ప్రీ డయాబెటీస్ అంటే ఏంటి? దీన్ని ఎలా తగ్గించుకోవాలి?
మీ రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉండటాన్నే ప్రీడయాబెటీస్ అంటారు. అయితే కొన్ని ఆరోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను పాటిస్తే ఈ సమస్య నుంచి పూర్తిగా బయటపడతారు.

Diabetes
ప్రీడయాబెటిస్ అంటే రక్తంలో చక్కెర సాధారణం కంటే ఎక్కువగా ఉంటడం. కానీ దీన్ని టైప్ 2 డయాబెటిస్ గా నిర్ధారించేంత ఎక్కువగా ఉండదు. ప్రీడయాబెటిస్ కు ఖచ్చితమైన కారణం తెలియదు. కానీ ఇది ఇన్సులిన్ నిరోధకతతో సంబంధం కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. మీ కణాలు ఇన్సులిన్ హార్మోన్ కు స్పందించడం మానేసినప్పుడే ఈ సమస్య వస్తుంది. ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది చక్కెర మీ కణాలలోకి వెళ్లేలా చేస్తుంది. మీ శరీరం ఇన్సులిన్ ను సరిగ్గా ఉపయోగించనప్పుడు మీ రక్తప్రవాహంలో చక్కెర పేరుకుపోతుంది. ఇది ఎక్కువ రోజులు అట్లే కొనసాగితే మీకు టైప్ 2 డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. ప్రీడయాబెటీస్ ను తిప్పికొట్టడానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పరిశుభ్రమైన ఆహారం
ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎక్కువగా తినడం వల్ల కూడా ప్రీడయాబెటిస్ వస్తుంది. దీనికి ఇదొక ప్రమాద కారకం. వీటిలో పోషకాలు లేకున్నా..అదనపు కొవ్వులు, కేలరీలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. రెడ్ మీట్ ఎక్కువగా ఉన్న ఆహారం కూడా ప్రీడయాబెటీస్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యకరమైన, శుభ్రమైన ఆహారాలను తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు నార్మల్ గా ఉంటాయి. ఇది ప్రీడయాబెటిస్ ను తిప్పికొట్టగలదు. అలాగే టైప్ 2 డయాబెటిస్ ను నివారించడానికి కూడా సహాయపడుతుంది.
diabetes
ప్రతిరోజూ వ్యాయామం
శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రీ డయాబెటిస్ వస్తుందని నిపుణులు అంటున్నారు. వ్యాయామం శరీర శక్తి, మానసిక ఆరోగ్యానికి చాలా అవసరం. ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచుతుంది. దీంతో మీ రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది మీ శరీరంలోని కణాలు ఇన్సులిన ను మరింత సమర్థవంతంగా ఉపయోగించడానికి సహాయపడుతుంది.
diabetes
అధిక బరువు
రెగ్యులర్ గా వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వీటిలో ఒకటి వెయిట్ లాస్. వ్యాయామం బరువు తగ్గేందుకు బాగా సహాయపడతాయి. నిజానికి శరీర కొవ్వులో 5 నుంచి 10 శాతం తగ్గడం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు మెరుగుపడుతాయి. అలాగే ప్రీడయాబెయాటిస్ సమస్య కూడా పూర్తిగా పోతుంది.
స్మోకింగ్ మానేయండి
స్మోకింగ్ గుండె జబ్బులు, ఊపిరితిత్తుల క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని చాలా మందికి తెలుసు. కానీ ఇన్సులిన్ నిరోధకత, ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిస్ కు స్మోకింగ్ కూడా కూడా ఒక ప్రమాద కారకం. అందుకే సిగరేట్ ను తాగడం మానేయండి.
diabetes
తక్కువ పిండి పదార్థాలు
ప్రీడయాబెటీస్ ఉంటే మీరు ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాలి. ముఖ్యంగా మీరు కార్బోహైడ్రేట్లను జాగ్రత్తగా ఎంచుకోవడం చాలా ముఖ్యం. ప్రీడయాబయాటిస్ ను రివర్స్ చేయడంలో సహాయపడటానికి మీరు తక్కువ పిండి పదార్థాలను తినాల్సి ఉంటుంది.