నిమ్మరసాన్ని అతిగా వాడుతున్నారా.. అయితే మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!
నిమ్మ రసాన్ని (Lemon juice) తీసుకుంటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు (Benefits) కలుగుతాయని అందరికీ తెలిసిందే.

అలాగే ఆరోగ్యంతో పాటు చర్మ, జుట్టు సౌందర్యానికి కూడా మంచి ఫలితాలను అందిస్తుంది. కానీ నిమ్మరసాన్ని అతిగా వాడితే ఆరోగ్యంతో పాటు సౌందర్యానికి కూడా ముప్పు వాటిల్లుతుందని వైద్యులు అంటున్నారు. మరి ఆరోగ్యానికి కలిగే ముప్పు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
శరీరానికి ఏ పదార్థానైనా అతిగా అందిస్తే అది అనారోగ్యానికి దారితీస్తుంది. అలాగే నిమ్మరసాన్ని కూడా అతిగా తీసుకుంటే శరీరంలో అనేక అనారోగ్య సమస్యలు (Illness issues) తలెత్తుతాయి. నిమ్మరసం పుల్లగా ఉండేందుకు కారణం ఇందులోని సిట్రిక్ యాసిడ్ (Citric acid). సిట్రిక్ యాసిడ్ ప్రభావం కారణంగా శరీర ఆరోగ్యం దెబ్బతింటుంది. కనుక నిమ్మ రసాన్ని డైరెక్ట్ గా తీసుకోకుండా ఇతర పదార్థాలతో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి మంచి ఫలితాలను పొందగలం.
జీర్ణాశయ సమస్యలు: నిమ్మ రసాన్ని ఇతర పదార్థాలు ద్రవలతో కలిపి తీసుకుంటే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది. అయితే నిమ్మ రసాన్ని ఎటువంటి పదార్థాలతో కలపకుండా నేరుగా తీసుకుంటే కడుపులో యాసిడ్ లెవెల్స్ (Acid levels) పెరుగుతాయి. దీంతో జీర్ణాశయ సమస్యలు (Gastrointestinal problems) ఏర్పడతాయి. కనుక నిమ్మ రసాన్ని డైరెక్ట్ గా తీసుకోరాదు.
దంత సమస్యలు: నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తుంది. దంతాలపై ఉండే ఎనామిల్ దంతాల ఆరోగ్యాన్ని సంరక్షించే రక్షణ కవచంగా సహాయపడుతుంది. దంతాలపై ఎనామిల్ (Enamel) దెబ్బతిని దంతాలు పుచ్చడం, అరిగిపోవడం వంటి దంత సమస్యలు (Dental problems) ఏర్పాడుతాయి. కనుక డైరెక్ట్ గా దంతాలకు నిమ్మరసం తగలకుండా చూసుకోవాలి.
పెప్టిక్ అల్సర్: నిమ్మ రసాన్ని అధిక మొత్తంలో తీసుకున్నప్పుడు పొట్ట భాగంలో ఆమ్లాలు (Acids) ఎక్కువగా ఉత్పత్తి అవుతాయి. ఇవి పేగుల్లో అంతర్గత లైనింగ్ ను దెబ్బతీసి పెప్టిక్ అల్సర్ (Peptic ulcer) కు కారణం అవుతుంది. కనుక నిమ్మరసాన్ని నేరుగా తీసుకోకుండా ఇతర పదార్థాలతో జోడించి తీసుకోవడం మంచిది.
తలనొప్పి సమస్య: నిమ్మరసంలో విటమిన్ సి, టైరమిన్ అనే అమినో యాసిడ్స్ (Amino acids) ఉంటాయి. ఇవి శరీరంలో అధిక మొత్తంలో ఉన్నప్పుడు బ్రెయిన్ కు రక్తప్రసరణను ఒక్కసారిగా పెంచుతాయి. ఫలితంగా తలనొప్పి (Headache) సమస్యలకు దారితీస్తాయి. కనుక నిమ్మ రసాన్ని అధిక మొత్తంలో కాకుండా తగిన మోతాదులో తీసుకోవడం మంచిది.
యూరిన్ సమస్యలు: నిమ్మరసంలో ఉండే అసిడిక్ నేచర్ కారణంగా శరీరానికి విటమిన్స్ అధిక మొత్తంలో అందుతుంది. శరీరంలో విటమిన్ సి (Vitamin C) అధికంగా ఉన్నప్పుడు అది యూరినేషన్ (Urination) ను పెంచుతుంది. ఫలితంగా ఎక్కువసార్లు మూతవిసర్జన జరుగుతుంది. కనుక నిమ్మ రసాన్ని తగిన మోతాదులో తీసుకోవడమే మంచిది.
చర్మ సమస్యలు: చర్మ సంరక్షణలో (skin care) నిమ్మరసాన్ని వివిధ రకాలుగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసాన్ని డైరెక్ట్ గా చర్మానికి ఉపయోగిస్తే ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ కారణంగా చర్మం సున్నితత్వాన్ని కోల్పోవడం, దురద, మంట వంటి చర్మ సమస్యలు (Skin problems) కలుగుతాయి.
జుట్టు సమస్యలు: జుట్టు సంరక్షణకు తలకు నేరుగా నిమ్మరసాన్ని అధిక మొత్తంలో వాడుతుంటారు. ఇలా అధిక మొత్తంలో నిమ్మ రసాన్ని వాడితే ఇందులో ఉండే సిట్రిక్ కారణంగా చర్మ కణాలు (Skin cells) బలహీనంగా మారి దెబ్బతింటాయి. దీంతో జుట్టురాలే సమస్యలు (Hair loss problems) ఏర్పడతాయి. కనుక నిమ్మరసాన్ని జుట్టుకు నేరుగా వాడకండి.