Health tips: 45 దాటిన వారు వాకింగ్ చేస్తే ఏమవుతుందో తెలుసా?
రోజూ కాసేపు వాకింగ్ చేయడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఉదయాన్నే కాసేపు వాకింగ్ చేస్తే రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మరీ ముఖ్యంగా 45 దాటిన వారిపై వాకింగ్ మంచి ప్రభావం చూపిస్తుంది అంటున్నారు నిపుణులు.

నడక అన్ని వయసుల వారికి మంచిదే. ఉదయం కాసేపు, సాయంత్రం కాసేపు నడిస్తే సగం జబ్బులు మన దగ్గరికి రాకుండా ఉంటాయి అంటున్నారు నిపుణులు. మరీ ముఖ్యంగా 45 వయసు దాటిన వారికి వాకింగ్ వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని చెబుతున్నారు. అవెంటో ఇక్కడ చూద్దాం.
వాకింగ్ బెనిఫిట్స్
రోజు నడవడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుందనే విషయం మనకు తెలుసు. కానీ ఈ అలవాటు వల్ల 45 ఏళ్ల తర్వాత తుంటి ఎముక విరిగే ప్రమాదం సగానికి తగ్గుతుందని చెబుతున్నారు నిపుణులు. బీపీ ఉన్నవాళ్లు ప్రతిరోజు నడవాలని సూచిస్తున్నారు.
వాకింగ్ ఎందుకు?
వృద్ధులు ఇంటికే పరిమితం కావడం వల్ల డిప్రెషన్‌కు గురవుతారు. వాకింగ్ చేయడం వల్ల బయటకు వెళ్లి తెలిసిన వాళ్ళతో మాట్లాడితే మనసు తేలికవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.
ఎంతసేపు నడవొచ్చు?
వయసు పైబడినప్పుడు కొన్ని వ్యాయామాలు చేయడం కష్టం అవుతుంది. కానీ, ప్రతిరోజు వ్యాయామం చేయడం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. వాకింగ్ సింపుల్ గా ఉంటుంది. కాబట్టి ఎవరైనా చేయొచ్చు.
ఎలా నడవొచ్చు?
వృద్ధులు నడిచేటప్పుడు వేగంగా నడవాల్సిన అవసరం లేదు. ఒకే వేగంతో నెమ్మదిగా నడవొచ్చు. వారంలో ఒకటి రెండు రోజులు మెట్లు ఎక్కొచ్చు. దీని వల్ల వారి ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు.
డాక్టర్ సలహా
నడవడానికి ముందు వార్మప్ చేయాలి. ఎంచుకున్న కొన్ని వ్యాయామాలు చేయచ్చు. దీనికోసం డాక్టర్‌ను అడగవచ్చు. ఇది మిమ్మల్ని బెణుకులు, నొప్పుల నుంచి కాపాడుతుంది. వయసు పెరిగే కొద్దీ కొన్ని రోగాలు రావడం సాధారణం. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి నడవండి.