వేరుశెనగలతో శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.. ఏంటో తెలుసా?
వేరుశెనగలు (Peanuts) అందరి వంటింటిలో అందుబాటులో ఉండే మంచి పౌష్టికాహారం. వేరుశనగపప్పులో అనేక పోషకాలు, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావలసిన శక్తిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి.

peanuts
పిల్లలకు బిస్కెట్స్, చాక్లెట్స్ బదులుగా ఈవెనింగ్ స్నాక్స్ గా పల్లీలతో చేసిన చిక్కీలను ఇస్తే వారి ఎదుగుదల బాగుంటుంది. ఇలా వేరుశెనగలను ఏదో ఒక రూపంలో శరీరానికి అందించడం మంచిదని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వేరుశెనగలు శరీరానికి ఏ విధంగా ఆరోగ్యప్రయోజనాలను (Health benefits) కలగజేస్తాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
వేరుశెనగలలో ఐరన్ (Iron), మెగ్నీషియం (Magnesium), మోనోశాచురేటెడ్ కొవ్వులు, విటమిన్ ఇ, నియాసిన్, ప్రోటీన్, మాంగనీసు, అమినో యాసిడ్స్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా వుంచడానికి సహాయపడతాయి. ఇన్ని పోషకాలు కలిగిన వేరుశెనగలను రోజు గుప్పెడు తీసుకుంటే ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి. వేరుశెనగలు శరీరానికి కలిగించే ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది: వేరుశెనగలలో ప్రొటీన్లు (Proteins) పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవెల్స్ (Cholesterol levels) ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ లెవల్స్ ను పెంచడానికి సహాయపడతాయి.
Peanuts
సెల్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది: పల్లీలలో యాంటీ ఆక్సిడెంట్లు, అల్జిమర్స్ (Alzheimer's) వంటి పోషకాలు వ్యాధులు దరిచేరకుండా కాపాడి శరీరంలో సెల్స్ డ్యామేజ్ (Cells Damage) కాకుండా రక్షణ కల్పిస్తాయి.
ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతుంది: వేరుశెనగలలో క్యాల్షియం (Calcium) అధికంగా ఉంటుంది. ఇది ఎముకల ఆరోగ్యాన్ని (Bone health) మెరుగు పరిచి ఎముకలను దృఢంగా మారుస్తుంది. కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు వంటి సమస్యలు తగ్గిస్తుంది.
గుండె ఆరోగ్యానికి మంచిది: పల్లీలలో మోనోశాచురేటెడ్ కొవ్వులు (Monounsaturated fats) ఉంటాయి. ఈ కొవ్వు పదార్థాలు గుండెకు మంచివి. వీటి కారణంగా గుండె పనితీరు మెరుగుపడి ఆరోగ్యంగా ఉంటుంది. గుండె జబ్బులకు (Heart disease) దూరంగా ఉండవచ్చు.
జ్ఞాపకశక్తిని పెంచుతుంది: వేరుశెనగలో అమినో యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మెదడు నాడీ కణాలకు సంబంధించిన కెరోటినిన్ (Carotene) ను ఉత్పత్తి చేసి మెదడు సక్రమంగా పనిచేయడానికి సహాయపడి జ్ఞాపకశక్తిని (Memory) పెంచుతుంది.
క్యాన్సర్ ను నివారిస్తుంది: వేరుశెనగలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు (Antioxidants) క్యాన్సర్లతో పోరాడే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. ఇవి శరీరంలోని క్యాన్సర్ కణాల వ్యాప్తిని అడ్డుకొని క్యాన్సర్ (Cancer) ను నివారిస్తాయి.
వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి: పల్లీలలో ఉండే నియాసిస్ (Niasis) శరీరానికి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని అందించి వ్యాధి నిరోధక శక్తిని (Immunity) పెంచుతుంది. కనుక రోజు గుప్పెడు వేరుశనగలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.
చర్మానికి హాని కలగకుండా చూస్తుంది: పల్లీలలో రెబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ బి6, ఫొలేట్లు (Folates) పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీరాడికల్స్ (Free radicals) చర్యలను నిరోధించి చర్మానికి హాని కలగకుండా చూస్తాయి.