జామూన్, అంటే మన నేరేడు పండు. తీపి, పులుపు కలగలిపిన రుచి ఉండే ఈ పండు వేసవిలో దొరుకుతుంది. ఇందులో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
Image credits: our own
Telugu
యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
ఊదా లేదా నలుపు రంగులో ఉండే ఈ పండులో యాంటీఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
గింజల్లోనూ బోలెడు పోషకాలున్నాయి
నేరేడు పండు మాత్రమే కాదు, దాని గింజలు కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. ఎందుకంటే, ఈ గింజల్లో పోషకాలు మెండుగా ఉంటాయి.
Image credits: our own
Telugu
చర్మ సంరక్షణకు కూడా చాలా మంచిది
షుగర్ పేషెంట్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించుకోవడానికి నేరేడు గింజల పొడిని స్మూతీలలో కలుపుకుని తాగొచ్చు. ఇది చర్మ సంరక్షణకు కూడా బాగా పనిచేస్తుంది.
Image credits: Getty
Telugu
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేస్తుంది
నేరేడు గింజలు రక్తంలో చక్కెర స్థాయిలను సమర్థంగా నియంత్రిస్తాయని పలు అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
Image credits: our own
Telugu
జీర్ణవ్యవస్థను బలంగా ఉంచుతుంది
నేరేడు గింజల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను బలంగా ఉంచి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది.
Image credits: our own
Telugu
బీపీ సమస్య ఉన్నవాళ్లు కూడా వాడొచ్చు
రక్తపోటును అదుపులో ఉంచడానికి గింజలే కాదు, నేరేడు పండు కూడా బాగా పనిచేస్తుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్లు, ఫ్లేవనాయిడ్లు మేలు చేస్తాయి.