Health Tips: మీరు బాలింతలా.. అయితే మీ గురించే ఈ డైట్ ప్లాన్?
Health Tips: బాలింతలకు పాలు పడటం అనేది పెద్ద సమస్య అయిపోయింది. కానీ బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిపాలు చాలా అవసరం. అందుకే బాలింతరాలు ఎలాంటి డైట్ ప్లాంట్ తీసుకుంటే పాలు పడతాయో చూద్దాం.

నవజాత శిశువు ఆరోగ్యంగా ఉండాలంటే అది ఆ తల్లి మీద ఆధారపడి ఉంటుంది. బాలింతలు చక్కని పౌష్టికాహారం తీసుకుంటే మా ప్రభావం బిడ్డ మీద కూడా ఉంటుంది. కాబట్టి బాలింతలు ఎలాంటి ఆహారం తీసుకోవాలి. ఏమి తింటే పాలు ఎక్కువగా ఉత్పత్తి అవుతాయో ఇప్పుడు చూద్దాం.
తల్లిపాలు బిడ్డకి అమృతంతో సమానము బిడ్డకు తొలి పోషణ తొలి రక్షణ ఇచ్చేది తల్లిపాలే. పసి వయసులో తాగే తల్లి పాలు జీవితకాలం ఆ బిడ్డకి జీవితకాలం ఇమ్యూనిటీ పవర్ ని అందిస్తుంది. అలాగే బిడ్డకి పాలు ఇవ్వడం అనేది తల్లి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
బాలింతలు టీలు, కాఫీలు లాంటివి తాగకూడదు. అలాగే మసాలా దినుసులు ఎక్కువ తీసుకోకూడదు ఎందుకంటే బిడ్డ జర్నీ వ్యవస్థ అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతూ ఉంటుంది కాబట్టి మసాలా దినుసుల ప్రభావాన్ని తట్టుకొని జీర్ణించుకునే శక్తి వాళ్లకి ఉండదు.
అలాగే ఉల్లిపాయలు, క్యాలీఫ్లవర్, క్యాబేజీ, దోసకాయ, బంగాళదుంపలు, బీన్స్ లాంటి కాయగూరలకి పాలిచ్చే తల్లులు దూరంగా ఉండాలి. వీటి వలన బిడ్డకి కడుపు నొప్పి వచ్చే ప్రమాదం ఉంటుంది. వేరుశనగ, మొక్కజొన్న, బీన్స్ ఇలాంటి కాయ ధాన్యాలను కూడా చాలా తక్కువగా తీసుకోవాలి.
మీ ఆహారంలో ఐరన్, జింక్ వంటి పోషకాలు ఉండేలాగా చూసుకోవాలి. చికెన్, మటన్ చేపలు మీ ఆహారంలో కచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. శాఖాహారంలో అయితే డ్రై ఫ్రూట్స్ హోల్ వీట్ బ్రెడ్ పాస్త వోట్మీల్ వంటివి ఆహారంగా తీసుకోండి. పాలు తయారీకి కాల్షియం అవసరం.
కాబట్టి పాల ఉత్పత్తులు ముదురు ఆకుపచ్చ రంగు కూరగాయలు, తృణధాన్యాలు, సోయా పాలు, సోయా పెరుగు, టోఫు వంటివి తీసుకోవాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ పాలు పడకపోతే ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించండి ఎందుకంటే తల్లిపాలు బిడ్డకి జీవితకాలం రక్ష.