Health Tips: పంటి నొప్పితో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేసి నొప్పి మాయం చేద్దాం?
Health Tips: సాధారణంగా పంటి సమస్యలు అంతర్లీన వ్యాధి కారణం గా రావచ్చు. ఉదాహరణకి ఏదైనా గట్టిగా కొరకటం దంతాలు లేదా కలుపుల మధ్య ఏదైనా చిక్కుకోవడం వంటి వాటి వల్ల మనం పంటి నొప్పికి గురవుతాము దీనికి మంచి పరిష్కారం నీరుల్లి. అది ఎలాగో తెలుసుకుందాం.

పంటి నొప్పికి కారణం బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, కాల్షియం లోపం లేదంటే దంతాలని సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాంటి సమయంలో ఉల్లిపాయలతో పంటి నొప్పిని దూరం చేసుకోవచ్చని హెల్త్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
ఉల్లిపాయలు యాంటీ బ్యాక్టీరియల్ మరియు క్రిమినసక స్వభావం కలిగి ఉంటాయి. మరియు పంటి నొప్పిని నియంత్రించడంలో గొప్పగా సహాయపడతాయి. ఇన్ఫెక్షన్ కలిగించే సూక్ష్మ క్రిములను చంపడం ద్వారా నొప్పి నుండి ఉపశమనాన్ని పొందవచ్చు.
వివిధ పంటి నొప్పికి ఇంటి నివారణలో ఉల్లిపాయ ఒకటి. ఉల్లిపాయ ముక్కని తీసుకొని ప్రభావితమైన పంటిపై ఉంచండి ఆ తర్వాత ఉల్లిపాయను కొరికి దంతాల మధ్య పది నిమిషాల పాటు ఉంచాలి. తర్వాత నోటిని నీటితో శుభ్రం చేసుకోండి. రెండు మూడు వారాలు కనీసం రోజుకు ఒకసారి ఇలా చేయడం వలన ప్రభావం చాలా కాలం ఉంటుంది.
పళ్లకు ఉల్లిపాయలు వాడితే దుర్వాసన సమస్య వస్తుందని అందరూ భావిస్తారు కానీ ఉల్లిపాయని ఊపుతో కలిపి ఉపయోగిస్తే ఎటువంటి సమస్య ఉండదు ఇది దంతాలని శుభ్రం చేయడమే కాకుండా దంతాల నొప్పిని కూడా దూరం చేస్తుంది.
ఉల్లిపాయను రెండు ముక్కలుగా కట్ చేసి దానిమీద ఉప్పు జల్లి నొప్పి ఉన్న పన్నుపై బాగా రుద్దాలి.ఇలా చేయటం వలన నొప్పి నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఉల్లిపాయ, నిమ్మకాయలను కలిపి ఉపయోగించడం వల్ల కూడా అనేక దంత సమస్యలను నివారించవచ్చు.
ఒక గిన్నెలో ఉప్పు నిమ్మరసం మిశ్రమాన్ని సిద్ధం చేసుకోవాలి దీనిని ఉల్లిపాయ ముక్కల ద్వారా నొప్పి ఉన్న ప్రదేశంలో రుద్దాలి.ఇలా చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందటమే కాకుండా పంటి నొప్పిని మెల్లగా దూరం చేసుకోవచ్చు.