Telugu

Health Tips: మీకు తరచు ఆకలి వేస్తుందా ? కారణం ఇదే..

Telugu

ప్రోటీన్, ఫైబర్

తక్కువ ప్రోటీన్, ఫైబర్ తీసుకుంటే కడుపు త్వరగా ఖాళీ అవుతుంది. ఇది ఆకలి త్వరగా రావడానికి కారణమవుతుంది. తద్వారా అధికంగా తినే అవకాశం పెరిగి బరువు పెరగవచ్చు. 

Image credits: Getty
Telugu

డీహైడ్రేషన్

తక్కువగా నీరు తాగితే డీహైడ్రేషన్ అవుతుంది. ఈ సమయంలో ఆకలి అనిపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.   

Image credits: Freepik
Telugu

నిద్రలేమి

నిద్ర తక్కువగా ఉంటే ఆకలి నియంత్రించే గ్రెలిన్, లెప్టిన్ వంటి హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల ఆకలి ఎక్కువగా అనిపించి, అధికంగా తినే అవకాశముంది. 

Image credits: Freepik
Telugu

హార్మోన్ల అసమతుల్యత

ఒత్తిడి ఉన్నప్పుడు కార్టిసాల్ వంటి హార్మోన్ల స్థాయిలో మార్పులు కలుగుతాయి. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఇది ఆకలిని పెంచుతుంది. ఫలితంగా అధికంగా తింటారు. 

Image credits: Pexels
Telugu

షుగర్ లెవల్స్

శరీరంలో బ్లడ్ షుగర్ తక్కువగా (హైపోగ్లైసీమియా) ఉన్నప్పుడు,  శక్తి కొరత కారణంగా ఆకలిగా అనిపిస్తుంది. ఇది అలసట, చిరాకు, చేతుల వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 

Image credits: Social Media
Telugu

థైరాయిడ్ సమస్యలు

హైపర్‌ థైరాయిడ్ ఉన్నవారిలో థైరాయిడ్ హార్మోన్లు అధికంగా ఉత్పత్తి అవుతాయి. దీనివల్ల మెటబాలిజం వేగంగా పనిచేసి, శరీరానికి ఎక్కువ శక్తి అవసరం పడుతుంది. ఫలితంగా ఆకలి పెరుగుతుంది. 

Image credits: Getty

Ovarian Cancer : ఈ లక్షణాలు ఉంటే.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!

Health tips: రాత్రి పడుకునేముందు పాలు తాగడం ఆరోగ్యానికి మంచిదా? కాదా?

Weight Loss: ఇలా వాకింగ్ చేశారంటే.. ఇట్టే బరువు తగ్గుతారు

Brain : పిల్లల మెదడు చురుగ్గా ఉండాలంటే.. ఈ సూపర్ ఫుడ్స్ తప్పనిసరి..