ఒక్క నెల రోజుల పాటు టీ, కాఫీలను తాగడం మానేస్తే ఏమౌతుందో తెలుసా?
టీ, కాఫీలకు అడిక్ట్ అయిన వారు మన దేశంలో చాలా మందే ఉన్నారు. నిజానికి టీ, కాఫీ మనకు తక్షణ శక్తిని అందిస్తాయి. ఉత్తేజంగా మారుస్తాయి. కానీ వీటిని మరీ ఎక్కువగా, రోజూ తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు.

<p>black coffee</p>
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమందికి టీ, కాఫీలంటే ప్రాణం. ఇవి లేకుండా అస్సలు ఉండలేరు. పరిస్థితి ఎలాంటిదైనా కప్పు టీ నో కాఫీనో తాగేస్తుంటారు. టీ, కాఫీలు శరీరాన్ని ఉత్తేజంగా మారుస్తాయి. నిద్రమబ్బును వదిలిస్తాయి. శరీరాన్ని కొద్ది సేపట్లోనే శక్తివంతంగా మారుస్తాయి. మనస్సును రీఫ్రెష్ చేస్తాయి. కానీ టీ కానీ, కాఫీలు కానీ మన శరీరానికి అస్సలు మంచివి కావు. ఎందుకంటే వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ మన ఆరోగ్యాన్ని పాడుచేస్తుంది. ఎన్నో రోగాల బారిన పడేస్తుంది. కానీ వీటిని రెగ్యులర్ గా తాగే అలవాటున్న వారు ఇవి తాగకుండా ఉండలేరు. కారణం వీళ్లు వీటికి బాగా అడిక్ట్ అవ్వడమే. అసలు ఈ టీ, కాఫీలకు ఒక నెల రోజుల పాటు దూరంగా ఉంటే ఏమౌతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
రక్తపోటు నియంత్రణ
టీ, కాఫీలను తాగితే అలసట మటుమాయం అవుతుంది. తక్షణమే శరీరానికి శక్తి అందుతుంది. కానీ ఇది మీ రక్తపోటును అమాంతం పెంచుతుందన్న ముచ్చట మీకు తెలుసా? రక్తపోటు ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. వీటిలో ఉండే కెఫిన్ కంటెంట్ యే ఇందుకు కారణం. ఒక నెల రోజుల పాటు టీ, కాఫీలను తాగడం మానేస్తే మీ అధిక రక్తపోటు తిరిగి నార్మల్ పొజీషన్ లోకి వస్తుంది. అలాగే అధిక రక్తపోటు సమస్య మొత్తమే పోతుంది.
coffee
మెరుగైన నిద్ర
ప్రస్తుతం నిద్రలేమితో బాధపడేవారు ఎక్కువయ్యారు. నిద్రలేమి చిన్న సమస్యేమీ కాదు. ఎందుకంటే ఇది బరువు పెరగడానికి కారణమవడమే కాకుండా ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అయితే టీ, కాఫీలు కూడా నిద్రలేకుండా చేస్తాయి. ఎలా అంటే ఈ పానీయాల్లో ఉండే కెఫిన్ కంటెంట్ నిద్రకు ఆటంకం కలిగిస్తుంది. వీటిని మానేసిన వారం రోజుల్లోనే మీరు గాఢంగా నిద్రలోకి జారడం గమనిస్తారు. ఒక నెలరోజుల్లో మీలో చాలా తేడాను గమనిస్తారు.
తెల్లని దంతాలు
వేడి పదార్థాలు, పానీయాలు మన దంతాలకు ఏ మాత్రం మంచివి కావు. ఎందుకంటే ఇవి దంతాల రంగును మారుస్తాయి. పసుపు పచ్చగా చేస్తాయి. ఒక నెలరోజుల పాటు టీ, కాఫీలకు దూరంగా ఉంటే దంతాల నష్టం తగ్గుతుంది. అలాగే మీ దంతాలు తలతల తెల్లగా మెరుస్తాయి. కెఫిన్ దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. వీటిని మానేస్తే మీ దంతాలు ఆరోగ్యంగా ఉంటాయి.