MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Health
  • ఎండాకాలం వచ్చేసిందోచ్.. తాటి ముంజలతో ఈజీగా ఇలా బరువు తగ్గేయండి!

ఎండాకాలం వచ్చేసిందోచ్.. తాటి ముంజలతో ఈజీగా ఇలా బరువు తగ్గేయండి!

తాటి ముంజలు (plamyra) వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తాయి. తాటి ముంజలలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. ఆరు అరటి పండ్లలో ఉండే పొటాషియం కేవలం ఒక తాటి ముంజలో ఉంటుందని వైద్య నిపుణులు చెబుతారు. ఇప్పుడు మనం తాటి ముంజలను తీసుకుంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాల (Health benefits) గురించి తెలుసుకుందాం..  

2 Min read
Author : Navya G
Published : Feb 24 2022, 01:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18

తాటి ముంజలను ఐస్ యాపిల్ (Ice Apple) అని కూడా పిలుస్తారు. తాటి ముంజలలో నీటి శాతం అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో వీటిని తీసుకుంటే శరీరానికి చల్లదనం లభిస్తుంది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం, కాల్షియం, ఫైబర్, ఫాస్పరస్, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి ఎనర్జీ బూస్టర్ (Energy booster) గా సహాయపడుతాయి.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

వడదెబ్బ నుంచి కాపాడుతాయి: తాటి ముంజలను తీసుకుంటే దప్పిక, నోరు ఎండిపోయినట్లు ఉండే సమస్యలను తగ్గించడంతో పాటు డీహైడ్రేషన్ (Dehydration) బారినపడకుండా శరీరాన్ని కాపాడుతుంది. ఇది శరీరాన్ని చల్లబరిచి తీవ్రమైన ఎండ కారణంగా కలిగే వడదెబ్బ (Sunstroke) నుండి  కాపాడుతాయి.
 

38

చర్మ సమస్యలను తగ్గిస్తుంది: వేసవి కాలంలో ఎండ తీవ్రత అధికంగా ఉండటంతో చర్మం పొడిబారడం, నల్లబడటం, చర్మంపై చెమట పొక్కులు (Sweat blisters) వంటి సమస్యలు ఏర్పడతాయి. అలాంటప్పుడు తాటి ముంజలు తీసుకుంటే చర్మ సమస్యలను (Skin problems) దూరం చేసి చర్మానికి కావాల్సిన తేమను అందిస్తాయి.
 

48

బరువును తగ్గిస్తుంది: తాటి ముంజలు జీరో ఫ్యాట్ (Zero fat) ను కలిగి ఉంటాయి. అలాగే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గుతారు (Lose weight). కనుక బరువు తగ్గాలనుకునేవారు ఎటువంటి భయం లేకుండా వీటిని డైట్ లో తీసుకోవచ్చు.
 

58

రోగనిరోధక శక్తిని పెంచుతుంది: అధిక ఎండ కారణంగా శరీరం శక్తిని కోల్పోతుంది. తాటి ముంజలను తీసుకుంటే ఇందులో ఉండే ఔషధ గుణాలు (Medicinal properties) శరీరానికి కావలసిన పోషకాలను, ఖనిజాలను అందించి ఎనర్జీ బూస్టర్ గా సహాయపడుతుంది. శరీర రోగనిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది.
 

68

క్యాన్సర్ ను నివారిస్తుంది: క్యాన్సర్ విరుగుడుగా (Antidote to cancer) కూడా తాటిముంజలు సహాయపడతాయి. ఇందులో ఉండే పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కణాల (Cancer cells) వ్యాప్తిని అడ్డుకుని వివిధ రకాల క్యాన్సర్లను అడ్డుకుంటాయి. కనుక తాటి ముంజలను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది.
 

78

ఎముకలకు బలాన్ని ఇస్తుంది: తాటి ముంజలలో క్యాల్షియం (Calcium) పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలకు కావలసిన పోషకాలను అందించి ఎముకలకు బలాన్ని ఇస్తుంది. దీంతో ఎముకలు దృఢంగా (Bones Strong) మారుతాయి. అలాగే మోకాళ్ళ నొప్పులు, కీళ్లనొప్పులు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి.
 

88

అంతేకాకుండా తాటి ముంజలను తీసుకుంటే బీపీ అదుపులో ఉండటంతో పాటు గుండె ఆరోగ్యంగా (Heart health) ఉంటుంది. అలాగే మధుమేహాన్ని (Diabetes) కూడా తగ్గిస్తుంది. కనుక ఇన్ని ఔషధగుణాలను కలిగిన తాటి ముంజలను వేసవికాలంలో తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు.

About the Author

NG
Navya G

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved