డయాబెటీస్ పేషెంట్లు బ్రేక్ ఫాస్ట్ ను స్కిప్ చేశారో..!
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. డయాబెటీస్ పేషెంట్లు ఉపవాసం ఉండకపోవడమే మంచిది. ఎందుకంటే ఇది వారి ఆరోగ్యాన్ని రిస్క్ లో పడేస్తుంది. అలాగే వీరు మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను అసలే స్కిప్ చేయకూడదు. ఎందుకంటే?
diabetes diet
ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోందని నివేదికలు చెబుతున్నాయి. ఈ డయాబెటీస్ ను పూర్తిగా తగ్గించుకోలేం. దీన్ని కేవలం నియంత్రణలో ఉంచాలంతే. అయితే డయాబెటీస్ ను నియంత్రణలో ఉండానికి ఫుడ్ ఎంతో సహాయపడుతుంది. కానీ ఏవి పడితే అవి తింటే మాత్రం రక్తంలో చక్కెర స్థాయిలు అమాంతం పెరుగుతాయి. రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటే అవయవ నష్టం నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మధుమేహులు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకోవాలి.
diabetes diet
డయాబెటీస్ పేషెంట్లకు బ్రేక్ ఫాస్ట్ టైమ్ చాలా కీలకమంటున్నారు ననిపుణులు. ఎందుకంటే ఇది వారిని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడంతో పాటుగా వారి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా నియంత్రణలో ఉంచుతుంది. అందుకే మధుమేహులు బ్రేక్ ఫాస్ట్ ను అసలే స్కిప్ చేయకూడదు.
diabetes diet
డయాబెటిస్ ఉన్న వారి శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించుకోలేదు. లేదా ఇన్సులిన్ ను సరిగ్గా ఉత్పత్తి చేయదు. అయితే రెగ్యులర్ వ్యాయామం, ఆరోగ్యకరమైన ఆహారం, ఒత్తిడిని తగ్గించడం, కంటినిండా నిద్ర వంటివి డయాబెటిస్ ను నియంత్రించడానికి బాగా సహాయపడతాయి.
diabetes diet
బిజీలైఫ్ స్టైల్ వల్ల చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ ను చేయడం మర్చిపోతుంటారు. లేదా టైం లేదని స్కిప్ చేస్తుంటారు. కానీ డయాబెటిస్ పేషెంట్లు ఉదయం ఏమీ తినకపోతే రోజంతా రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ నేచురల్ గా ఎక్కువగా ఉండే సమయం ఉదయం.
diabetes diet
అయితే మీరు అకస్మాత్తుగా నిద్రలేచిన వెంటనే మీ శరీరం కార్టిసాల్ వంటి హార్మోన్లను విడుదల చేస్తుంది. కాబట్టి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు సహజంగా పెరుగుతాయి. ఈ సమయంలో అల్పాహారం తినకపోవడం వల్ల అప్పటికే పెరిగిన గ్లూకోజ్ స్థాయిలు మరింత పెరుగుతాయి. ఇది రక్తంలో చక్కెర పెరుగుదలకు దారితీస్తుంది. అలాగే రోజంతా డయాబెటిస్ ను నియంత్రించడం కష్టంగా మారుతుంది.
diabetes diet
బ్రేక్ ఫాస్ట్ మానేస్తే శరీరంలో షుగర్ లెవల్స్ పెరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎక్కువసేపు తినకపోవడం వల్ల మైకము, బద్ధకం లేదా దృష్టి పెట్టడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఉదయం నిద్రలేచిన ఒకటి లేదా రెండు గంటల తర్వాత బ్రేక్ ఫాస్ట్ ను తప్పకుండా తినాలి.
diabetes diet
డయాబెటిస్ ఉన్నవారు బ్రేక్ ఫాస్ట్ లో చేర్చాల్సిన కొన్ని ఆహారాలు...
తియ్యని పెరుగు
గుడ్లలో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఉడికించిన గుడ్డులోని తెల్లసొన లేదా గుడ్డులోని తెల్లసొనను ఆమ్లెట్స్ గా తినొచ్చు.
ఓట్స్
తక్కువ చక్కెర కలిగిన ఫ్రూట్ స్మూతీలు
యాపిల్స్, పియర్స్, బొప్పాయి వంటి పండ్లను కూడా చేర్చుకోవచ్చు.