Health Tips: బరువు పెరగటానికి ఒత్తిడి కారణమా.. అసలు విషయం ఏంటంటే?
Health Tips: సాధారణంగా ఒత్తిడి అనేది మానసిక ఆందోళన అనే కాదు శారీరకంగా కూడా ఎన్నో ఇబ్బందులకి గురిచేస్తుంది అందులో ఒకటి బరువు పెరగటం. అందుకే ఒత్తిడిని ఏ విధంగా తగ్గించుకోవచ్చో ఇక్కడ చూద్దాం.

ఒత్తిడి శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది దీర్ఘ చేయాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది ఇవి మాత్రమే కాదు అకస్మాత్తుగా బరువు పెరిగేందుకు కారణమవుతుంది అందుకే ఒత్తిడి స్థాయిలో అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.
మనం ఒత్తిడికి గురైనప్పుడు ఎక్కువగా తింటూ ఉంటాం. దానివల్ల బరువు పెరిగిపోతారు. లేదంటే శరీరంలో కార్టిసాల్ స్థాయిలు పెరిగిపోవడం వల్ల జరుగుతుంది. కార్టిసాల్ అనేది అధిక ఒత్తిడికి గురైనప్పుడు శరీరం విడుదల చేసే ఒక హార్మోన్. ఇది విడుదలైనప్పుడు ఆకలిని ప్రేరేపిస్తుంది.
దానివలన అతిగా ఆకలి వేస్తుంది. అందుకే కార్టిసాల్ తగ్గించుకునే మార్గాలు చూద్దాం. దీర్ఘ శ్వాస కార్టిసాల్ స్థాయిలని తగ్గించడంలో సహాయపడుతుంది. నాడీ వ్యవస్థ ని వ్యవస్థని ప్రేరేపిస్తుంది.ఇది కార్టిసాల్ స్థాయిలని తగ్గిస్తుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు పనిచేస్తుంది.
నిద్రలేమి పని ఎక్కువ అవ్వటం ఇంట్లో సమస్యలు మొదలైన కారణాలవల్ల ఒత్తిడి ఫీల్ అవుతారు. అటువంటి వాటి గురించి ఆలోచించడం తగ్గించాలి ఈ ఒత్తిడి కలిగించే పరిస్థితులు ఎదుర్కొనే మార్గాలు అనుసరించాలి. అప్పుడే కార్టిసాల్ తగ్గుతాయి. తోటి వారితో ఆరోగ్యకరమైన సంబంధాలు కలిగి ఉండాలి.
ఇష్టమైన వ్యక్తులతో టైం స్పెండ్ చేయడం అలవాటు చేసుకోవాలి. కాసేపు ఫ్యామిలీతో గడిపితే ఒత్తిడి ఆలోచనలన్నీ దూరమవుతాయి. శారీరక శ్రమ, వ్యాయామం క్రమం తప్పకుండా చేయటం వలన కార్టిసాల్ స్థాయిలు తగ్గుతాయి. అందుకే ధ్యానం యోగ వంటివి చేయటం వల్ల ఒత్తిడి అదుపులోకి వస్తుంది లేకపోతే బరువు నియంత్రణలోనే ఉంటుంది.
మనసుకి హాయినిచ్చే సంగీతం వింటూ ఉండండి. మనసు ఆలోచనలను డైవర్ట్ చేసుకోవచ్చు. మైండ్ ని ప్రశాంతంగా ఉంచే మార్గాలు అన్వేషించండి మనసుకి హాయిగా ఉంటుంది. ఒత్తిడి మీరు జయించలేని తీవ్ర స్థాయిలో ఉంటే మానసిక వైద్య నిపుణులని సంప్రదించటంలో ఏమాత్రం వెనకడుగు వేయకండి.