Health Tips: వర్షాకాలంలో తడి అండర్ వేర్ లు వేసుకోకండి.. ఈ ప్రమాదాలు కొని తెచ్చుకోకండి!
Health Tips: వర్షాకాలం బట్టలు ఆరటం అనేది పెద్ద సమస్య, అలా అని లోదుస్తులు వేసుకోకుండా బయటికి వెళ్లలేం. అలా అని తడి లో దుస్తులు వేసుకుంటే ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి ఆ ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.
వేసవి తాపం నుంచి తప్పించే వర్షాలు అందరికీ ఇష్టమే అయితే వచ్చిన సమస్య అంతా బట్టల దగ్గరే. ఒక్కొక్కసారి వర్షాలు ఎలా పడతాయి అంటే నాలుగు ఐదు రోజుల వరకు సూర్యుడు కనిపించడు. బట్టలు సరిగ్గా ఆరవు, ముఖ్యంగా లో దుస్తులు.
అలా అని లోదుస్తులు ధరించకుండా బయటికి వెళ్ళలేం, కంగారులో అలాగే వేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు చాలామంది. అయితే ఇలా వేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. తడి అండర్వేర్ వేసుకోవడం వల్ల గజ్జల..
ప్రాంతంలోని సున్నితమైన చర్మానికి వ్యతిరేకంగా తడి అండర్ వేర్ వల్ల ఘర్షణ చికాకు పెరుగుతుంది. దీని వలన చర్మం ఎర్రబడటం, పుండ్లు రావడం, బొబ్బర్లు రావడం జరుగుతుంది. అలాగే యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ వస్తుంది, బ్యాక్టీరియా అభివృద్ధి చెంది ఇన్ఫెక్షన్లకు కారణమవుతాయి.
దీనివల్ల యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ బాధిస్తుంది. పురుషులకు వర్షాకాలంలో తడి అండర్ వేర్ లు పదే పదే వేసుకోవడం వల్ల స్క్రోటల్ ఉష్ణోగ్రత పెరగటానికి దారితీస్తుంది. ఇది స్పెర్మ్ ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుంది. సంతానోత్పత్తి పైన ప్రభావం చూపెట్టడం మూలంగా పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడటానికి జననేంద్రియ ప్రాంతం చుట్టూ చల్లని పొడి వాతావరణాన్ని కల్పించడం చాలా అవసరం.
అలాగే పదే పదే శరీరాన్ని తేమ చల్లని పరిస్థితులకి గురి చేయటం వలన రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందన బలహీనపడుతుంది. వర్షాకాలంలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్లపై పోరాడే శక్తిని కోల్పోతుంది. దీనివల్ల జలుబు, దగ్గు, జ్వరం లాంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి.
దాంతో పాటు తడి అండర్ వేర్ లు ధరించడం వల్ల బ్యాక్టీరియా వృద్ధికి అవకాశం కల్పించినట్లు అవుతుంది. వెచ్చని తేమతో కూడిన ప్రాంతాల్లో సూక్ష్మగ్రిములు వృద్ధి చెందుతాయి, ఫంగల్ ఇన్ఫెక్షన్లు ఈస్ట్ ఇన్ఫెక్షన్లు, దద్దుర్లు వంటి చర్మవ్యాధులకు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది కాబట్టి తడి అండర్వేర్లను ధరించడం మానుకోండి.