- Home
- Life
- Health
- రోజంతా ఇయర్ ఫోన్స్ ను వాడితే మీరు చెవిటి వాళ్లు కావడమే కాదు.. ఈ సమస్యలు కూడా వస్తయ్ జాగ్రత్త..
రోజంతా ఇయర్ ఫోన్స్ ను వాడితే మీరు చెవిటి వాళ్లు కావడమే కాదు.. ఈ సమస్యలు కూడా వస్తయ్ జాగ్రత్త..
పాటలు వినాలన్నా, పోన్ మాట్లాడాలన్నా, సినిమా చూడాలన్నా.. ఇలా ఫోన్ లో ఏం చూసినా పక్కాగా ఇయర్ ఫోన్స్ ను ఉపయోగించేవారు చాలా మందే ఉన్నారు. కానీ రోజంతా ఇయర్ ఫోన్స్ ను వాడితే మాత్రం ఎన్నో సమస్యలొస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

డిజిటల్ మీడియా వాడకం, ఓటీటీ సిరీస్ ల రాకతో హెడ్ ఫోన్ల, ఇయర్ ఫోన్ల వాడకం పెరిగింది. ఇంటి నుంచే ఆఫీస్ మీటింగ్స్, స్కూల్ క్లాసులు, ఆన్లైన్ కోచింగ్ లు కూడా మొదలయ్యాయి. ఈ కారణంగా చాలా మంది ఇయర్ ఫోన్స్ లేదా హెడ్ ఫోన్స్ ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. స్టడీ లేదా మీటింగ్ అయిపోయినా కూడా హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్స్ ఆన్ లోనే ఉంటాయి. దీని వాడకం చెడ్డదని చెప్పడానికేం లేదు. కానీ వీటిని రోజంతా వాడితే చెవులపై చెడు ప్రభావం పడుతుంది. హెడ్ ఫోన్లు లేదా ఇయర్ ఫోన్ల నుంచి వచ్చే శబ్దం మీ చెవులకు భారీ నష్టాన్నే కలిగిస్తుంది.
దీని గురించి పరిశోధన ఏం చెబుతుంది?
2002 లో పబ్మెడ్ సెంట్రల్ లో ప్రచురించబడిన ఒక పరిశోధన 136 మందిని పరిశీలించింది. వీరిలో దీర్ఘకాలిక చెవి ఇన్ఫెక్షన్ 4 కేసులు, వ్యాక్స్ బారిన పడిన 4 కేసులు ఉన్నాయి. 25 శాతం మందికి వినికిడి లోపం ఉన్నట్టు గుర్తించారు. వీరు హెడ్ ఫోన్స్ ను పెట్టి ఏడు గంటల పాటు నిరంతరాయంగా కాల్స్ మాట్లాడారు. గంటలకు గంటలు ఇయర్ ఫోన్స్ ను వాడటం వల్ల ఎలాంటి సమస్యలొస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం..
చెవుల్లో మురికి పేరుకుపోవడం
ఆఫీసు మీటింగ్స్ అయ్యేటప్పుడు, చదువుకునేటప్పుడు, మాట్లాడేటప్పుడు ఇయర్ ఫోన్స్ ను వాడే వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కువ సేపు హెడ్ ఫోన్ లేదా ఇయర్ ఫోన్స్ వాడటం వల్ల చెవిలో మురికి పేరుకుపోతుంది. ఇది చెవి ఇన్ఫెక్షన్లు, వినికిడి సమస్యలు లేదా టెటనస్ సమస్యలను కలిగిస్తుంది.
చెవిటితనం
హెడ్ ఫోన్స్ లేదా ఇయర్ ఫోన్లను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మీరు చెవిటివాళ్లు అయ్యే అవకాశం ఉంది. దీనివల్ల 2050 నాటికి 70 కోట్ల మందికి పైగా చెవులు దెబ్బతింటాయని డబ్ల్యూహెచ్ ఓ హెచ్చరించింది. అధిక ప్రకంపనల కారణంగా వినికిడి కణాలు వాటి సున్నితత్వాన్ని కోల్పోతాయి. ఇది చెవిటితనానికి దారితీస్తుంది.
ఇయర్ ఫోన్స్ కంటే హెడ్ ఫోన్స్ బెటర్
ఇయర్ ఫోన్స్ చెవి లోపల పెట్టుకోవాలి. ఇయర్ ఫోన్స్ చెవిలో చాలా లోపలికి వెళతాయి. కానీ హెడ్ ఫోన్స్ అలా కాదు. ఇవి చెవి పైనే ఉంటారు. అందుకే హెడ్ ఫోన్స్ ఇయర్ ఫోన్స్ కంటే కొంచెం తక్కువ హానికరం. ఏదేమైనా రెండింటిలో దేన్ని ఎక్కువగా ఉపయోగించినా.. చెవి మాత్రం దెబ్బతింటుంది.
చెవిటితనం, చెవిలో ఏదైనా సమస్య రాకుండా ఉండాలంటే ముందుగా ఎక్కువ వాల్యూమ్ తో పాటలు వినడం మానుకోండి. ఒకవేళ వాటిని ఉపయోగించాల్సి వస్తే సౌండ్ ను తగ్గించండి. మీరు కొనే హెడ్ ఫోన్లు, ఇయర్ ఫోన్స్ అన్నీ మంచి క్వాలిటీతో ఉండాలి. దీనితో మీకు వినికిడి తక్కువగా ఉందని అనిపిస్తే వెంటనే మంచి చెవి డాక్టర్ దగ్గరకు వెళ్లండి.