డయాబెటీస్ రావొద్దంటే ఇలా చేయండి
డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతూ ఉంది. మన జీవన శైలే ఇందుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని టిప్స్ ను పాటిస్తే మీకు డయాబెటీస్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.

diabetes
టైప్ 2 డయాబెటిస్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. డయాబెటిస్ ఒక జీవనశైలి వ్యాధి. ఇది రక్తంలో గ్లూకోజ్ లేదా చక్కెర స్థాయిలను వేగంగా పెంచుతుంది. జీవనశైలిలో మార్పుల కారణంగా మధుమేహంతో బాధపడే వారి సంఖ్య పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ప్రస్తుత జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకుంటే మధుమేహాన్ని కొంతవరకు నియంత్రించొచ్చు. డయాబెటిస్ ఉన్నవారు సరైన ఆహారం తినాలి. అలాగే కంటినిండా నిద్రపోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. డాక్టర్ సిఫారసు చేసిన మందులను వాడాలి. మానసిక స్థితిని ఆరోగ్యంగా ఉంచుకోవాలి.
diabetes
మధుమేహంలో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి టైప్-1 డయాబెటిస్. రెండు టైప్-2 డయాబెటిస్. టైప్ -2 డయాబెటిస్ శరీరంలో ఇన్సులిన్ హార్మోన్ కోల్పోవడం, స్థాయిలు తగ్గడం వల్ల వస్తుంది. అలాగే ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే బీటా కణాలు నాశనం కావడం, ఆ తర్వాత రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగడం వల్ల టైప్-1 డయాబెటిస్ వస్తుంది. ప్రస్తుతం చాలా మందికి టైప్ 2 డయాబెటీస్ వస్తోంది. ఇది ఎలాంటి లక్షణాలు లేకుండా వస్తుంది. విపరీతమైన అలసట, బరువు బాగా తగ్గడం, అధిక దాహం, తరచూ మూత్రవిసర్జన ఈ డయాబెటీస్ లక్షణాలు. డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బరువు కంట్రోల్
డయాబెటీస్ రాకుండా ఉండేందుకు ముందుగా మీరు చేయాల్సిన పని బరువును కంట్రోల్ లో ఉంచడం. ఎందుకంటే అధిక బరువు ఉన్నవారికే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే లిమిట్ లో తినండి. కేలరీలను తక్కువగా తీసుకోండి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
వ్యాయామం
ప్రతి ఒక్కరికీ వ్యాయామం చాలా ముఖ్యం. రోజుకు కనీసం అరగంట పాటైనా వ్యాయామం చేయండి. మధుమేహాన్ని నియంత్రించడానికి, హృదయ సంబంధ వ్యాధులను నివారించడానికి ప్రతిరోజూ వాకింగ్ చేయండి.
ఆహారం
డయాబెటిస్ ప్రమాదాన్ని నివారించడానికి మీరు తినే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు తినే ఆహారంలో ఉండే కార్బోహైడ్రేట్లు, చక్కెరల గురించి తెలుసుకోవాలి. మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, చక్కెరను తగ్గించడానికి అవసరమైన జాగ్రత్తలు తీసుకోండి. మీ ఆహారంలో కూరగాయలు, ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారాలను చేర్చండి. డయాబెటిస్ ఉన్నవారు తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఆహారాన్ని తినాలి.
Image: Getty
ఆల్కహాల్
ఆల్కహాల్ మీ ఆరోగ్యానికి ఏరకంగానూ మంచిది కాదు. దీన్ని మోతాదుకు మించి తాగితే లేని పోని రోగాలు వస్తాయి. అందులో డయాబెటీస్ ఒకటి. అవును నిపుణుల ప్రకారం.. మందును ఎక్కువగా తాగితే డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.