MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • మీ పీరియడ్ బ్లడ్ చెడువాసన వస్తోందా? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?

మీ పీరియడ్ బ్లడ్ చెడువాసన వస్తోందా? ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?

కొంతమంది పీరియడ్ బ్లడ్ దుర్వాసన వస్తుంటుంది. ఇలా కావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అందుకే ఇలాంటి సమస్య ఉన్నప్పుడు హాస్పటల్ కు వెళ్లాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 18 2023, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
Image: Getty

Image: Getty

పీరియడ్స్ ఒక సహజ ప్రక్రియ. కానీ కొంతమందికి నెలసరి వల్ల భరించలేని కడుపు నొప్పి, తిమ్మిరి, మూడ్ స్వింగ్స్, చర్మ సమస్యలతో పాటుగా రక్తం చెడు వాసన వంటి సమస్యలు వస్తాయి. ఈ చెడు వాసన వల్ల చాలా మంది నలుగురిలోకి వెళ్లడానికి ఇష్టపడరు. నిజానికి పీరియడ్ వాసన హానికరమేమీ కాదు. కానీ ఇలా ఎందుకు అవుతుందో తెలుసుకోవడం ముఖ్యం. ఆరోగ్యకరమైన రుతుక్రమంలో రక్తం తేలికపాటి వాసన ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే పీరియడ్స్ సమయంలో యోనిలో రక్తం ఎక్కువ సేపు ఉంటుంది. ఇది బ్యాక్టీరియాతో కలవొచ్చు. ఇది వాసన వచ్చేలా చేస్తుంది. అసలు పీరియడ్ బ్లడ్ ఏ రకమైన వాసన వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
28
Image: Getty

Image: Getty

కుళ్లిన వాసన

కొంతమంది మహిళల పీరియడ్ బ్లడ్ కుళ్లిన వాసన వస్తుంది. దీనికి కారణం బ్యాక్టీరియా. ఈ వాసన రాకుండా ఉండేందుకు ప్యాడ్ లేదా టాంపోన్ ను ఎక్కువగా మార్చాల్సి ఉంటుంది. ప్యాడ్ పై బ్లడ్ ఎక్కువగా ఉంటే దుర్వాసన వచ్చే అవకాశం ఉంది. 

38
Image: Getty

Image: Getty

చేపల వాసన

ఈ రకమైన బాక్టీరియల్ వాగినోసిస్ వంటి కొన్ని ఇన్ఫెక్షన్ మీకు ఉందని సూచిస్తుంది. అలాగే ఇది మీకు చికాకు కలిగిస్తుంది. ముఖ్యంగా మూత్రవిసర్జన సమయంలో చికాకు, దురద వంటి సమస్యలు వస్తాయి. 
 

48

లోహ వాసన

మీ పీరియడ్స్ బ్లడ్ రాగి నాణెం లాగా వాసన వచ్చినప్పుడు.. అది రక్తంలో ఇనుము పరిమాణం వల్ల వస్తుంది. దీనికి మీరు భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. 
 

58

శరీర దుర్వాసన

పీరియడ్స్ రక్తం నుంచి శరీరం వాసన ఎందుకు వస్తుందంటే.. మీ జననేంద్రియ ప్రాంతంలోని అపోక్రైన్ చెమట గ్రంథుల వల్ల. అపోక్రైన్ చెమట అప్పుడు చర్మంపై బ్యాక్టీరియాతో కలిసి వాసనను సృష్టిస్తుంది. రుతుస్రావం సమయంలో గ్రంథులు ఈ రకమైన చెమటను విడుదల చేస్తాయి.
 

68
<p>periods</p>

<p>periods</p>

ఈ కారణాలు కూడా రక్తం వాసనకు కారణం కావచ్చు

 పేలవమైన పారిశుధ్యం

అపరిశుభ్రత వల్లే నెలసరి సమయంలో వాసన వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి  పీరియడ్స్ సమయంలో ఆ ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచుకోండి. టాంపోన్లు, శానిటరీ ప్యాడ్లను ఎప్పటికప్పుడు మార్చాల్సి ఉంటుంది. అంతేకాకుండా వాసనలను నివారించడానికి రోజూ తప్పకుండా స్నానం చేయాలి. అలాగే వైప్స్, స్ప్రేలు వంటి డియోడరైజింగ్ ఉత్పత్తులను ఉపయోగించడం మానుకోండి. ఎందుకంటే ఇది సోకిన బ్యాక్టీరియాకు కారణమవుతుంది. అలాగే ఈ సమయంలో కాటన్ లోదుస్తులను వేసుకోవడం మంచిది. 

78

యోని పిహెచ్ అసమతుల్యత

మీ నెలసరి రక్తం తీపి వాసన వస్తుంటే.. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది పూర్తిగా సాధారణం. మీ యోని పీహెచ్ స్థాయి అసమతుల్యంగా మారినప్పుడు ఇలా అవుతుంది. యోని  పీహెచ్ సమతుల్యత సాధారణంగా 3.8-4.5.

88

అలెర్జీలు, అంటువ్యాధులు

దుర్వాసన యోని సంక్రమణ, అలెర్జీలను సూచిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే యోని నుంచి వచ్చే వాసన పట్ల అప్రమత్తంగా ఉండాలి. అవసరమైతే నిపుణులను సంప్రదించండి. దుర్వాసన, యోని ఉత్సర్గ లేదా రుతుస్రావం మధ్య మచ్చలు వంటి లక్షణాలను లైట్ తీసుకోకండి. అలాగే మీకు మీరే మందులు తీసుకోవడం మానుకోండి. డాక్టర్ సూచించిన మందులు మాత్రమే వాడండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Mangoes: అతిగా మామిడి పండ్లు తింటే లావవుతారా?
Recommended image2
Mangoes: మామిడి పండ్లు తింటే ఒంట్లో వేడి చేస్తుందా? ఎక్కువ తింటే ఏమవుతుంది?
Recommended image3
Sugar: శరీరంలో చక్కెర మోతాదు పెరిగితే పేగుల్లో జరిగేది ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved