నోటి పరిశుభ్రత, తెల్లని దంతాల కోసం సింపుల్ చిట్కాలు మీ కోసం..
నోటి పరిశుభ్రత సరిగ్గా ఉంటేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. అలాగే మన దంతాలు కూడా తలతల తెల్లగా మెరుస్తాయి. మరి నోటి పరిశుభ్రత కోసం ఎలాంటి చిట్కాలను ఫాలో కావాలంటే?

మెరిసే దంతాలు, తాజా శ్వాస మనల్ని ఎన్నో రోగాలకు దూరంగా ఉంచుతాయి. ఇవి మంచి ఆరోగ్యానికి సూచికలు కూడా. అయితే చాలా మంది నోటి పరిశుభ్రతను ఫాలో కారు. దీనివల్లే ఎన్నో నోటి, ఇతర సమస్యలు కూడా వస్తాయి. ముఖ్యంగా దంతాలు పసుపు పచ్చగా మారుతాయి. మొత్తం ఆరోగ్యాన్ని అదుపులో ఉంచడానికి దంత సంరక్షణ చాలా చాలా అవసరమన్న సంగతి మనలో చాలా మందికి తెలియదు. డయాబెటిస్, హృద్రోగులు ఎక్కువగా దీని బారిన పడుతుంటారు. గర్భిణీ స్త్రీలు కూడా నోటి ఆరోగ్య సంరక్షణ పట్ల నిర్లక్ష్యంగా ఉంటారు.
నోటి పరిశుభ్రత ఎందుకు ముఖ్యం?
నోటి కుహరం నోటిలో బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమవుతుంది. బ్రష్ సరిగ్గా చేయకుంటే మీ నోట్లో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అంతేకాదు కొన్ని సందర్భాల్లో ఇవి రక్తప్రవాహంలోకి ప్రవేశిస్తాయి. ఇది ఎన్నో ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ డయాబెటిక్ పేషెంట్లు, కార్డియాక్ పేషెంట్లపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఇన్ఫెక్షన్ ఊపిరితిత్తులకు సోకే అవకాశం కూడా ఉంది. తాజా అధ్యయనంలో గర్భిణీ స్త్రీలలో పేలవమైన నోటి ఆరోగ్యం అకాల పుట్టుక ప్రమాదంతో ముడిపడి ఉందని కనుగొన్నారు. రాత్రిపూట బ్రష్ చేయకుంటే ఆహార కణాలు దంతాల మధ్య ఇరుక్కుపోతాయి. ఇది రాత్రిపూట కిణ్వ ప్రక్రియకు దారితీస్తుంది. ఈ కిణ్వ ప్రక్రియ నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను దారితీస్తుంది. నోటి పరిశుభ్రత కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..
బ్రేక్ ఫాస్ట్ తర్వాత బ్రష్
ఉదయం నిద్ర నుంచి లేచిన వెంటనే పళ్లు తోముకోవడం కంటే బ్రేక్ ఫాస్ట్ చేసిన వెంటనే పళ్లు తోముకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది లాలాజలం మొదట ఆమ్లాలను తటస్తం చేయడానికి సహాయపడుతుంది. కాబట్టి నోటిని శుభ్రంగా కడుక్కోండి.
Image: Getty Images
రాత్రిపూట బ్రష్
రోజుకు రెండుసార్లు దంతాలను బ్రష్ చేయడం చాలా మంచి అలవాటు. ఈ ముచ్చట తెలిసినా రాత్రిపూట పళ్లు తోముకోవడం మాత్రం మానేస్తుంటాం. అయితే రాత్రి భోజనం తర్వాత బ్రష్ చేయడం వల్ల రోజంతా పేరుకుపోయిన సూక్ష్మక్రిములు వదిలిపోతాయి. దీంతో మీ నోరు పరిశుభ్రంగా ఉంటుంది.
క్రమం తప్పకుండా చెకప్ లు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. ప్రతి 7 నుంచి 8 నెలలకు ఒకసారి క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలి. లేదంటే చిగుళ్ల సమస్యలు వస్తాయి. కొంతమందికి స్కేలింగ్ లేదా నిర్వహణ చికిత్స అవసరం కావొచ్చు. చిగుళ్ల వ్యాధి లేదా దంతాల నష్టం వంటి అదనపు సమస్యలు లేకపోతే సరైన నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
ఫ్లోసింగ్, నోరు కడుక్కోవాలి
కాఫీ లేదా టీతో సహా ప్రతి భోజనం, పానీయం తర్వాత బ్రష్ చేయడం మంచి అలవాటు. అయినప్పటికీ తిన్న తర్వాత 10 నిమిషాలు వెయిట్ చేయాలి. ఇది నోటి ఉష్ణోగ్రతను సాధారణీకరించడానికి సహాయపడుతుంది. అలాగే రాత్రి భోజనం తర్వాత దంతాల మధ్య ఫ్లోసింగ్ సమగ్ర నోటి పరిశుభ్రతకు అవసరం. నోటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి మౌత్ వాష్ ను ఉపయోగిస్తుంటారు. కానీ మౌత్ ఫ్రెషనర్లు తాత్కాలిక తాజా అనుభూతిని అందించినప్పటికీ ఇవి నోటి ఆరోగ్యాన్ని కాపాడలేవు.
teeth
ఆహారాల వినియోగం
నోటి పరిశుభ్రతను పాటించడానికి శుద్ధి చేసిన చక్కెర, కార్బోనేటేడ్ పానీయాలు, చాక్లెట్ తో కూడిన ఆహారాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడాన్ని తగ్గించాలి. పాలు తాగడం వల్ల బలమైన దంతాలు ఏర్పడతాయనేది అపోహ. కానీ ఇది 5 సంవత్సరాల వయస్సు వరకు మాత్రమే వర్తిస్తుంది.