MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Life
  • Health
  • పైనాపిల్ ను తింటే కడుపు నొప్పి వస్తుందా?

పైనాపిల్ ను తింటే కడుపు నొప్పి వస్తుందా?

పైనాపిల్ అంత తీయగా ఉండదు. అయితే కొందరికి ఈ పైనాపిల్ ను తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుంది. ఇలా ఎందుకు అవుతుందో తెలుసా?  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 26 2023, 04:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
pineapple

pineapple

పైనాపిల్ పోషకాలకు మంచి వనరు. ఇది మిమ్మల్ని శక్తివంతంగా ఉంచడానికి, మీ రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. కానీ ఇది కూడా కొన్ని సమస్యలను కలిగిస్తుంది. అలా అని పైనాపిల్ ను మొత్తమే తినకూడదని కాదు. ఈ పండును లిమిట్ లో తింటేనే మంచిది. మనల్ని హైడ్రేట్ గా ఉండటానికి ఈ పండు ఎంతో సహాయపడుతుంది. అయితే ఈ పండును తింటే కొంతమందికి కడుపు నొప్పి వస్తుంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

పైనాపిల్, కడుపు నొప్పి

పైనాపిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది ప్రోటీన్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఆ ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరచడానికి, అజీర్థి లక్షణాలను తగ్గించడానికి సహాయపడుతుంది. కానీ కొన్నిసార్లు పైనాపిల్ మీ కడుపునకు హాని చేస్తుంది. కొంతమందికి పైనాపిల్ తిన్న తర్వాత కడుపు నొప్పి వస్తుంది. ఇలా ఎందుకు అవుతుందంటే.. 
 

37
pineapple

pineapple

బ్రోమెలైన్ సున్నితత్వం లేదా అలెర్జీ

కొంతమందికి బ్రోమెలైన్ కు సున్నితత్వం లేదా అలెర్జీ ఉంటుంది. ఇది కడుపు నొప్పి, వికారం లేదా అలెర్జీ కి కారణమవుతుంది. 

ఆమ్ల స్వభావం

ఈ పండులో సిట్రిక్, మాలిక్ ఆమ్లాలు ఉంటాయి. ఇవి మంచి రుచిని ఇస్తాయి. పైనాపిల్ లోని ఆమ్ల స్వభావం సున్నితమైన కడుపు ఉన్నవారికి లేదా యాసిడ్ రిఫ్లక్స్ లేదా గుండెల్లో మంటకు గురయ్యేవారిలో అసౌకర్యాన్ని కలిగిస్తుందని నిపుణులు అంటున్నారు.

47
pineapple

pineapple

ఫైబర్ కంటెంట్

పైనాపిల్ డైటరీ ఫైబర్ కు మంచి మూలం. ఫైబర్ జీర్ణక్రియకు ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే ఈ అధికక ఫైబర్ ఆహారానికి అలవాటు పడకపోతే కడుపు నొప్పి, ఉబ్బరం లేదా వాయువు సమస్యలు వస్తాయి. 

57
pineapple

pineapple

పండని పైనాపిల్

పండని పైనాపిల్ తినడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఎందుకంటే దీనిలో ఎక్కువ  మొత్తంలో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది మరింత ఆమ్లంగా ఉంటుంది. ఇది కడుపు అసౌకర్యం లేదా చికాకును కలిగిస్తుంది. అందుకే ఎప్పుడైనా పండిన పైనాపిల్ నే తినాలి. 

67

పైనాపిల్ తిన్న తర్వాత కడుపు నొప్పి రావొద్దంటే? 

తక్కువగా తినండి

పైనాపిల్ ను తిన్న తర్వాత కడుపు నొప్పి రావొద్దంటే ఈ పండును కొద్ది కొద్దిగానే తినాలి. కడుపు నొప్పి రాకుంటే ఈ పండును కొద్దిగా ఎక్కువగా తినొచ్చు. 

ఇతర ఆహారాలతో జత చేయండి

పైనాపిల్ ను ఇతర ఆహారాలతో తినడం వల్ల  దాని ఆమ్లతను పలుచ బడుతుంది. అలాగే మీ కడుపుపై దీని ప్రభావం తగ్గుతుంది. తృణధాన్యాలు, సన్నని ప్రోటీన్లు లేదా ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి ఎక్కువ పిహెచ్ విలువ ఉన్న ఆహారాలతో పైనాపిల్ ను కలపండి. 

77
Pineapple

Pineapple

పండిన పైనాపిల్ 

పూర్తిగా పండిన పైనాపిల్ ను తినండి. ఎందుకంటే పండని పైనాపిల్ మరింత ఆమ్లంగా ఉంటుంది. ఈ పండు జీర్ణం కావడం చాలా కష్టం కూడా. పండిన పైనాపిల్ తియ్యగా ఉంటుంది. 

ఎంజైమ్ సప్లిమెంట్లు 

మీకు బ్రోమెలైన్ కు సున్నితత్వం లేదా అలెర్జీ ఉన్నట్టైతే పైనాపిల్ తినడానికి ముందు బ్రోమెలైన్ కలిగిన జీర్ణ ఎంజైమ్ సప్లిమెంట్ ను తీసుకోండి. ఇది పండులోని ఎంజైమ్లను విచ్ఛిన్నం చేయడానికి,  కడుపు నొప్పి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది. పైనాపిల్ ను ఎక్కువ మొత్తంలో తినడానికి బదులుగా మీ సమతుల్య ఆహారంలో చేర్చండి. ఈ విధంగా దీన్ని తింటే మీ శరీరానికి అన్ని పోషకాలు అందుతాయి. కడుపు నొప్పి కూడా ఉండదు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved