దిండు కవర్లను వారానికోసారి ఉతకకపోతే ఏమౌతుందో తెలుసా?
దిండు లేకుండా నిద్రపోనివారు చాలా మందే ఉన్నారు. కానీ వీటిని మాత్రం ఏ నెలకో, ఏ రెండు మూడు నెలలకోసారో వాష్ చేస్తుంటారు. మీకు తెలుసా? వీటిని వారానికి లేదా రెండు వారాలకోసారి ఖచ్చితంగా వాష్ చేయాలి. లేదంటే..?

pillow position
మనలో చాలా మందికి దిండు లేకుండా క్షణం కూడా నిద్రపట్టదు. కొందరైతే నెత్తి కింద, కాళ్ల కింద అంటూ ఏకంగా రెండు మూడు దిండులను వాడుతుంటారు. నిజంగా దిండు లేకుండా నిద్రపోవడం చాలా చాలా కష్టం. ఈ సంగతి పక్కన పెడిగే.. దిండు కవర్లను ఏ రెండు మూడు నెలలకో లేదా అవి మాసిపోయినట్టుగా అయినప్పుడు మాత్రమే ఉతుకుతుంటారు. కానీ ఇది అస్సలు మంచి పద్దతి కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవును దిండు కవర్లను వారానికి ఒకసారి మార్చకపోయినా.. వాటిని వాష్ చేయకపోయినా ఎన్నో సమస్యలు వస్తాయని ఓ కొత్త అధ్యయనం వెళ్లడిస్తోంది.
Mattress కంపెనీ AmeriSleep కొత్త నివేదిక ప్రకారం.. ఒక వారం కంటే ఎక్కువ కాలం ఉతకని పిల్లో కవర్లు, బెడ్ షీట్లలో మూడు మిలియన్ల నుంచి ఐదు మిలియన్ల వరకు బ్యాక్టీరియా ఉంటుంది.
ఒక ఉతకని దిండులో ఒక వారంలో 3 మిలియన్ బ్యాక్టీరియా ఉంటుందని అధ్యయనం వెల్లడించింది. ఇది సగటు టాయిలెట్ సీటు కంటే 17,000 రెట్లు ఎక్కువ అని నివేదిక పేర్కొంది. బాత్ రూం డోర్ హ్యాండిల్స్ కంటే దిండులపై 25,000 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉన్నట్లు అధ్యయనం కనుగొంది.
పరిశుభ్రత కోసం pillowcases లను ఉపయోగించడం కూడా మంచిది. దిండు కవర్లను వారానికి ఒకటి కంటే ఎక్కువసార్లు వాష్ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం.. చనిపోయిన చర్మ కణాలు, చెమట, ధూళి కణాలు వంటివన్నీ పిల్లో కవర్లపై బ్యాక్టీరియా పెరగడానికి కారణమవుతాయి. ఇది తీవ్రమైన అలెర్జీ వ్యాధులు, ఇన్ఫెక్షన్లకు కూడా దారితీస్తుందని నివేదిక తెలుపుతోంది.
మునుపటి అధ్యయనాలు.. ఉతకని బెడ్‌షీట్‌లో వ్యాధులను కలిగించే బ్యాక్టీరియా ఉంటుందని కనుగొన్నాయి. బెడ్ షీట్లను కనీసం వారానికి ఒకసారి లేదా రెండు వారాలకు ఒకసారైనా ఉతకాలని నిపుణులు అంటున్నారు. బెడ్‌షీట్లను ఉతకకపోతే ఎన్నో రకాల చర్మవ్యాధులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.