- Home
- Life
- Health
- ఎప్పుడూ అనారోగ్యం, అలసట, మూడ్ స్వింగ్స్ సమస్యలతో బాధపడుతున్నారా? మీకు ఈ సమస్య ఉన్నట్టే..
ఎప్పుడూ అనారోగ్యం, అలసట, మూడ్ స్వింగ్స్ సమస్యలతో బాధపడుతున్నారా? మీకు ఈ సమస్య ఉన్నట్టే..
విటమిన్ డి లోపం వల్ల కండరాలు, ఎముకలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. విటమిన్ డి ఎముక బలం, ఇతర శారీరక విధులకు చాలా అవసరం. ఇది లోపిస్తే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి.

మన శరీరం చురుగ్గా ఉండటానికి ఎన్నో పోషకాలు అవసరమవుతాయి. ఇలాంటి పోషకాల్లో విటమిన్ డి ఒకటి. ఆరోగ్యకరమైన ఆహారం, సూర్యరశ్మి ద్వారా మనకు విటమిన్ డి అందుతుంది. ఇది మన శరీరంలో కాల్షియం తయారీకి సహాయపడుతుంది. దీనితో పాటుగా రోగనిరోధక శక్తి కూడా బలంగా ఉంటుంది. ఆరోగ్యం కూడా బాగుంటుంది. కండరాల పెరుగుదలతో చర్మానికి ఈ విటమిన్ వల్ల ప్రయోజనం లభిస్తుంది. విటమిన్ డి తీసుకోవడం వల్ల హైపర్ టెన్షన్ అంటే హైబీపీ రిస్క్ కూడా తగ్గుతుందని పరిశోధనలో వెల్లడైంది. చిన్నవారి నుంచి పెద్దల వరకు విటమిన్ డి 400 ఐయూ నుంచి 800 ఐయూ అవసరమవుతుంది.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ యునైటెడ్ స్టేట్స్ లో లో ప్రచురించబడిన ఒక అధ్యయనం.. మెజారిటీ ప్రజలు తక్కువ మొత్తంలో విటమిన్ డి ని తీసుకుంటున్నారని కనుగొన్నారు. నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్ సర్వే.. రోజువారీ ఆహారాలలో 204 ఐయు లోటు ఉందని కనుగొంది. వీరిలో 97 శాతం మంది మహిళలు, 92 శాతం మంది పురుషులు, 94 శాతం మంది ఏడాది వయసున్న పిల్లలు ఆహారం నుంచి 400 ఐయూ విటమిన్ డి ని తీసుకుంటున్నారు.
vitamin d deficiency
విటమిన్ డి లోపం వల్ల శరీరం మరింత అలసటకు గురవుతుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఎముకల్లో నొప్పి ఎక్కువగా ఉంటుంది. పిల్లల్లో విటమిన్ డి లోపం వల్ల కండరాలు బలహీనపడతాయి. ఇది చిన్న గాయాన్ని కూడా పెద్ద సమస్యగా మారుస్తుంది. అంతేకాదు పిల్లలు కూడా తరచుగా అనారోగ్యానికి గురవుతారు. అలాగే వెన్నునొప్పి కూడా వస్తుంది.
విటమిన్ డి లోపం లక్షణాలు
విటమిన్ డి లోపం ఎన్నో అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది. ఇది అలసట, చర్మం ముడతలు, కండరాల బలహీనం వంటి సమస్యలు వస్తాయి. అంతేకాదు ఎప్పుడూ అలసిపోయినట్టుగా ఉంటారు. విటమిన్ డి లోపం క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
విటమిన్ డి లోపం రోగనిరోధక శక్తిని బలహీనంగా చేస్తుంది. అలాగే ఇది అధిక రక్తపోటు సమస్యను పెంచుతుంది. ఇది ఒత్తిడి, నిరాశను కూడా కలిగిస్తుంది. ఇక పిల్లల విషయానికొస్తే చిన్న పిల్లల్లో ఈ విటమిన్ లోపం రికెట్స్ సమస్య వస్తుంది. అంతేకాదు ఇది మీ జుట్టు రాలేలా చేస్తుంది. దీనిని అలోపేసియారియాటా వ్యాధి అని కూడా అంటారు.
vitamin d deficiency
విటమిన్ డి లోపానికి కారణం ఏంటి?
సూర్యరశ్మి లో రోజూ కాసేపు ఉంటే విటమిన్ డి అందుతుంది. ఎప్పుడూ నీడలోనే ఉంటే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మాంసాహారంలో విటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. మీరు మాంసాహారం తినకపోతే విటమిన్ డి లోపం ఏర్పడుతుంది. మీరు ఉంటున్నప్లేస్ లో సూర్యరశ్మి తక్కువగా ఉంటే కూడా ఈ సమస్య తలెత్తుతుంది. ఎండలో తక్కువగా నివసించేవారు లేదా శాకాహారులు ఈ విటమిన్ లోపంతో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది.
ఎవరికి ఎంత విటమిన్ డి అవసరం
పుట్టినప్పటి నుంచి 12 నెలల వరకు 400 IU (అంతర్జాతీయ యూనిట్లలో అంటే ఐయు), కౌమారదశలో ఉన్నవారు 13 నుంచి 14 సంవత్సరాల వరకు 600 IU,పెద్దలు.. 18 నుంచి 70 సంవత్సరాలకంటే ఎక్కువ 600 IU అవసరం.
విటమిన్ డి లోపాన్ని పోగొట్టే చిట్కాలు
విటమిన్ డి లోపాన్ని పోగొట్టడానికి మీ జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. వీటితో పాటుగా గుడ్లు, ఎండలో కూర్చోవడం, ఆవు పాలు తాగడం, చేపలు, పెరుగు, నారింజ, ఓట్స్, పుట్టగొడుగులు, మాంసాన్ని తీసుకుంటే విటమిన్ డి లోపం పోతుంది.
ప్రతిరోజూ 10 నుంచి 15 నిమిషాలు ఎండలో నిలబడండి. దీని కోసం మీరు ప్రతిరోజూ ఉదయం సైక్లింగ్, రన్నింగ్ లేదా ఫుట్ బాల్ ను ఆడండి. దీంతో శరీరానికి వ్యాయామంతో పాటు విటమిన్ డి కూడా లభిస్తుంది.