MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • ఈ కప్పుల్లో టీ తాగడం ఇంత డేంజరా?

ఈ కప్పుల్లో టీ తాగడం ఇంత డేంజరా?

సాధారణంగా రోడ్డు పక్కన టీ స్టాల్స్ లో పేపర్ కప్పుల్లో టీని టీని ఇస్తారు. కానీ ఈ కప్పులో టీ తాగడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అసలు పేపర్ కప్పుల్లో టీ తాగితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 05 2024, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

టీ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. టీ మనల్ని రోజంతా ఎనర్జిటిక్ గా ఉంచడానికి సహాయపడుతుంది. కొంతమంది టీని గ్లాస్, కప్పుల్లో తాగుతుంటారు. కానీ రోడ్డు పక్కనున్న దుకాణాల్లో టీ ని ఎక్కువగా పేపర్ కప్పుల్లోనే పోస్తారు.  

25
paper cup

paper cup

ఈ పేపర్ కప్పులను ఉపయోగించిన తర్వాత కడగాల్సిన అవసరం ఉండదు. ఒకసారి టీ తాగి  చెత్తబుట్టలో పడేయొచ్చు. కొన్ని కొన్ని సార్లు మనం ఈ రకమైన కప్పులను ఇంట్లో కూడా ఉపయోగిస్తుంటారు. కానీ ఈ పేపర్ కప్పులు ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఇవి శరీరానికి ఎలాంటి హాని కలిగిస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

35

కాగితపు కప్పుల్లో పెట్రోలియం ఆధారిత రసాయనం బిస్ఫెనాల్ ఉంటుంది. ఇది శరీరానికి హానికరం. ముఖ్యంగా ఇలాంటి కప్పుల్లో టీ తాగడం వల్ల ఉదర సంబంధిత సమస్యలు వస్తాయి.
 

45

 వీటిలో ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే క్రిములు కూడా ఉంటాయి. ఈ కప్పుల్లో ఉపయోగించే పూతలలో ఈ హానికరమైన బిస్ఫెనాల్స్, పెట్రోలియం ఆధారిత రసాయనాలు ఉంటాయి. మనం టీ తాగినప్పుడు అది నేరుగా కడుపులోకి వెళ్తుంది.
 

55
paper cup tea

paper cup tea

ప్రతిరోజూ ఒక పేపర్ కప్పులో టీ తాగడం వల్ల శరీరంలో బీపీఏ పెరుగుతుంది. ఇది శరీరానికి చాలా హానికరం. శరీరంలో బీపీఏ స్థాయి పెరిగితే క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అందుకే ఇక నుంచైనా ఈ పేపర్ కప్పుల్లో టీ తాగడం మానుకోండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Hair : బట్టతల సమస్యకు చెక్.. DHT అంటే ఏమిటి? ఇది ఎలా పనిచేస్తుంది?
Recommended image2
Clove Water: రోజూ లవంగాల నీళ్లు తాగితే ఈ సమస్యలన్నీ పరార్!
Recommended image3
Eye Twitching: మీ కన్ను అదురుతోందా? అసలు కారణం ఇదే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved