పువ్వులతో అందమైన చర్మ సౌందర్యం.. ఈ మాస్కులు వేసుకుంటే అందమే అందం!
అందమైన చర్మ సౌందర్యం (Skin beauty) కోసం అమ్మాయిలు అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. వీటిలో భాగంగా అనేక ఆర్టిఫిషియల్ ఫేస్ ప్యాక్ లను కూడా వాడుతుంటారు. కానీ తగిన ఫలితం లభించక నిరాశ చెందుతుంటారు. అలాంటివారు సహజసిద్ధమైన చర్మ సౌందర్యం కోసం పువ్వులతో ఫేస్ ప్యాక్ (Face pack with flowers) లను తయారు చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. పూలు జడలో పెట్టుకోవడానికి, దేవుణ్ణి పూజించేందుకు మాత్రమే ఉపయోగపడతాయి అని చాలా మంది అనుకుంటారు. కానీ పువ్వులతో చర్మ సౌందర్యం మెరుగు పడుతుందని మీకు తెలుసా. అయితే ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా పువ్వులతో చేసుకునే ఫేస్ ప్యాక్ లు చర్మ సౌందర్యానికి ఏ విధంగా ఉపయోగపడతాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మందారం పువ్వులు, పెరుగు ఫేస్ ప్యాక్: కొన్ని మందార పువ్వులను (Hibiscus) బాగా ఎండబెట్టి మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఈ విధంగా పొడి చేసుకున్న ఒక స్పూన్ మందారపువ్వుల మిశ్రమానికి ఒక స్పూన్ పెరుగు (Curd), కొద్దిగా గంధం పొడి (Sandalwood powder) వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకొని పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీటితో (Water) ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి కావలసిన తేమను అందించి చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి సహాయపడుతుంది. చర్మ సమస్యలను (Skin problems) తగ్గిస్తుంది.
మల్లెలు, మిల్క్ ఫేస్ ప్యాక్: కొన్ని మల్లెపూలు తీసుకొని ఎండబెట్టి పౌడర్ చేసుకోవాలి. మల్లెపూల పౌడర్ (Jasmine powder) కు రెండు టీ స్పూన్ ల పాలను (Milk), రెండు టీ స్పూన్ ల ముల్తానీ మట్టిని (Multani mitti),రెండు టీ స్పూన్ ల ఓట్స్ పౌడర్ (Oats powder) ను కలిపి మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి ఫేస్ ప్యాక్ లా అప్లై చేసుకోవాలి.
అరగంట తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రపరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మంలో (Skin) పేరుకుపోయిన మృత కణాలను తొలగించి చర్మాన్ని మృదువుగా మారుతుంది. మొటిమలను (Pimples) మచ్చలను తగ్గిస్తుంది. చర్మానికి మంచి నిగారింపును అందిస్తుంది.
తామర పువ్వులు, బాదం ఫేస్ ప్యాక్: తామర పువ్వులను మెత్తని పేస్ట్ లా తయారు చేసుకోవాలి. తామర పువ్వుల (Lotus flowers) లో కొద్దిగా బాదం పొడి (Almond powder), కొద్దిగా పాలు (Milk) వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా తయారుచేసుకున్న మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి.
20 నిమిషాల తరువాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్ర పరుచుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ చర్మానికి మృదుత్వాన్ని అందించి కాంతివంతంగా మారుస్తుంది. చర్మంలో పేరుకుపోయిన మురికిని (Dirty) తొలగించి చర్మ రంధ్రాలను (Skin pores) శుభ్రపరుస్తుంది. మొటిమలను, మచ్చలను తగ్గించి చర్మానికి ఆరోగ్యాన్ని అందిస్తుంది.