MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Health
  • Weight loss: బరువు తగ్గాలంటే.... ఇది చాలా ముఖ్యం తెలుసా..?

Weight loss: బరువు తగ్గాలంటే.... ఇది చాలా ముఖ్యం తెలుసా..?

మీరు నిద్రలేచిన వెంటనే అల్పాహారం తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించాలి. నిజానికీ..  ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు రాత్రి భోజనానికీ.. ఉదయం అల్పాహారానికి మధ్య 12గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 29 2022, 10:39 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
weight loss

weight loss

బరువు తగ్గేందుకు మనలో చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.  ముందు భోజనం మానేస్తారు. లేదంటే.. ప్రోటీన్ ఆహారం తీసుకుంటారు. ఇంకా లేదంటే.. వ్యాయామాలు చేస్తారు.  ఇలా రకరకాల జాగ్రత్తలు తీసుకుంటారు. ఒకే.. ఇవన్నీ మంచిదే.. అయితే.. అంతకంటే ముఖ్యమైన ఓ విషయాన్ని మాత్రం విస్మరించకూడదని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలంటే వీటితో పాటు.. భోజనానికీ.. భోజనానికీ మధ్య ఎంత గ్యాప్ ఉండాలి అనే విషయం కూడా చాలా ముఖ్యమని వారు సూచిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

పోషకాహార నిపుణుడు అడెల్లె డేవిస్ 1960లలో "అల్పాహారం రాజులా తినండి, మధ్యాహ్న భోజనం యువరాజులాగా , రాత్రి భోజనం పేదవాడిలాగా తినండి" అనే మంత్రాన్ని ప్రచారంలోకి తెచ్చారు. ఎందుకంటే రోజులో సరైన సమయంలో శరీరానికి ఇంధనం నింపడం వల్ల శక్తికి తగిన కేలరీలు అందుతాయి.
 

38


మీ శరీరంలోకి ఎలా, ఎప్పుడు, ఏమి వెళ్తుంది అనేది మీ శరీర ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. శరీరానికి ఆహారం రూపంలో ఇంధనం నిరంతరం సరఫరా కావాలి.ఈ సరఫరా తగినంతగా , సరైన నమూనాలో ఉండాలి, తద్వారా నమూనా విచ్ఛిన్నమైతే శరీరం వేచి ఉండాల్సిన అవసరం లేదు లేదా దాని స్వంత మార్గాన్ని ప్రారంభించదు. కాబట్టి ప్రతి వ్యక్తి భోజనం కోసం ఒక రొటీన్ ఉండాలి.

48

" భోజనానికీ భోజనానికీ మధ్య 6 గంటల వ్యవధిలో ఆహారం తీసుకోవడం , 18 గంటల పాటు ఉపవాసం ఉండటం వల్ల గ్లూకోజ్ ఆధారిత శక్తి నుండి కీటోన్ ఆధారిత శక్తికి జీవక్రియ మారుతుందని, ఒత్తిడి నిరోధకత, దీర్ఘాయువు పెరగడం , క్యాన్సర్ వంటి  వ్యాధుల సంభవం తగ్గుతుంది. ఉబకాయం కూడా తగ్గుతంది’’ అని నిపుణులు పరిశోధనలో తేలింది.
 

58

మీరు నిద్రలేచిన వెంటనే అల్పాహారం తీసుకుంటున్నారా లేదా అనే విషయాన్ని కూడా గమనించాలి. నిజానికీ..  ఆరోగ్యంగా ఉండాలి అనుకునేవారు రాత్రి భోజనానికీ.. ఉదయం అల్పాహారానికి మధ్య 12గంటల గ్యాప్ ఉండేలా చూసుకోవాలి. మీరు ఉదయాన్నే 6 గంటలకు లేచినా.. రాత్రి భోజనం చేసి 12 గంటలు అయిన తర్వాత మాత్రమే.. అల్పాహారం తీసుకోవాలి. దీని కోసం త్వరగా పడుకోవడం.. తొందరగా లేవడం అలవాటు చేసుకోవాలి. ఇది మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది.

68
weight loss

weight loss

మనం తిన్న ఆహారం జీర్ణం కావడానికి మన జీర్ణవ్యవస్థకు దాదాపు 4 గంటల సమయం పడుతుంది. అల్పాహారం తీసుకున్న తర్వాత కనీసం 4 గంటల తర్వాత భోజనం చేయాలి. అల్పాహారం, మధ్యాహ్న భోజనం మధ్య వ్యవధిని మరీ ఎక్కువ కాకుండా  జాగ్రత్త తీసుకోవాలి, ఇది ఎసిడిటీకి దారితీయవచ్చు.

78

ఇక.. మధ్యాహ్నం భోజనానికీ.. రాత్రి భోజనానికీ కూడా గ్యాప్ నాలుగు గంటలు ఉంటే మంచిదే కానీ.. అది ఉదయం అల్పాహారానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి.. కొద్దిగా ఆలస్యం చేసుకోవడంలో తప్పులేదు. అయినప్పటికీ రాత్రి భోజనం ఎంత త్వరగా ముగిస్తే.. ఆరోగ్యానికి అంత మంచిది.

88

అయితే.. ఈ టైమ్ గ్యాప్స్ అందరివల్ల సాధ్యం కావు. కొందరికి వెంటనే ఆకలి వేస్తూ ఉంటుంది. అలాంటివారు.. ఆ ఆకలిని తగ్గించడానికి మధ్యమధ్యలో డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. దీని వల్ల ఆకలి కంట్రోల్ అవ్వడంతో పాటు... ఆరోగ్యానికి కూడా ఎలాంటి హాని జరగదు. ఇక సులభంగా బరువు కూడా తగ్గే అవకాశం ఉంటుంది. 

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Nail Polish: నెయిల్ పాలిష్ వాడితే నిజంగానే క్యాన్సర్ వస్తుందా? మెడికల్ ఎక్స్‌పర్ట్స్ ఏం చెబుతున్నారంటే
Recommended image2
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image3
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved