Young Look: ఈ 3 అలవాట్లతో ఆరోగ్యం, యవ్వనం మీ సొంతం!
ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండాలని అందరూ కోరుకుంటారు. కానీ దానికోసం ఏం చేస్తున్నామనే దానిపై ఎవరూ శ్రద్ధ పెట్టరు. మరి హెల్తీ లైఫ్ స్టైల్ లీడ్ చేయాలంటే కొన్ని మంచి అలవాట్లు తప్పకుండా చేసుకోవాలి. అవెంటో వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో ఇక్కడ చూద్దాం.

ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడం ఎంతముఖ్యమో అందుకోసం తీసుకునే ఆహారం కూడా అంతే ముఖ్యం. ఆరోగ్యకరమైన జీవితానికి పోషకాహారంతో పాటు వ్యాయామం కూడా చాలా అవసరం. అప్పుడే రోజంతా ఉత్సాహంగా, సంతోషంగా ఉంటారు. మరి ఆరోగ్యకరమైన జీవితం కోసం తప్పకుండా పాటించాల్సిన మూడు అలవాట్ల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ప్రోటీన్ శాతం;
తినే ఆహారంలో ఎక్కువ ప్రోటీన్ ఉండేలా చూసుకోండి. ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ప్రోటీన్ ఉంటే శరీరం బలంగా మారుతుంది. అంతేకాకుండా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఆరోగ్యంగా ఉంటారు.
వాకింగ్:
ప్రతిరోజు కనీసం ఒక గంట నడవడం అలవాటు చేసుకోవాలి. ప్రతిరోజు ఒక గంట నడవడం వల్ల కీళ్ళు బలంగా అవుతాయి. జీవక్రియ పెరిగి, బరువు అదుపులో ఉంటుంది. శరీరాన్ని సమతుల్యంగా ఉంచడానికి నడక సహాయపడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గి, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. దీనివల్ల యవ్వనంగా కనిపిస్తారు.
నీటి శాతం:
శరీరానికి తగినంత నీరు అందకపోతే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. శరీరంలో నీటి శాతం తక్కువగా ఉంటే తలనొప్పి, మైకం లాంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా కాలేయంలో సమస్యలు, కిడ్నీలో రాళ్లు ఇతర వ్యాధులు కూడా వస్తాయి. ప్రతిరోజు రెండు నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగడం వల్ల చర్మం తేమగా ఉంటుంది. మలబద్ధకం రాకుండా కూడా నివారించవచ్చు.
ఎక్కువ కాలం జీవించడానికి:
ఎక్కువ రోజులు జీవించడానికి ఆరోగ్యం చాలా ముఖ్యం. దీని కోసం పోషకాహారం తినాలి. మితంగా తినడం అవసరం. పండ్లు, తృణధాన్యాలు, మంచి కొవ్వులు ఉన్న ఆహారాలు, డ్రై ఫ్రూట్స్, విత్తనాలు లాంటివి తరచుగా తీసుకోవచ్చు. దీనివల్ల వృద్ధాప్యం త్వరగా రాదు. ఎక్కువ కేలరీలు తీసుకోవడం మానేసి, తక్కువ కేలరీలలో ఆరోగ్యకరమైన ఆహారాలు తినడం వల్ల వ్యాధులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి.
తినకూడని ఆహారాలు:
ఎంత ఆరోగ్యకరమైన ఆహారమైనా, దాన్ని మితంగా తిన్నప్పుడే ఫలితం ఉంటుంది. చపాతీ కదా అని 10 తింటే అది తప్పు. చపాతీ, అన్నం రెండింటిలో కార్బోహైడ్రేట్లు ఉంటాయి. కాబట్టి శరీర బరువుకు, జీవనశైలికి తగినట్లుగా మితంగా, తక్కువగా తినండి. జంక్ ఫుడ్, ఎక్కువ మొత్తంలో మాంసాహారం తినకూడదు.