస్తుంటారు. కానీ చాక్లెట్ మీ మొత్తం ఆరోగ్యానికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని మీకు తెలుసా? అవును ఇది మీ రక్తపోటును నియింత్రించడానికి సహాయపడుతుంది. ప్రపంచ చాక్లెట్ దినోత్సవం సందర్భంగా చాక్లెట్ వల్ల కలిగే మరికొన్ని ఆరోగ్య ప్రయోజనాలు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
Image: Getty Images
మానసిక స్థితిని పెంచుతుంది
కొన్ని రకాల ఆహారాలను తినడం వల్ల సెరోటోనిన్ స్థాయిలు పెరుగుతాయన్న విషయం తెలిసిందే. అయితే చాక్లెట్ తినని వ్యక్తుల కంటే డార్క్ చాక్లెట్ తినే వారికే నిరాశ లక్షణాలు తక్కువగా ఉంటాయని నిపుణఉలు చెబుతున్నారు.
Image: Getty Images
సెరోటోనిన్, ఎండార్ఫిన్లను పెంచుతుంది
కొద్ది మొత్తంలో డార్క్ చాక్లెట్ ను తింటే ఇది మిమ్మల్ని రిఫ్రెష్ గా ఉంచడానికి, మంచి అనుభూతిని కలిగించడానికి సహాయపడుతుంది. డార్క్ చాక్లెట్ లో ఎక్కువ మొత్తంలో కోకో కంటెంట్ ఉంటుంది. డార్క్ చాక్లెట్ శరీరంలో సెరోటోనిన్ స్థాయిని పెంచి, మన మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సెరోటోనిన్ ఒక ప్రభావవంతమైన యాంటి డిప్రెసెంట్. ఇది అంతర్గత ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే ఎండార్ఫిన్లు మంచి అనుభూతి హార్మోన్. చాక్లెట్ తినడం వల్ల మన మెదడులో ఎండార్ఫిన్ల స్థాయి పెరుగుతుంది.
తక్కువ రక్తపోటు నుంచి ఉపశమనం
"70% కోకో ఉన్న డార్క్ చాక్లెట్ లో యాంటీ ఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్, ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్త నాళాలను సడలిస్తుంది. అలాగే రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అందుకే ఇది మీ రక్తపోటును సమతుల్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. చాక్లెట్, కోకోలో థియోబ్రోమైన్ ఉంటుంది. ఇది రక్తపోటును సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కోకో బీన్స్ లో ఎక్కువ మొత్తంలో థియోబ్రోమైన్ ఉంటుంది. కాబట్టి డార్క్ చాక్లెట్ లో వైట్ చాక్లెట్ కంటే ఎక్కువ థియోబ్రోమైన్ ఉంటుంది.
డయాబెటిస్ పేషెంట్లకు
డార్క్ చాక్లెట్ శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గించడానికి, ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ డయాబెటిక్ పేషెంట్లు మార్కెట్ లో దొరికే నార్మల్ చాక్లెట్ల వినియోగానికి దూరంగా ఉండాలి. అలాగే డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే డార్క్ చాక్లెట్ ను తినాలి.
ఆరోగ్యానికి ఏ చాక్లెట్ మంచిది?
చక్కెరున్న, రుచిగల చాక్లెట్ ను తినొద్దు. యాంటీఆక్సిడెంట్లు, పాలీఫెనాల్స్ కలిగిన డార్క్ చాక్లెట్ తినడం ఆరోగ్యానికి మంచి మేలు చేస్తుంది. 70% కోకో కలిగిన డార్క్ చాక్లెట్ నే తినండి. ఇది రక్తపోటును, కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచుతుంది. అలాగే మీకు మూడ్ బూస్టర్ గా కూడా పనిచేస్తుంది.