MalayalamEnglishKannadaTeluguTamilBanglaHindiMarathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • KEA 2025
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Health
  • Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ తో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!

Health Tips: యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది మగవాళ్ళతో పోలిస్తే ఆడవాళ్ళలోనే ఎక్కువగా కనిపిస్తుంది. బయటికి వెళ్లే ఆడవాళ్ళకి యూరిన్ ఇన్ఫెక్షన్ అనేది చాలా ఇబ్బందికరమైన సమస్య. అయితే కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు. అదెలాగో చూద్దాం.
 

Navya G | Published : Sep 14 2023, 11:37 AM
1 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
16
Asianet Image

 సాధారణంగా యూరిన్ ఇన్ఫెక్షన్ బ్యాక్టీరియా, క్రిములు మూత్రనాళంలోకి చేరటం, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడటం, అవసరమైన నీరు శరీరానికి అందించకపోవడం వల్ల వస్తుంది. దీంతో మూత్రవిసర్జన సమయంలో మంట, నొప్పి, తరచుగా మూత్రం రావడం..
 

26
Asianet Image

 పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి వంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఉద్యోగాలకి వెళ్లే స్త్రీలకి ఈ సమస్య మరింత ఇబ్బందికి గురిచేస్తుంది. అయితే కొన్ని టిప్స్ పాటిస్తే ఈ సమస్య నుంచి త్వరగా బయటపడవచ్చు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

36
Asianet Image

ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్, ఒక స్పూన్స్ స్వచ్ఛమైన తేనె కలుపుకొని సేవించాలి. ఇలా రెగ్యులర్గా చేస్తే యూరిన్ ఇన్ఫెక్షన్ క్రమంగా దూరమవుతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుముఖం పట్టాలంటే తప్పనిసరిగా విటమిన్ సి ఫుడ్స్ తీసుకోవాలి.

46
Asianet Image

 అంటే మీ ఆహారంలో ఎక్కువగా కమల, నారింజ, ఉసిరి క్యాప్సికం వంటి పదార్థాలు ఉండేలాగా చూసుకోవాలి. అలాగే మూత్రనాళం లో పేరుకుపోయిన బ్యాక్టీరియా క్రిములను తొలగించి యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గించడంలో కలబంద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ప్రతిరోజు కొంచెం కొంచెంగా కలబందను తీసుకుంటే చాలా మంచిది.

56
Asianet Image

 దీనివలన శరీరం కూడా హైడ్రేటెడ్ గా ఉంటుంది. అలాగే పసుపు టీ లేదా పాలలో పసుపు కలుపుకొని తీసుకోవటం వలన కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఫంగల్ లక్షణాలను యూరినరీ బ్లాడర్ బ్యాక్టీరియాను అంతం చేసి ఇన్ఫెక్షన్ ను తగ్గిస్తుంది.

66
Asianet Image

 అన్నింటికన్నా ముఖ్యమైనది స్వచ్ఛమైన నీరు. ఎంత ఎక్కువగా వీలైతే అంత  నీరు తాగటం చాలా అవసరం. అదే సమయంలో కాఫీలు టీలు, కూల్ డ్రింక్ లు ఎంత వీలైతే అంత  దూరం పెట్టండి. ఎందుకంటే కొన్ని రకాల పానీయాలు ఇన్ఫెక్షన్ ని తగ్గించదు సరి కదా ఉన్న ఇన్ఫెక్షన్ ని పెంచే లక్షణాలను కలిగి ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించండి.

Navya G
About the Author
Navya G
 
Recommended Stories
Top Stories