ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే మార్నింగ్ సిక్ నెస్ సమస్యలను ఇలా తగ్గించుకోండి!
మార్నింగ్ సిక్ నెస్ (Morning Sickness) అంటే ఉదయం లేచిన వెంటనే కడుపులో వికారం, వాంతులు, తల తిప్పడం, అనారోగ్యంగా ఉండడం వంటి సమస్యలు ఉంటాయి.

ముఖ్యంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఈ సమస్యలు మరింత ఇబ్బందిపెడతాయి. ఇలా మార్నింగ్ సిక్ నెస్ సమస్యలతో వచ్చే వాంతులు, వికారంను తగ్గించుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన హోమ్ రెమెడీస్ (Remedies) ను ప్రయత్నిస్తే మంచి ఫలితం ఉంటుంది. మరి అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
అల్లం, తేనె: అల్లం రూట్ లో జింజరోల్, షోగోల్స్ అనే రసాయనాలు ఉంటాయి. ఇవి ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వాంతులు, వికారం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి. ఇందుకోసం సగం స్పూన్ అల్లం రసంలో (Ginger juice) ఒక స్పూన్ తేనె (Honey) వేసి కలుపుకొని ఆ మిశ్రమాన్ని ఉదయం లేచిన తరువాత తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
పుదీనా ఆకులు, పంచదార, తేనె: కొన్ని పుదీనా ఆకులను (Mint leaves) తీసుకుని ఒక కప్పు నీటిలో వేసి బాగా మరిగించి వడగట్టి చల్లార్చుకోవాలి. ఈ నీరు గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇందులో కొద్దిగా పంచదార (Sugar), తేనె (Honey) వేసి కలుపుకొని తాగాలి. పుదీనా ఆకులలో ఉండే అనెస్తిటిక్ లక్షణాలు వాంతులు, వికారం నుంచి ఉపశమనాన్ని కలిగిస్తాయి.
నీళ్లు: డీహైడ్రేషన్ (Dehydration) సమస్య కూడా మార్నింగ్ సిక్ నెస్ కు కారణమవుతుంది. కనుక రోజకు సరిపడా నీరు (Water) తాగుతూండాలి. అప్పుడే శరీరం డీహైడ్రేషన్ బారినపడకుండా హైడ్రేషన్ లో ఉంటుంది. దీంతో మార్నింగ్ సిక్ నెస్ సమస్యలను నివారించుకోవచ్చు. కనుక రోజులో సాధ్యమైనంతవరకు ఎక్కువ నీటిని తీసుకోవాలి.
కరివేపాకులు, నిమ్మరసం, పంచదార: కరివేపాకును (Curries) నీటిలో బాగా శుభ్రం చేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకుని రసం తీయాలి. ఇప్పుడు ఈ కరివేపాకు రసానికి కొద్దిగా నిమ్మరసం (Lemon juice), పంచదార (Sugar) వేసి బాగా కలుపుకొని తీసుకోవాలి. ఇలా చేస్తే మార్నింగ్ సిక్ నెస్ కారణంగా వచ్చే వాంతులు, వికారం నుంచి ఉపశమనం కలుగుతుంది.
నిమ్మరసం: మార్నింగ్ సిక్ నెస్ సమస్యలను తగ్గించడానికి నిమ్మరసం (Lemon juice)) ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. కనుక ఒక గ్లాసు నీటిలో (Water) నిమ్మరసంను కలుపుకుని ప్రతిరోజూ ఉదయం తీసుకుంటే మార్నింగ్ సిక్ నెస్ సమస్యలు తగ్గుతాయి. నిమ్మరసం శరీరానికి సహజసిద్ధమైన మంచి రెమిడీ.
ఈ హోం రెమడీస్ ను ప్రయత్నించడంతో పాటు కొన్ని జాగ్రత్తలను (Precautions) తీసుకోవాలి. కడుపును ఖాళీగా ఉంచుకోరాదు. ఇలా చేస్తే కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. కనుక ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఆహారాన్ని తీసుకోకుండా కొద్దికొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలి. అలాగే తిన్న వెంటనే నిద్రపోరాదు. కాసేపు చిన్నపాటి వ్యాయామాలు (Exercises) చేయాలి.
ఇలా చేస్తే తిన్న ఆహారం కడుపులో సర్దుకుంటుంది. అలాగే బాగా ఉడికిన ఆహారాన్ని (Well-cooked food) మాత్రమే తీసుకోవాలి. అలాగే ప్రొటీన్లతో పాటు ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉండే ఆహార పదార్థాలను తీసుకుంటూ ఉండాలి. పాలు, కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ ను తీసుకుంటే వికారం (Nausea) మరింత పెరుగుతుంది కనుక వీటికి దూరంగా ఉండాలి.