MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Life
  • Health
  • నాలుక రంగు మారితే ఇన్ని వ్యాధులు ఉన్నట్లా? నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం!

నాలుక రంగు మారితే ఇన్ని వ్యాధులు ఉన్నట్లా? నిర్లక్ష్యం చేస్తే చాలా ప్రమాదం!

మన ఆరోగ్యం గురించి శరీరం ప్రతిరోజూ చిన్న చిన్న సంకేతాలు ఇస్తూనే ఉంటుంది. కానీ మనమే వాటిని పెద్దగా పట్టించుకోము. ముఖ్యంగా నాలుక చాలా సంకేతాలు ఇస్తుంది. నాలుక రంగు, దానిపై పూత, తడి, పొడి వంటి విషయాలు మన ఆరోగ్య స్థితిని ప్రతిబింబిస్తాయి.

3 Min read
Author : Kavitha G
Published : Oct 27 2025, 04:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
నాలుక రంగు ఆధారంగా వ్యాధులు
Image Credit : stockPhoto

నాలుక రంగు ఆధారంగా వ్యాధులు

సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి నాలుక లేత గులాబీ రంగులో, తడిగా, మృదువుగా ఉంటుంది. కానీ నాలుక రంగు, ఆకారం, పైపైన ఉండే పొర లేదా పూతలో మార్పులు వస్తే అవి శరీరంలో ఉన్న కొన్ని వ్యాధులను లేదా లోపాలను సూచిస్తాయి. నాలుకు రంగు ఎలా మారితే ఏ వ్యాధి ఉన్నట్లో ఇక్కడ తెలుసుకుందాం. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
లేత గులాబీ రంగు నాలుక
Image Credit : Getty

లేత గులాబీ రంగు నాలుక

నాలుక లేత గులాబీ రంగులో, తడిగా, సున్నితంగా ఉంటే అది మంచి రక్త ప్రసరణ, సరైన జీర్ణక్రియకు సూచన. అంతేకాదు శరీరంలోని ద్రవాలు కూడా సమతుల్యంగా ఉన్నట్లు అర్థం. నాలుక ఈ రంగులో ఉన్నవారు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటారు. నాలుకపై లైట్ గా తెల్లటి పలచని పూత ఉండటం సాధారణం.

ఎక్కువ తెలుపు రంగు నాలుక

నాలుక ఎక్కువ తెల్లగా కనిపిస్తే లేదా దానిపై మందపాటి తెల్ల పూత ఉంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్, లేదా జీర్ణక్రియ సరిగ్గా లేకపోవడం, నీరు తక్కువగా తాగడం, లేదా లివర్ పనితీరులో లోపం వంటి వాటిని సూచించవచ్చు. కొన్నిసార్లు మధుమేహం ఉన్నవారికి కూడా ఈ లక్షణం కనిపిస్తుంది. తెల్లటి పూత చాలా మందంగా ఉండి, వాసన వస్తే అది నోటి పరిశుభ్రత లోపాన్ని కూడా సూచిస్తుంది.

Related Articles

Related image1
కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
Related image2
ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
36
ఎరుపు రంగు నాలుక
Image Credit : Asianet News

ఎరుపు రంగు నాలుక

నాలుక ఎక్కువ ఎరుపు రంగులో కాంతివంతంగా కనిపిస్తే అది విటమిన్ B12, ఫోలిక్ యాసిడ్ లేదా ఐరన్ లోపాన్ని సూచించవచ్చు. అలాగే శరీరంలో వేడి ఎక్కువగా ఉన్నప్పుడు, జ్వరం వచ్చినప్పుడు లేదా డీహైడ్రేషన్ సమస్య ఉన్నప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులోకి మారుతుంది.  

గాఢ ఎరుపు రంగు లేదా ఊదా రంగు నాలుక 

నాలుక గాఢ ఎరుపు లేదా ఊదా రంగులో కనిపిస్తే అది రక్తప్రసరణ లోపం, ఆక్సిజన్ సరఫరా తగ్గడం, లేదా గుండె సంబంధిత సమస్యలను సూచించవచ్చు. కొన్నిసార్లు ఇది రక్తపోటు ఎక్కువగా ఉన్నవారిలో కూడా కనిపిస్తుంది.

46
పసుపు రంగు నాలుక
Image Credit : others

పసుపు రంగు నాలుక

నాలుక పసుపు రంగులో కనిపిస్తే లేదా పసుపు రంగు పూత ఉంటే అది లివర్ సమస్యకు సూచన. జీర్ణాశయంలో ఇన్‌ఫెక్షన్ ఉన్నప్పుడు నాలుక పసుపు రంగులోకి మారుతుంది. పసుపు పూతతో పాటు చేదుగా అనిపించడం, నోటి నుంచి వాసన రావడం, వాంతి భావన ఉండటం వంటి లక్షణాలు ఉంటే లివర్ ఫంక్షన్ టెస్ట్ చేయించుకోవడం మంచిది.

నలుపు లేదా గోధుమ రంగు నాలుక 

కొన్నిసార్లు నాలుక నలుపు లేదా గోధుమ రంగులో కనిపిస్తే అది మందుల సైడ్ ఎఫెక్ట్స్, బాక్టీరియల్ లేదా ఫంగల్ ఇన్ఫెక్షన్ కావచ్చు. కాఫీ, టీ అధికంగా తీసుకోవడం వల్ల కూడా నాలుక ఈ రంగులోకి మారవచ్చు. ఇది సాధారణంగా ప్రమాదకరం కాదు కానీ నోటి పరిశుభ్రతను మెరుగుపరచుకోవడం మంచిది.

56
బూడిద రంగు లేదా తెల్ల మచ్చలు
Image Credit : istockphoto

బూడిద రంగు లేదా తెల్ల మచ్చలు

నాలుకపై బూడిద రంగు లేదా తెల్లటి మచ్చలు ఉంటే అది ల్యూకోప్లాకియా అనే పరిస్థితికి సూచన కావచ్చు. ఇది ముఖ్యంగా పొగ తాగే అలవాటు ఉన్నవారిలో కనిపిస్తుంది. ఇలాంటి మచ్చలు త్వరగా పోకపోతే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇవి కొన్ని సందర్భాల్లో నోటి క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు కావచ్చు. 

నీలిరంగు నాలుక

నాలుక నీలం లేదా సైనోసిస్ రంగులో ఉంటే అది శరీరంలో ఆక్సిజన్ సరఫరా తగ్గిందని సూచిస్తుంది. ఇది హృదయ సమస్యలు, శ్వాసకోశ వ్యాధులు (ఉదా: ఆస్థమా, COPD), లేదా రక్తంలో హిమోగ్లోబిన్ తక్కువగా ఉండటం వలన కూడా వస్తుంది. ఇది తక్షణ వైద్య సాయం అవసరమైన పరిస్థితి.

66
చిట్లిన నాలుక
Image Credit : Twitter

చిట్లిన నాలుక

నాలుకపై చిన్న చిన్న పగుళ్లు లేదా చిట్లినట్లుగా కనిపిస్తే అది డీహైడ్రేషన్, విటమిన్ B లోపం కావచ్చు. లేదా బలహీనమైన జీర్ణక్రియను సూచించవచ్చు. కొందరికి ఇది సహజ లక్షణం కావచ్చు. కానీ నొప్పి లేదా ఇన్‌ఫెక్షన్ ఉంటే వైద్యుల సలహా తీసుకోవడం మంచిది. 

పూత లేని మెరిసే నాలుక

నాలుక పూత లేకుండా మెరిసిపోతూ ఉంటే, రక్తహీనత లేదా విటమిన్ B12, ఐరన్, ఫోలిక్ యాసిడ్ లోపాన్ని సూచిస్తుంది. ఇది జీర్ణశక్తి తగ్గడం, అలసట, నిస్పృహ, నోటి గాయాలు వంటి లక్షణాలతో కలిసి కనిపించవచ్చు. పైన చెప్పిన ఏ లక్షణాలున్నా తీవ్రతను బట్టి వైద్యులను సలహా తీసుకోవడం మంచిది.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
చిట్కాలు మరియు ఉపాయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సద్గురు హెల్త్ టిప్స్ : కిడ్నీలో రాళ్లు కరిగించే దివ్యౌషదం ఇదే
Recommended image2
White Rice: షుగర్ పేషంట్స్ కూడా అన్నం హాయిగా తినొచ్చని తెలుసా? ఎలాగంటే?
Recommended image3
ఆపరేషన్ అయిన వారికి, జ్వరం వచ్చిన వారికి బ్రెడ్ ప్యాకెట్లే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.?
Related Stories
Recommended image1
కిడ్నీలు చక్కగా పనిచేయాలంటే కచ్చితంగా తాగాల్సిన డ్రింక్స్ ఇవే!
Recommended image2
ఉదయాన్నే అల్లం టీ తాగితే ఎన్ని లాభాలో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved