ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారపదార్ధాలు ఏంటో తెలుసా?
నిత్యం మనం వంటల్లో ఉపయోగించే ఆహార పదార్థాలు శరీర ఆరోగ్యాన్ని (Health) మెరుగుపర్చడానికి సహాయపడతాయి. అయితే బయట మార్కెట్లో అనేక రకాల ఆహార పదార్థాలు అందుబాటులో ఉంటాయి. కొన్ని శరీరానికి మేలు చేస్తే మరికొన్ని శరీరానికి హాని (Harm) కలిగించి ప్రాణానికి ముప్పు కూడా కలిగిస్తాయి. అయితే కొన్ని పదార్థాలు అత్యంత ప్రమాదకరమైనవి అని వాటిని తీసుకుంటే శరీరానికి ముప్పు వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు అవి ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మనం తీసుకునే ఆహార పదార్థాల (Food) పట్ల సరైన అవగాహన (Awareness) ఉండాలి. ఏవి తింటే మన శరీర ఆరోగ్యానికి మేలు కలుగుతుందో తెలుసుకోవాలి. అదేవిధంగా శరీరానికి హాని కలిగించే పదార్థాల గురించి సరైన అవగాహన ఉండాలి. అప్పుడే మన ఆరోగ్యానికి ఎటువంటి హాని కలగదు.
అడవి పుట్టగొడుగులు: అటవీ పుట్టగొడుగులు (Wild mushrooms) ఇవి అత్యంత ప్రమాదకరమైన ఆహార పదార్థాలు. వీటిని కొద్దిగా తిన్నా కూడా శరీరంలో వాంతులు (Vomiting), వికారం మొదలవుతాయి. ఇలా ఈ సమస్య పెద్దగా మారి ప్రాణహాని కూడా కలిగే అవకాశం ఉంటుంది. కనుక వీటిని తినకపోవడం మంచిదని చెబుతున్నారు.
పఫ్ఫర్ ఫిష్: ఈ పఫ్ఫర్ ఫిష్ (Pufferfish) అత్యంత ప్రమాదకరమైన విషపూరిత (Toxic) చేప. ఈ చేప శరీరంలో విషపూరిత టెట్రోడోటాక్సిన్ ఉంటుంది. ఇది సైనైడ్ కంటే ఎక్కువ ప్రమాదకరమని తేలింది. కనుక ఈ చేపకు దూరంగా ఉండటమే మంచిది. ఈ చేప అత్యంత ప్రమాదకరమైన ఆహారపు జాబితాలో ఉంది.
స్టార్ ఫ్రూట్: స్టార్ ఫ్రూట్ (Star Fruit) న్యూరోటాక్సిన్లను కలిగి ఉంటుంది. ఇవి మెదడు, నాడీ వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీస్తుంది. కిడ్నీ సమస్యలు (Kidney problems) కలిగినవారు ఈ స్టార్ ఫ్రూట్ ను తీసుకుంటే ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం. కనుక ఈ స్టార్ ఫ్రూట్ ను తినకపోవడమే మంచిది.
రుబర్బ్: బ్రిటిష్ వంటకాలలో రుబర్బ్ (Rhubarb) కాడలను ఎక్కువగా వాడుతారు.ఈ రుబర్బ్ కాడలతో పాటు వచ్చే పచ్చని ఆకులు విషాన్ని కలిగి ఉంటాయి. ఈ ఆకులలో ఆక్సాలిక్ ఆమ్లం (Oxalic acid) ఉంటుంది. ఈ ఆమ్లం కడుపులోకి వెళితే జీర్ణ శక్తి తగ్గడంతోపాటు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడతాయి. కనుక ఈ రుబర్బ్ అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు.
జాజికాయ: జాజికాయ (Nutmeg) ఇది ఒక మసాలా దినుసు. ఈ జాజికాయను అధిక మొత్తంలో తీసుకుంటే శరీరానికి దుష్ప్రభావాలు (Side effects) కలుగుతాయి. వాంతులు, వికారం, నొప్పి, శ్వాస సమస్యలు అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని జాగ్రత్తగా వంటలలో వాడడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
అఖీ: జమైకాలో లభించే అఖీ (Akhi) పండు ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అని తేలింది. దీని విత్తనాలు లేకుండా మాత్రమే తీసుకోవాలి. ఈ పండు విత్తనాలలో విషపదార్థాలు (Toxins) నిండి ఉంటాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తాయి.