Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • Health
  • Smoking: స్మోకింగ్ ఎక్కువగా ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? అసలు కారణం ఎవరంటే..

Smoking: స్మోకింగ్ ఎక్కువగా ఎవరు చేస్తారు? ఎందుకు చేస్తారు? అసలు కారణం ఎవరంటే..

స్మోకింగ్ ఎంత చెడ్డ అలవాటో అందరికీ తెలుసు. అయినా కానీ దాన్ని మానేయడానికి చాలామంది ఇష్టపడరు. అసలు ఏ వయసు వారు స్మోకింగ్ ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారు. దానికి కారకులు ఏవరు? అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

Kavitha G | Published : Feb 18 2025, 01:48 PM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Asianet Image

స్మోకింగ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ఏటా లక్షలాది మంది మరణిస్తున్నారు. ఈ అలవాటు ఆ వ్యక్తిని మాత్రమే కాకుండా సమాజంలోని ఇతరుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. స్మోకింగ్ ఎవరు ఎక్కువగా చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారనే ప్రశ్న వచ్చినప్పుడు వారు చెప్పే కారణాలు చాలా ఆశ్చర్యకరంగా ఉంటున్నాయి.

25
స్మోకింగ్ కి కారణాలు

స్మోకింగ్ కి కారణాలు

ధూమపానం వల్ల ఊపిరితిత్తులు, శ్వాసకోశాలు తీవ్రంగా దెబ్బతింటాయి. కొంతమందికి జలుబు, న్యుమోనియా లాంటివి వచ్చే అవకాశం ఉంది. దీర్ఘకాలిక అలవాటు క్యాన్సర్‌కు కూడా దారితీస్తుంది. స్మోకింగ్ ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా కూడా చాలామంది సిగరెట్ తాగుతుంటారు.

వారు సూటిగా చెప్పే సమాధానాలలో ఒకటి జీవితంలో అసంతృప్తి. కోపం, నిరాశ, వైఫల్యం లాంటి అనేక భావోద్వేగాలు ఈ అలవాటుకు దారితీస్తున్నాయి. ఏ వయసు వారు ఎక్కువగా సిగరెట్ తాగుతారో ఇక్కడ తెలుసుకుందాం.

35
అధ్యయనాల ప్రకారం

అధ్యయనాల ప్రకారం

ఇటీవలి అధ్యయనాల ప్రకారం స్మోకింగ్ యువతను ఎక్కువగా ప్రభావితం చేస్తుందని తెలుస్తోంది. స్నేహితుల ప్రోత్సాహం యువతను ధూమపానంలోకి లాగుతుందట. స్మోకింగ్ అనేది స్టైల్, ఇది చేస్తే గొప్పగా కనబడతారనే భావన బాగా వ్యాపించిందట.

45
తల్లిదండ్రులే కారణమా?

తల్లిదండ్రులే కారణమా?

తల్లిదండ్రులు ఎంత ఆరోగ్యంగా ఉంటే, పిల్లలు అంత ఆరోగ్యంగా ఉంటారు. పేరెంట్స్ కి ధూమపాన అలవాటు ఉంటే, పిల్లలు కూడా ఆ అలవాటును కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ రోజుల్లో స్మోకింగ్ సాధారణ అలవాటుగా మారుతోంది. సిరీస్‌లు, సినిమాలు, ప్రకటనలు ధూమపానాన్ని వ్యక్తిత్వానికి, స్టైల్‌కి చిహ్నంగా చూపిస్తున్నాయి. 

చాలా మంది యువత తమ ఆందోళనను దాచుకోవడానికి, ఒత్తిడిని ఎదుర్కోవడానికి స్మోకింగ్ చేయడం ప్రారంభిస్తున్నారు.

55
ఏ వయసు వారిలో ఎక్కువ ప్రమాదం?

ఏ వయసు వారిలో ఎక్కువ ప్రమాదం?

టీనేజర్లు ఎక్కువ ప్రమాదంలో ఉన్నారు. 15 నుంచి 24 సంవత్సరాల వయస్సు గలవారు ఎక్కువగా స్మోకింగ్ ప్రారంభిస్తారు. వారి వయసుకి తగ్గ గుర్తింపు కోసం వెతుకులాట ఒక కారణం. సోషల్ మీడియా, జీవనశైలి, ఒత్తిడి, భయం, థ్రిల్ లాంటి అనేక కారణాలు యువతను ధూమపానానికి బానిసలుగా చేస్తున్నాయి.

Kavitha G
About the Author
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. Read More...
జీవనశైలి
 
Recommended Stories
Top Stories